తన్నులూ వాటితోపాటు చీవాట్లు కూడాను
ఇవి సరిపోవని ఈసడింపులు జత కలిపాను
ఎదుగుతున్న కొద్దీ మోసగించబడ్డా నేను..
చురుగ్గా పనిచేసి వేరేపని నెత్తినేసుకున్నాను
మనం చేసిందేదీ ఊరికేపోదు అనుకున్నాను
అవసరానికేదీ అక్కరకురాదని తెలుసుకున్నాను!
అలా కాలంతోపాటుగా సాగిపోయా నేను..
మంచీచెడు వ్యత్యాసాలు వెలివేయబోయాను
ప్రేమను పంచి ఇప్పుడు అడుక్కుంటున్నాను
ఇవ్వాలి ఆశించరాదని సూక్తులు వింటున్నాను!
ఆకలిచచ్చి ఏం తినాలని అనిపించక నేను..
కడుపువీపు కలిసి అతుక్కున్నట్లున్నా కూడాను
ఒడ్డున ఒంటరినై విషాదాన్ని నీటిలో కలిపాను
జీవితం ఇచ్చే తీర్పు కోసమై వేచి ఉంటాను!
జీవితం ఇచ్చే తీర్పు ఏదైనా కట్టుబడి ఉండాలి.
ReplyDeleteకాలంతో పాటు సాగిపో.....
ReplyDeleteతిట్లను తిని ఆకలిని చంపేయటం బాగుంది,
ReplyDeleteహృదయాన్ని తాకింది.
Live is to live and experience everything madam.
ReplyDeleteNice paintings you displayed in your blog.
2024 first emotional touch post.
ReplyDeleteజీవిత ప్రయాణం..
ReplyDeleteనీకు తెలియకుండానే
ఎన్నో నేర్పిస్తుంది
నిరాశ వద్దు.
ReplyDeleteTitlu tinadam
ReplyDeleteadi kadupu nimpadam bagundi...ha ha ha
తీర్పు కోసమై వేచి ఉంటా :(
ReplyDeleteVery complicated feelings
ReplyDeleteప్రేమను పంచి ఇప్పుడు అడుక్కుంటున్నా...heart touching
ReplyDeleteతిండిపోతుని నేను..
ReplyDeleteతన్నులూ వాటితోపాటు చీవాట్లు ..ha ha ha
Manasu pade vedana varninchatam meeku baga tesinatlu undi.
ReplyDeleteHai madam ji
ReplyDeleteHow are you?
This post is not bright start up.
జీవిత తీర్పును ఎవ్వరూ నిర్దేశించలేరు, అది సాగిపోవలసిన ప్రక్రియ అంతే.
ReplyDeleteప్రతీ స్పందనకు..వందనములు_/\_
ReplyDelete