కొత్త భ్యాష్యం

నిన్ను చూసి స్థంబించిన మ్రానులా నీపై వాలినప్పుడు
బరువనుకుని ప్రక్కకు జరుగకు అది నా అనురాగం!
పెగలని నా పెదాలు నీ పెదాల్ని లేతగా తాకినప్పుడు
గట్టిగా అరచి గోలచేయకు అదేగా వలపు చుంబనం!
నా చేతివేళ్ళు నీ తలను నిమురుతూ చెరిపేస్తున్నప్పుడు
వెర్రని చిరాకుపడకు అదేమో వ్యామోహానికి నిదర్శనం!
నా మోము నీ చేతుల రాపిడికి ఎర్రగా మారినప్పుడు
కనురెప్పల్ని వాల్చ బాధనా అనడక్కు అదే ఆలంబనం!
మనిద్దరి హస్తాలు హత్తుకుని నులుముకుంటున్నప్పుడు
అదేదో పెనుగులాటని వాపోకు అదో వినపడని గేయం!
వెచ్చని శ్వాస ధ్యాసలు రెండూ వివస్త్రలై ఏకమైనప్పుడు
ఉప్పగుంది స్వేదం అనకు అది అంతరోష్ణ ప్రేమద్రవం!
రెండు శరీరాలు పెనవేసుకుని లతలా అల్లుకున్నప్పుడు
ఒకరికొకరము బంధీలైనాం అనుకోకు అదొక బాంధవ్యం!


25 comments:

  1. New definitions of love era with beautiful painting.

    ReplyDelete
  2. మీ పదబంధాల్లో ఏదో మ్యాజిక్ ఉంది

    ReplyDelete
  3. సున్నిత వలపు భావాలు అద్భుతంగా పలికించారు....అభినందనలు

    ReplyDelete
  4. వైవిధ్యంగా
    ప్రేమను పలుకోణాల్లో
    మీరు మాత్రమే చెప్పగలరు

    ReplyDelete
  5. సున్నిత శృంగారం చదువుతుంటే మళ్ళీమళ్ళీ చదవాలి అనిపిస్తుంది. చిత్రము కనులకు ఇంపుగా ఉన్నది.

    ReplyDelete
  6. మంత్రముగ్ధం

    ReplyDelete
  7. మీరు వ్రాసే ప్రతీ కవితా మనసుని ఆకట్టుకుంటుంది మేడం.

    ReplyDelete
  8. నో కమెంట్స్ అండి
    అద్భుత ప్రేమ కావ్యం

    ReplyDelete
  9. సరిలేరు మీకెవ్వరూ...అనే లెవల్ లో వ్రాసారు

    ReplyDelete
  10. అంతరోష్ణ ప్రేమద్రవం

    ReplyDelete
  11. అదొక బాంధవ్యం..ఎంత అద్భుతంగా చెప్పారు. చిత్రము కూడా చాలా బాగుందండీ.

    ReplyDelete
  12. Sreepurushula madya bandham eppudoo balamainadea ayyi untundi. Bhavalanu kavitaloe baga pandincharu. Abhinandanalu Padmarpita

    ReplyDelete
  13. రెండు శరీరాలు పెనవేసుకున్న లతలా
    అద్భిత భావాలను పలికించారు...

    ReplyDelete
  14. Manasu ranjimpa chesaru. kudoos

    ReplyDelete
  15. premaku ellalu levu
    mee kavitalaku reply ivvataniki aksharalu ravu

    ReplyDelete
  16. వెచ్చని శ్వాస ధ్యాసలు రెండూ వివస్త్రలై ఏకమైనప్పుడు
    ఉప్పగుంది స్వేదం అనకు అది అంతరోష్ణ ప్రేమద్రవం...
    అత్యంత రమ్యంగా పదాలను నర్తింపజేసారు

    ReplyDelete
  17. అంతరోష్ణ ప్రేమద్రవం-----wonderful words

    ReplyDelete
  18. Sooooooooo...beutifully said.

    ReplyDelete
  19. సింపుల్గా అద్భుతం

    ReplyDelete
  20. _/\_అందరికీ నమస్సులు _/\_

    ReplyDelete