కరిగిపోతూ..

దినదినం నేను తరిగిపోయి కరిపోతున్నా
నీ ఊహకు కూడా అంతు చిక్కనివ్వనులే
నీకు ఆ అవసరం అవకాశం రానివ్వను!
క్షణక్షణం నిన్ను తలుస్తూ ఆవిరైపోతున్నా
నన్ను నే వెలిగించుకుంటూ బ్రతికున్నాలే
అయినా ఆ విషయం నీకు తెలీనివ్వను!
చకచకా నువ్వెళుతూ కప్పిన చీకట్లోఉన్నా
కొవ్వొత్తినై కాలిపోతూ వెలుగుని ఇస్తానులే
కరిగిన మైనం మరకైనా నీక్కనబడనీయను!
టపటపా ఆశల ఆకులు నేలరాలిపోతున్నా
మరో కలకు ఆశావాదమద్ది నిద్రలేపుతాలే
నీకు తెలియని నన్ను నేను మ్రింగేస్తాను!
రెపరెపా రెక్కలు కట్టుకుని ఎగిరెళ్ళిపోతున్నా
ఆకాశపు అంచుల్లో అద్దంలా అగుపిస్తావులే
అలా నిన్ను అంటీముట్టక అంతమైపోతాను!

23 comments:

  1. మరోమారు హృదయ ఆవేదన ఉప్పొంగింది.

    ReplyDelete
  2. చకచకా నువ్వెళుతూ కప్పిన చీకట్లో..wah

    ReplyDelete
  3. అద్భుతహా

    ReplyDelete
  4. మాటున దాగిన మనసు మీది....nice

    ReplyDelete
  5. అందరినీ అంతం చేయాలి గానీ మీరు అంతం అవడం ఏంటి??

    ReplyDelete
  6. Oh no...solo songs madam
    Only life is to enjoy.

    ReplyDelete
  7. క్షణక్షణం నిన్ను తలుస్తూ ఆవిరైపోతున్నా
    నన్ను నే వెలిగించుకుంటూ బ్రతికున్నాలే..మదిని తాకే వాక్యాలు.

    ReplyDelete
  8. మనిషి అనేవాడు ఆశాజీవి.
    ఎన్ని తిప్పలు పడిలెస్తున్నా
    మున్ముందు అంతా మంచి జరుగును అనుకుంటాడు
    అలా అనుకోకుంటే బ్రతుకగలడు......

    ReplyDelete
  9. వేదన పాళ్ళు పెచ్చు.

    ReplyDelete
  10. మనిషి ఎదగాలి అనే ఆలోచన గొప్పదే కానీ ఆ స్వార్ధం మిగతావారిని పతనం చేసేది అవ్వకూడదు. ప్రేమను పంచగలము కానీ ప్రేమించమని ఎవ్వరినీ బలవంతం చేయకూడదు.

    ReplyDelete
  11. Love failure depression antaraa?

    ReplyDelete
  12. వేదన కూడా అదుర్స్ అక్షరాల్లో.

    ReplyDelete
  13. మాంచి హుషారు పుట్టించే పోస్ట్ వ్రాయండి
    చాలా కాలంగా ఎదురు చూస్తున్నాము.

    ReplyDelete
  14. ఆ అవసరం అవకాశం??????????????????

    ReplyDelete
  15. ami cheppakunte yetla telustadi madam :)

    ReplyDelete
  16. స్పందించే ఎన్నో హృదయాలకు అర్పిత అభివందనము.

    ReplyDelete
  17. Nice heart touching words.

    ReplyDelete
  18. నిస్వార్థ ప్రేమను చక్కగ వర్ణించారు 🙏🙏

    ReplyDelete