మారుతున్న లోకం

ఎన్నో భావాలు రంగులు మార్చి పారిపోతుంటే
పొందికతో పదిలపరచాలని ప్రయత్నం చేస్తున్నా
మనస్తత్వ పోకడల్ని అనుగుణంగా మార్చేస్తుంటే
అవగాహననే ఆహారాన్ని జీర్ణించుకోలేక పోతున్నా
ఆశయాలను అలంకరించి అంగట్లో అమ్ముతుంటే
మనస్శాంతి కరువై నష్టవ్యాపారమని వాపోతున్నా
ఎండిపోయి బీడులా బలహీనమై బంధంక్షీణిస్తుంటే
ఆశామ్లధారతో అనురాగాన్ని తడిమి తడుపుతున్నా
రెక్కవిరిగిన పక్షినై కూడా ఎగరలేక ఎగరబోతుంటే
చీకటి వాస్తవాల నడుమ రేచీకటితో తచ్చాడుతున్నా
నా భావభంగిమలు లోకజ్ఞానంలేక చిందులేస్తుంటే
వాటిపై పొగడ్తల వర్షం కురవాలని ఆశపడుతున్నా
మారుతున్న లోకానికి తగినట్లుగా మారాలనుకుంటే
రాజీకి రాని మనసూ మెదడుల మధ్య నలుగుతున్నా

20 comments:

  1. లోకంతో పాటు మారవలసిందే

    ReplyDelete
  2. మెదడుకు మనసుకు మధ్య సంఘర్షణ కొత్త విప్Loveఆనికి నాంది అన్నమాట

    ReplyDelete
  3. sangarshana tappadu pratee manishikey

    ReplyDelete
  4. చాలా బాగుంది

    ReplyDelete
  5. critical to understand few lines
    art picture is very nice

    ReplyDelete
  6. మనస్తత్వ పోకడల్ని అనుగుణంగా మార్చేస్తుంటే...మనిషికి ఇది సర్వసాధారణం అండీ

    ReplyDelete
  7. అందరి భావాలు రంగులు మారటం సహజం పద్మగారు

    ReplyDelete
  8. Manasuni avishkarincharu

    ReplyDelete
  9. వారెహ్ వాహ్...లోకం మారదు
    మనుషులు వారి మనస్తత్వాలు మారతాయి

    ReplyDelete
  10. లోకం కాదు మారుతున్నది
    మనం మారి లోకాన్ని అంటాం

    ReplyDelete
  11. మనసు ఆవిష్కరణ

    ReplyDelete
  12. gayapadina mansu geetam antara? Nice photo

    ReplyDelete
  13. మనస్తత్వ పోకడల అనుగుణంగా మనిషి.

    ReplyDelete
  14. అక్షరాభిమానులకు నమస్సులు _/\_

    ReplyDelete