నీవుంటే పరిసరాలన్నీ పచ్చిక బయళ్ళు
సంధ్యవేళ సంతోషం రేయేమో పరవళ్ళు
గాలే గెంతులేసి వేణుగానమై వినిపించు
మాటలే మంగళ వాయిద్యాలు మ్రోగించు
లోలోన తనువే పులకరించి నాట్యమాడెను
నెమలి పరవశమై కన్నీటితో సరసమాడేను
కనుల నిండా కలలేమో కిలకిలా నవ్వేసె
వసంతకాలమే పువ్వులన్నీ జల్లుగా కురిసె
చింతలన్నీ చెట్టుపైకి ఎక్కి తైతెక్కలాడాయి
ఊహలన్నీ ఉత్సాహాన్నిస్తూ ఊయలూగాయి
నీవుంటే మొత్తానికి జీవితం నందనవనం
లేకుంటే అధోగతీ అంతులేని అంధకారం!
Lovely Expression.
ReplyDeleteఎదనిండా నిండిన ప్రేమను బాగాతెలిపారు.
ReplyDeleteప్రకృతి పురుషుడు అన్నమాట
ReplyDeleteహా హా హా హో
Premalo pandipoyinatlu unnaru :)
ReplyDeleteSo beautiful andi
ReplyDeleteచాలాబాగుంది.
ReplyDeleteనెమలి పరవశమై కన్నీటితో సరసమాడే...మీకే చెల్లింది
ReplyDeleteజీవితం ఒడిదుడుకుల సంగమం
ReplyDeleteEmotional touch ichcharu
ReplyDelete_/\_అందరికీ నమస్సులు_/\_
ReplyDelete