తలగడమంత్రం

తెల్లని సుతిమెత్తని మనసువంటి వెన్నపూసిన ఇడ్లీలను
పప్పులపొడితో తినమంటే పల్లీపచ్చడే పసందు అంటావు
దూది బంతుల్లా గుండ్రంగా నా బుగ్గల్లాంటి బొండాలను
బిడియంవీడి బోళాగా పెడితే ఎర్రకారంలో అద్దమంటావు
దొడ్డు బియ్యం రుబ్బి దోరగా ఒకవైపు కాల్చిన దోశలను
వేడిగా ప్లేటులో వడ్డిస్తే కొబ్బరిపచ్చడి ఏదని అడుగుతావు
గుళ్ళు మినప్పప్పుతో నా చక్రాల కళ్ళవంటి చిట్టిగారెలను
ఆడుతూపాడుతూ అందించగా చిల్లు చిన్నది అంటున్నావు
మైదాలేని గోధుమపిండి కలిపి పూర్తిగా పొంగిన పూరీలను
నవ్వుతో అందిస్తేనేమి నంజుకోడానికి కుర్మా కావాలంటావు
సొట్టచెంపల సొగసులద్ది ప్రేమతో వేసిన పెసరపునుగులను
పవిటమెలిపెట్టి ప్లేటులో పెట్టిస్తే చల్లదనానికి పెరుగేదన్నావు
ఆదరువుగా అలిగిన నీకు జీడిపప్పూ నెయ్యివేసిన ఉప్మాను
అందించబోవ ఉప్మా కన్నా ఉపవాసం నయమని అరిచావు
ఆకలి వేస్తే ఏమివ్వాలో తెలియని అమాయకురాలిని నేను
అన్నీ తెలిసిన అగంతకుడివి అసలుకే ఎసరు పెట్టేస్తున్నావు
అందించే అల్పాహారాలు అన్నింటికీ ఏదోక వంకపెట్టే నీవు
అర్ధరాత్రి దీపమార్పి దిండు మంత్రమేస్తే దిమ్మతిరిగిపోతావు

24 comments:

  1. అదే అదే నేను కోరుకుందని
    గెంతులు వేసి గోల చేస్తాడు ఏమో
    జాగ్రత్త సుమండీ................

    ReplyDelete
  2. చివరి రెండు లైన్లలో శృంగారం ఒలికించారు..అది చాలు

    ReplyDelete
  3. ఆకలి వేస్తే ఏమివ్వాలో తెలియని అమాయకురాలిని...ఇది నిజమా?????????????

    ReplyDelete
  4. ఇడ్లీ
    బొండా
    దోశ
    చిట్టిగారె
    పూరీ
    పెసరపునుగు
    ఉప్మా
    No use madam
    Only Love is enough

    ReplyDelete
  5. enta vaiyyaranga vata pettaru...ha ha ha ha

    ReplyDelete
  6. బిడియం వీడిన తరువాత ఇంక బోళాతనం ఎక్కడిది చెప్పండి.

    ReplyDelete
  7. చాన్నాళ్ళకు మళ్ళీ పద్మార్పిత ప్రత్యక్షం అయ్యింది.

    ReplyDelete
  8. రాతిరి పగటి కై వేచి చూడదు అది కాలంతో కదలాడుతుంది అంతే
    వేకువ నిశిధీలో సమాయత్తం అవుతుంది అంతే

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  9. Oh....mee bannee lo maro andamaina kavita.

    ReplyDelete
  10. మురిపించి మరిపించడంలో మీకు మీరే సాటి.

    ReplyDelete
  11. మీ కోణంలో ఆలోచిస్తే
    అంతా సవ్యంగానే చేసారు
    ఎటొచ్చి దిమ్మతిరిగినవడి గతే...

    ReplyDelete
  12. ఆదరవు కోసం అలగటం బాగుంది.

    ReplyDelete
  13. దిండు మంత్రం
    జబర్దస్త్...మస్త్

    ReplyDelete
  14. ఏమి మంత్రము వేస్తారో
    ఏమి మత్తుని చల్లుతారో
    మగాళ్ళు మఠాష్...అంతే

    ReplyDelete
  15. దిండు మంత్రమేస్తే దిమ్మతిరిగిపోతాది.

    ReplyDelete
  16. అందరికీ ధన్యవాదములు.

    ReplyDelete