మనసు గాయపడిన ప్రతీమారు..
నీ పెదవులు నానుదుటిని తాకేవి
ఆ స్పర్శ మరింత ప్రేమని పెంచేది
అలా నీ కౌగిట ఒదగాలని ఉండేది!
మనం కలిసిమెలిగిన ప్రతీమారు..
నీ సాంగత్యం నాలో ఆశలు రేపేవి
ఏవో ఊహలతో ఏదో అయిపోయేది
అవి కాకున్నా సుఖమే అనిపించేది!
చిగురువసంత కలల్లో ప్రతీమారు..
నీ నవ్వులే నాకనుల కాంతులైనవి
నిష్కల్మష నవ్వే అమృతం అయ్యేది
అదేగా బ్రతుక్కి బలాన్ని చేకూర్చేది!
నాగుండె కొట్టుకున్న ప్రతీమారు..
నీ హృదయంపై అవి పిచ్చిగీతలైనవి
తెలియని అనురాగమేదో దాగుండేది
ఆ అస్పష్టతలోనే స్పష్టత కనిపించేది!
అస్పష్టతలోనే స్పష్టత
ReplyDeleteబహు బాగుంది.
మీ భావజాలం అత్యభుతం అండీ.
ReplyDeleteమీరు మరిన్ని కవితలతో అలరించాలని మా అభిలాష.
Hrudaya kavitwam
ReplyDeleteEmotional words tho touch cheyatamlo meeru perfect. Very nice painting.
ReplyDeleteమీరు వ్రాసే భావాలు
ReplyDeleteవాటికి తగిన చిత్రాలు
అమోఘం అండి.
హృదయంపై పిచ్చిగీతలు...అవే ప్రేమ రాతలు కదండీ!
ReplyDeleteచిగురువసంత కలలు...నూతనత్వం చిగురించింది.
ReplyDeletehi...ela unnaru?
ReplyDeletechala rojulaku oka bhavagarbta post with pic.
Amazing expressions.
ReplyDeleteఅస్పష్టతలో స్పష్టత..
ReplyDeleteచాలాబాగుంది.
ReplyDeleteNamaste madam. How are you?
ReplyDeleteEXCELLENT
ReplyDelete