నీకు నువ్వు.

కొన్నిరోజులు కఠినంగా గడిపేస్తూ
దుర్లభంగా సాగవల్సి ఉంటుంది..

ఏకాంతంగా మనసు మాట వినేస్తూ
మనోనిబ్బరాన్ని పెంచాల్సి వస్తుంది..

బాధకి ముసుగేసి దుఃఖాన్ని దాస్తూ
నవ్వుతూ పోరాడవల్సి ఉంటుంది..

వచ్చే కష్టాల్ని రానిచ్చి దిగమ్రింగేస్తూ
నీపోరాట ప్రతిభని మెచ్చాల్సి వస్తుంది..
చేస్తున్న ఒంటరిపోరాటం జబ్బచరుస్తూ
నీ ఆత్మస్థైర్యానికి నీవే గర్వించాల్సింది..

నీకోసం నువ్వూ నీకై నీవుగా జీవిస్తూ
ఏదేమైనా చివరిదాకా బ్రతకవల్సిఉంది..

20 comments:

  1. చేస్తున్న ఒంటరిపోరాటం

    ReplyDelete
  2. జీవితం ఎన్నో మలుపుల సంఘమం...తప్పదు పోరాటం

    ReplyDelete
  3. నీకోసం నువ్వూ నీకై నీవు-Excellent

    ReplyDelete
  4. No way to escape madam.

    ReplyDelete
  5. బలం చేకూర్చుకోవటం బ్రతకడానికి. Very nice

    ReplyDelete
  6. ఏవ్వరూ ఎవ్వరి కోసం ఉండరు
    నీకు నువ్వే ధైర్యం బలం అని బాగా వ్రాసారు.

    ReplyDelete
  7. Life is so beautiful if we are in positive way.

    ReplyDelete
  8. బాధకు ముసుగు వేసి దుఃఖాన్ని దాచేయడం అద్భుతం.

    ReplyDelete
  9. ఎవరికి వారే తోడు...ఎంత బాగా చెప్పారు.

    ReplyDelete
  10. మీ మనోధైర్యానికి జోహార్లు.

    ReplyDelete
  11. చాలా రోజులకు మీ బ్లాగ్ చూస్తున్నాను. ఎప్పటిలాగే చాలా బాగా రాస్తున్నారు. అభినందనలు

    ReplyDelete
  12. మీరు వ్రాసే భావాలు ఎంతో బలాన్ని ఇస్తాయి.

    ReplyDelete
  13. నీ ఆత్మస్థైర్యానికి నీవే గర్వించాల్సింది.. Yes

    ReplyDelete
  14. మనోనిబ్బరాన్ని పెంచా-EXCELLENT

    ReplyDelete
  15. Namaste Padmarpita garu

    ReplyDelete
  16. _/\_ధన్యోస్మి

    ReplyDelete