గతితప్పకు

చిందులేసి చిలిపిగా చూడు పర్వాలేదు
పెనవేసుకోవాలనుకో అదేం తప్పుకాదు
పేట్రేగిపోతే...చీల్చి చెండాడేస్తా చూసుకో

కలలోన కలతగ కంగారుపడితే ఏంకాదు
కావలి కాసి కలవరపెడితే ప్రమాదంలేదు
కావరమెక్కితే...కోసి కారంపెడతా కాసుకో

వ్రాసిన పదాలను చడవడం గొప్పేంకాదు
వలవేసి మౌనాన్ని చదివితే నేరమూకాదు
వలచి మోసగిస్తే...వంచి వాతేస్తా మూసుకో

గాలివాటంగా గతితప్పి గల్లంతైతే గాబరాలేదు
గుంబనంగా చితిరగిలినా బూడిదకాక తప్పదు
గుడిసేటి పనిచేస్తే...గుంతలో పాతేస్తా మానుకో

ఆడదాన్ని అందమైన బొమ్మనుకో హానీకాదు
పెద్దాచిన్నాని చూడక పైనపడితివా ఇదంలేదు
నగ్నంగా నిలదీసి...కాల్చిపారేస్తా చచ్చి పో!!

15 comments:

  1. మగాళ్లను ఇలా అక్షరాలతో భయపెడితే ఎలా అర్పిత??

    ReplyDelete
  2. గాడి తప్పని మగవాడిని వారి పెళ్ళాలు భరతం పట్టేస్తున్నారు పద్మార్పితగారు.

    ReplyDelete
  3. Rebel level lo rasaru post and pic.

    ReplyDelete
  4. మగవారిని కొట్టి
    ఆడవారికి భరోసా ఇచ్చారు

    ReplyDelete
  5. గతి తప్పిన మానవాళి
    పలికే నదిగో మహంకాళి

    కను విప్పి చూస్తే శివోహం
    కనిక రము జేరగ కటాక్షం

    అరు దరుది టువంటి వారు
    లౌకిక మును చక్క దిద్దేరు

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  6. అదరగొట్టి
    బెదరగొట్టారు

    ReplyDelete
  7. wahmmoo...........wahrinayanoy

    ReplyDelete
  8. కెవ్వుమనేలా ఉంది పోస్ట్
    చదివిన మగవాళ్ళు బుధ్ధుతో మసలుకోవాలని కోరుకుందాం.

    ReplyDelete
  9. బాగాచెప్పారు.

    ReplyDelete
  10. Strong warning ichcharu

    ReplyDelete
  11. నమస్సులు_/\_

    ReplyDelete