శుభరాత్రి..


అలోచిస్తూ నిద్రపోవాలని ప్రయత్నిస్తున్న నాతో..
ఎలా ఉన్నావూ అంటూ అడిగింది నా హృదయం
చెబితే తెలుసుకోవడంలో గొప్పతనం ఏముంటుంది
మనసుని ఏమార్చే కళ్ళలోకి చూసి కనుక్కోమన్నా!

అసహనంతో అటూఇటూ పొర్లిదొర్లుతున్న నాతో..
ఏం చేస్తున్నావూ అంటూ అడిగింది నా మెదడు
అనవసరమైన ఆలోచనలన్నీ దొలిస్తే ఏముంటుంది
పరిష్కారంలేని ప్రశ్నలేయకని విసుగ్గా కసురుకున్నా!

అనుకోకుండా వచ్చిపడ్డ సమస్య హాస్యమాడె నాతో..
మనిషన్నాక ఇవన్నీ తప్పవని నవ్వాయి పెదవులు
తడుముకుంటే తీరదు ఏదీ తీరిగ్గా యోచించమంది
కనులకు విశ్రాంతి ఇవ్వాలని కలవరం మానుకున్నా!

అకస్మాత్తుగా ఆవలింతలెన్నో వచ్చి అన్నాయి నాతో..
అర్పితా...అలోచిస్తే అసహనమే తప్ప సమస్యలేవీ
పరిష్కరించబడవు అసహనంతో ఎన్నో కోల్పోతావంది
అందుకే నిశ్చింతగా నిదుర పోవాలి అనుకుంటున్నా!

18 comments:

  1. Nice art.
    You are so luck
    Nidrapovalani prayatnam chesi visugupoya.

    ReplyDelete
  2. అన్నీ వివరంతో వివరించ కూడిన

    ReplyDelete
  3. నిద్రలేమి ఆరోగ్యానికి హానికారం కదండి
    హాయిగా నిదురపొండి.
    చిత్రము ఎంతో బాగుంది.

    ReplyDelete
  4. నిశ్చింతగా నిదురపో.....

    ReplyDelete
  5. మంచి నిర్ణయాలు
    మంచిని చేస్తాయి.

    ReplyDelete
  6. కష్టం సుఖం మనకు చెప్పిరావు. వచ్చేవి వచ్చిపోతుంటాయి. ఏవీ పట్టించుకోకుండా నిద్రపోవడం ఎందరికి సాధ్యం. ఆలోచనాత్మకంతో కూడిన కవితాచిత్రము.

    ReplyDelete
  7. మనిషన్నాక ఇవన్నీ తప్పవని నవ్వాయి పెదవులు
    తడుముకుంటే తీరదు ఏదీ తీరిగ్గా యోచించమంది
    కనులకు విశ్రాంతి ఇవ్వాలని కలవరం మానుకున్నా, Nice lines

    ReplyDelete
  8. why late...
    Sleep well
    Good Night

    ReplyDelete
  9. అనవసరమైన విషయాలు ఆలోచించకండీ
    వ్రాయటమేనా...పటించటం కూడానా??

    ReplyDelete
  10. నిద్ర కరువైతే ఎన్నో సమస్యలు.మంచి ఆరోగ్యవంతమైన జీవితానికి నిద్ర విశ్రాంతి ఎంతో అవసరం.

    మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు.

    నిద్రపొండి హాయిగా...

    ReplyDelete
  11. ఎన్నో పరిష్కారంలేని ప్రశ్నలు జీవితంలో...

    ReplyDelete
  12. నిద్రపట్టనిస్తేనేగా నిద్రపోగలం.
    ఆలోచనలు అంతరమధనాలతో సరిపోతుంది.

    ReplyDelete
  13. ఆత్మీయులందరికీ ఎప్పుడూ నిద్రలేమి లేకుండా ఉండాలని కోరుకుంటూ...మీ పద్మార్పిత

    ReplyDelete