ఆమె ఏమిటో..

ఎప్పుడూ నవ్వుతూ కనబడుతుందని
ఎంతో శక్తిమంతురాలు అనుకుంటారు
కానీ ఆమెకే తెలుసు ఆమె ఏమిటో..
కంటినిండా కలలతో అందంగుందని
ఎంతో తెలుసుకోవాలని ఆరాటపడతారు
కానీ అమెకే తెలుసు వారు ఏమిటో..
ప్రేమ పంచి నిస్వార్ధంగా ప్రేమిస్తుందని
ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తారు
కానీ ఆమెకే తెలుసు మర్మం ఏమిటో..
చేసే నిశ్శబ్దపోరాటం మూసి కప్పెట్టిందని
ఎంతో ధైర్యం చలాకీపిల్ల అనేస్తుంటారు
కానీ ఆమెకే తెలుసు ఆయుద్ధం ఏమిటో.. వివరించలేని దుఃఖం బెంగ కనబడట్లేదని
ఎంతో లోతైన వ్యక్తిత్వం కలది అంటారు
కానీ ఆమెకే తెలుసు ఆందోళ ఏమిటో..
అంచనాలేసి తనపై తానే ఆధారపడిందని
ఎంతో తెలివైనామెని మరచిపోలేమంటారు
కానీ ఆమెకే తెలుసు సంకల్పం ఏమిటో..
ఇతరుల లోపాలు వివరాలు పట్టించుకోదని
ఎంతో పొగరుబోతని నిరుత్సాహపరుస్తారు
కానీ ఆమెకే తెలుసు ఆత్మబలం ఏమిటో..

14 comments:

  1. ఆమెకు అమె సాటి

    ReplyDelete
  2. ఆమెకే తెలుసు ఆత్మబలం ఏమిటో..

    ReplyDelete
  3. evaru varike telustundi.

    ReplyDelete
  4. She is always great.

    ReplyDelete
  5. స్త్రీ మహా శక్తి స్వరూపిణి
    ఆమెను అంతనా వేయడం ఏవరి తరమూ కాదు.

    ReplyDelete
  6. మనల్ని మనం తెలుసుకుంటే చాలు

    ReplyDelete
  7. ఎంతో లోతైన వ్యక్తిత్వం కలది...yes

    ReplyDelete
  8. ఆమె ఎవ్వరు?

    ReplyDelete
  9. ఎవరో తెలుసుకోవాలి అనే ఆత్రుత అందరిలో కానీ ఆమె ఎవ్వరో ఎలా తెలుసుకోవడం?

    ReplyDelete
  10. ఆమెకే తెలుసు ఆయుద్ధం ఏమిటో.. Yes 100%

    ReplyDelete
  11. _/\_నమస్సులు_/\_

    ReplyDelete