కరిగిపోతూ..

అప్పటి అదే అంతులేని ఆత్మవిశ్వాసము
ఇప్పుడు ఆలోచనలేని ఆవేశంతో కప్పబడి
అనుభవంలో అనుకోని ఇక్కట్లకి గురాయె!
అదంతా తొందరపాటని తెలియని ధైర్యము
ఇప్పుడు కాలంతో కరిగి జీవితం చిల్లుపడి
వేకువ వేకువకూ నడుమ ఆశ అడ్డమాయె!
అనుకోని బాధ్యతావసరాల మధ్య యుద్ధము
ఇప్పుడు నిలకడకై గెలుపు ఓటముల రాపిడి
ఉన్నచోట ఊతంలేక ఉనికి మాయమైపాయె!
అవసరాలు తీర్చే సౌకర్యాల పరుగుపందెము
ఇప్పుడు అహంపై స్వాభిమానం చేసే గారడి
చావు బ్రతుకుల నడుమ పెద్ద పోరాటమాయె!
అవన్నీ ఆనుభూతి లేకుండా సాగే కాలము
ఇప్పుడు పొంతనలేని ఆలోచనలతో అలజడి
ఆయువు నిశ్శబ్దంగా జారి కరిగిపోతుందాయె!

18 comments:

  1. వేకువ వేకువకూ నడుమ ఆశయే కదా బ్రతుక్కి ఆయువు.

    ReplyDelete
  2. గంభీరంగా సాగిన కవితాచిత్రము.

    ReplyDelete
  3. అవసరాలు తీర్చే సౌకర్యాల పరుగు పందెము ప్రస్తుత జీవన విధానానికి దర్పణము.

    ReplyDelete
  4. బాధ్యతావసరాల మధ్య యుద్ధము

    ReplyDelete
  5. ఒకోమారు ధైర్యాన్ని నూరిపోస్తారు...అంతలోనే వైరాగ్యమా?

    ReplyDelete
  6. ఆయువు నిశ్శబ్దంగా జారి కరిగిపో......

    ReplyDelete
  7. Pleasant pic with hard words

    ReplyDelete
  8. చావు బ్రతుకుల నడుమ పెద్ద పోరాటం తప్పదు కదా అందరికీ

    ReplyDelete
  9. బాధాయుక్తం

    ReplyDelete
  10. How are you madam?
    ee madya mee kavitalloe ekkuva vishadam tongi chustundi.

    ReplyDelete