అతడు-ఆమె

అతడు-జీవులలో అత్యంత ఉన్నతుడు
ఆమె-ఆదర్శాలలో మహోన్నతమైనది..
అతడు-సింహాసనం పై కూర్చుని ఉద్దరిస్తే
ఆమె-బలిపీఠమైనా ఓర్పుగా సహిస్తుంది..
అతడు-మెదడై కాంతిని వెదజల్లుతుంటే
ఆమె-హృదయమై ప్రేమను కురిపిస్తుంది..
అతడు-పరాక్రమంతో చలామణి అవుతాడు
ఆమె-తాను బలౌతూ ఉత్కృష్టమౌతుంది..
అతడు-అధిష్టాన ఆధిపత్యం బలమైనదైతే
అమె-ప్రాధాన్యతతో కూడిన హక్కౌతుంది..
అతడు-అపరితమైన మేధావి అనుకుంటే
ఆమె-అనిర్వచనీయమైన దేవతనిపిస్తుంది..

అతడు-కాంక్ష సర్వోన్నతమైన కీర్తి అయితే
ఆమె-ఆకాంక్ష ఎంతో ధర్మంతో కూడింది..
అతడు-మెదడు అంతా ఆలోచనలకు నెలవు
ఆమె-కలలుకంటూ కాంతిని వెదజల్లుతుంది..
అతడు-ముత్యాలు దాగిన మహాసాగరమైతే
ఆమె-అహ్లాద అబ్బుర సరస్సై సాగుతుంది..
అతడు-దేవాలయం అని ఆవిష్కరించుకుంటే
ఆమె-ఒక పుణ్యక్షేత్రంగా మోకరిల్లవల్సింది..
సంక్షిప్తంగా:-భువి ముగిసిన చోట అతడు
స్వర్గం ఆరంభమయ్యేదే ఆమెతో అనవచ్చు..

18 comments:

  1. అద్భుతం అమ్మా మీ రచన.

    ReplyDelete
  2. Madam a big salute to U

    ReplyDelete
  3. She & He
    Both are great

    ReplyDelete
  4. ఇద్దరు సమతుల్యం
    చాలా బాగుంది..

    ReplyDelete
  5. adbhutam
    both male and female balanced well

    ReplyDelete
  6. బహుత్ ఖూబ్
    బాలన్స్ బాగాచేశారు

    ReplyDelete
  7. అతడు-దేవాలయం అని ఆవిష్కరించుకుంటే
    ఆమె-ఒక పుణ్యక్షేత్రంగా మోకరిల్లవల్సింది.. అద్భుతం అండీ మీ రచనాశైలి.

    ReplyDelete
  8. సంక్షిప్తంగా భువి ముగిసిన చోట అతడు, స్వర్గం ఆరంభమయ్యేదే ఆమెతో అనవచ్చు..శభాష్

    ReplyDelete
  9. అతడు అతడే
    ఆమె అమెనే
    ఎవరికి ఎవరూ తీసిపోరు
    లెస్స వాక్యాలు
    అభినందనలు అర్పితా..

    ReplyDelete
  10. బొమ్మల ఎంపికలో అక్షరాల్లో భావాలు పలికించడంలోనూ మీకు మీరే సాటి అండీ..

    ReplyDelete
  11. లింగ భేదం ఉంది
    ఎవరి పవర్ వారిదేనని
    చాలా బాగారాసావు పద్మార్పిత.

    ReplyDelete
  12. అద్భుతంగా వ్రాశారు.

    ReplyDelete
  13. Great comparison andi.

    ReplyDelete
  14. అందరికీ ధన్యవాదాలు _/\_

    ReplyDelete