నేటిపాఠం

నాకు పరిచయమైన ప్రతీఒక్కరూ జ్ఞానులే
అయినా వారెందుకో ఎప్పటికీ అర్థంకారు

నాకు తెలిసినవారు అందరూ ఆశాపరులే
ఏదో ఒక కోరికతో కొట్టుమిట్టాడుతున్నారు

నాకు ఎవర్ని చూసినా అన్నీ అనుమానాలే
ఏది మంచో ఏది చెడో తెలియక కంగారు

నాకు ఎవరెన్ని చెప్పినా బోలెడు సందేహాలే
జీవితం గురించి ఎవ్వరూ సరిగ్గా చెప్పలేరు

నాకు రోజూ బ్రతుకునేర్పే పాఠాలు ఎన్నోలే
ఊపిరన ఉదయాస్తమాలతో అల్లిన నవ్వారు

నాకు చిట్టచివరిగా బోధపడింది ఒక్కటేలే
పోయినోళ్ళంతా ఒకప్పుడు బ్రతికుండేవారు

14 comments:

  1. జీవితం గురించి తెలిసిన వారు చెప్పగలరు.
    అలా తెలిసిన వారు ఎవరూ లేదు.

    ReplyDelete
  2. Don't worry
    Life is Beautiful

    ReplyDelete
  3. బ్రతుకు గురించి ఎక్కువ ఆలోచిస్తే అనర్ధాలు కదండి. Nice picture

    ReplyDelete
  4. జీవితసారాల మేళవింపు కవిత బాగుంది.

    ReplyDelete
  5. Madam mee posts taggayi.
    How are you?

    ReplyDelete
  6. బాగుందండీ బొమ్మ కవిత

    ReplyDelete
  7. పోయినోళ్ళంతా ఒకప్పుడు బ్రతికుండేవారు...యదార్ధం

    ReplyDelete
  8. మీ ఆలోచనలు వాటికి తగిన అక్షరాలకు సలాం.

    ReplyDelete
  9. అక్షర అభిమానులకు నమస్సులు _/\_

    ReplyDelete