ఉనికెక్కడ!?

ఓ జ్ఞానీ...నీ విజయాన్ని చూసుకుని
మురిసి ఉప్పొంగి గెంతులు వెయ్యకలా

నీ విజయం కంటే నా ఓటమి పైననే
చర్చలు ఎక్కువ రేగాయి నాతలరాతలా

ఏరి కోరి ఓటమిని వరించిన ఒంటరిని
నేనే కాదు నా అస్తిత్వం కూడా ఒకకల

దేన్నీ కనబడనీయక అన్నిటికీ నవ్వేస్తూ
సగానికి పైగా శత్రువులను ఓడిస్తానలా

శత్రువుల్ని శిక్షించే కిటుకులు తెలుసుగా
కొట్టక నాదృష్టిలో వాళ్ళను చంపేస్తేపోలా

సొంతగా నిలవక వేరొకరిపై ఆధారపడితే
నీ ఉనికినే అడుక్కోవలసి వస్తుంది నాలా

నేనిప్పుడు గాజుముక్కై కంట్లో గుచ్చుకున్నా
అద్దమై ప్రతిబింబాన్ని చూపుతాలే ఏదోలా!

23 comments:

  1. దేన్నీ కనబడనీయక అన్నిటికీ నవ్వేస్తూ
    The best policy

    ReplyDelete
  2. సొంతగా నిలవక వేరొకరిపై ఆధారపడితే
    నీ ఉనికినే అడుక్కోవలసి వస్తుంది..వాస్తవం ఇదే. చక్కగా చెప్పావు తల్లీ

    ReplyDelete
  3. గెలుపు ఓటములు అనేవి దైవాదీనాలు మాడం
    మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలంచేను
    అందుకని దేని గురించీ ఎక్కువగా యోచించకండి

    ReplyDelete
  4. ఎవరి ఉనికిని వారే కనుగొనాలి కదండీ పద్మార్పితగారూ

    ReplyDelete
  5. otamilo krungipovadam ela?
    jayam kaligite anandinchi

    ReplyDelete
  6. ఎవరైనా వారి ఉనికిని కాపాడుకోవాలి
    అందుకే ప్రతి మనిషి ప్రాకులాడేది..

    ReplyDelete
  7. అద్దమై ప్రతిబింబాన్ని చూపుతా, nice quotation

    ReplyDelete
  8. అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూసి తనని తాను ఎలా తెలుసుకునేది
    అర్థమై అర్థం కానట్లుగా ఉంది అండీ పద్మాగారు.

    ReplyDelete
  9. your thoughts are so beautiful andi.

    ReplyDelete
  10. వేరెవరిపైనో ఆధారపడితే అన్నింటా ముప్పేనండీ. వెల్ సెడ్

    ReplyDelete
  11. Gelupu
    Otami
    evaru
    nirjayam
    varidi
    avutundi.

    ReplyDelete
  12. Mana behavior ni drustiloe unchukuni gamaninchali mana unkini.
    ekkada ani vethikitea adi dorukadu.

    ReplyDelete
  13. పుట్టిన రోజు నుండి సాగే పయనం
    ఉచ్వాస నిఃశ్వాస నడుమ గమనం
    ఇదే జీవిత సారం

    శ్రిత ధరణి

    ReplyDelete
  14. ఎవరి ఉనికి వారిదే

    ReplyDelete
  15. ఎలా ఉన్నారు పద్మార్పితా?

    ReplyDelete
  16. అందరికీ నమస్కారములు _/\_

    ReplyDelete
  17. అద్దమై విరక్కండి.... అద్భుతమై నిలవండి

    ReplyDelete