ఛీ పోరా..

వాగేవాడితో వాగ్వివాదం ఎందుకని
వాటేసుకుని వయ్యారాలు బోతిని...
తెగించినోడికి తెడ్డే లింగం అనుకుని
తెలివిగా తప్పించుకుని తలపడితిని
కసురుకునేటోడికి కవ్వింపు ఎందుకని
కనుసైగతో కసిరి కాపురం చేస్తిని...
నవ్వరానోడికి నిక్కులెక్కువ అనుకుని
నపుసంకుడికి రంభ దొరకెననుకుంటిని
అలిగినోడితో ఆటవిడుపు ఎందుకని
అదును కోసం అదేపనిగా చూస్తిని...
చిరాగ్గా ఉంటే చిద్విలాసం అనుకుని
చిర్రుబుర్రులాడితే చిలిపిగా నవ్వితిని
ముట్టుకుంటే మూలగటం ఎందుకని
ముద్దుకి మురిసి గుద్దుకి అరుపేలని...
తిడితే చచ్చి దీవిస్తే బ్రతకరు అనుకుని
తిట్టనంటూ "ఛీ పోరా" గాడిద అంటిని!

23 comments:

  1. చిలిపిగా ఛీ పొమ్మన్నారు

    ReplyDelete
  2. గట్ల తిట్టి...పొమ్మని అంటే రమ్మని గదా

    ReplyDelete
  3. ఫుల్గా ప్రేమించిన వారు ఇలా గడ్డిపెట్టి గాడిదా అని తిడతారన్నమాట...బహు హుషారు

    ReplyDelete
  4. తెగించినోడికి తెడ్డే లింగం
    సామేతలతో సమన్వయం చేసారు
    చిత్రం చూడ ముచ్చటగా ఉంది

    ReplyDelete
  5. అలిగినోడి ఆటవిడుపు :)

    ReplyDelete
  6. ఎవరు ఏం అనుకుంటే ఏమిటి మా పని మాదే

    ReplyDelete
  7. తెలివిగా తిట్టి తప్పించుకోవడం అంటే ఇదే మాదిరేమో

    ReplyDelete
  8. ela thittina bagundi :-)

    ReplyDelete
  9. ఎలా పిలిచినా
    పో పొమ్మన్నా
    రారమ్మన్నట్లే అనుకుంటేపోలా

    ReplyDelete
  10. Bheshugga thittabadina adhrushtavantudu.

    ReplyDelete
  11. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసారూ
    చిరాకు పడి వద్దన్న వాళ్ళ వెంట పడతారు

    ReplyDelete
  12. మీరు ఏమన్నా వినసొంపే కదా
    చాలా బాగుంది బొమ్మకు తగిన వాక్యాలు

    ReplyDelete
  13. చిర్రుబుర్రులాడితే చిలిపిగా నవ్వి nice

    ReplyDelete
  14. Chala nachchindi
    meeru ala tittaru :-)

    ReplyDelete
  15. నపుసంకుడికి రంభ దొరకెను????? too much

    ReplyDelete
  16. సుందరాంగి ఏమన్నా ఓకే
    అందునా పద్మార్పిత ఫ్రెండ్

    ReplyDelete
  17. అందమైన సామెతల కూర్పుతో అలరించారు.

    ReplyDelete
  18. అక్షరాభిమానులకు వందనములు _/\_

    ReplyDelete
  19. ఏదేమైనా మీరు ట్రెండ్ సెట్టర్ అని మరోమారు రుజువైంది

    ReplyDelete