మన బంధంలా వాడి వాసన కోల్పోతుంటే
ఎంత వలచానో అంతకన్నా ఎక్కువ వగచా!
ప్రతీక్షణం నీవులేని ఒంటరితనం వేధిస్తుంటే
మరణాన్ని అక్కున చేర్చుకోమని చేయిచాచా!
జీవితం జ్ఞాపకాల చుట్టూ తిరిగే సుడిగుండం
ఇద్దరూ కూడా ఇష్టం లేకుండా వేరైపోతుంటే
మనసుకు సర్ది చెప్పలేక మౌనంగా రోధించా!
ఎప్పుడూ గుర్తొచ్చే నిన్ను మరువడం గండం
బ్రతకడం రాక చావలేక జీవచ్ఛవంలా నేనుంటే
ఏడుపు మర్చిపోడానికి భారీమూల్యం చెల్లించా!
స్వచ్ఛమైన నా చిరునవ్వుని కాల్చిచేసా భస్మం
కన్నీటి జ్ఞాపకాల కడలిలో మునిగి తేలుతుంటే
చివరిదాకా రాజీపడి జీవించాలని నిర్ణయించా!
Ela unnaru?
ReplyDeletemee bhavalaku fida
జీవితం జ్ఞాపకాల చుట్టూ తిరిగే సుడిగుండం అని ఎందుకు అనుకుంటారు. మధురజ్ఞాపకాలు కూడా ఉంటాయి.
ReplyDeleteచివరిదాకా రాజీపడి జీవించడం రైట్.
ReplyDeleteసుడిగుండాలు ఎన్ని వచ్చినా ఎదురీదాలి.
ReplyDeleteబ్రతకడం రాక చావలేక జీవచ్ఛవంలా :(
ReplyDeleteJeevitam lo odidudukulu edurkovali.
ReplyDeletebomma bagundi.
Emotional Touch
ReplyDeleteకన్నీటి జ్ఞాపకాల కడలి.
ReplyDeleteOpen expressions.
ReplyDeleteChala bagarasaru.
ReplyDeleteSad thoughts are not good.
ReplyDeleteNee gnapakaala samadhullo chavaleka Bratukutunna jeevachavamla
ReplyDeleteజ్ఞాపకాలు
ReplyDeleteNamaste madam.
ReplyDeleteela unnaru?
kottaga amee rayaleadu.
ఎలా ఉన్నారు?
ReplyDeleteఎందుకని వ్రాయటం తగ్గించారు
కుశలమా మీరు?
ReplyDelete_/|_అందరికీ నమస్సులు
ReplyDelete