ఖబర్దార్

నువ్వు నాకేమో బంగారు కొండ
నేను నీకొరకై నిండిన పాలకుండ
ఇద్దరం ఒకరికొకరం అండాదండ

నువ్వు నాకు ఇష్టమైన సున్నుండ
నేను నీకు ఇష్టమైనట్టి కలాకండ
ఇద్దరం తిందాం తీపి కడుపునిండ

నువ్వు అనుకోకు నన్ను గుదిబండ
నేను నీ కోసం ఊగేటి పచ్చజెండ
ఇద్దరం ఒకటైతిమా సుందరకాండ

నువ్వు లేని జీవితం పెద్ద అనకొండ
నేను లేనిది నువ్వొక ముదురుబెండ
ఇద్దరం కలిసుండటం మన ఎజెండ

నువ్వు కాదన్నావా నీ మొఖం మండ
నేను అవుతా నిన్నుకాల్చే మండేఎండ
ఇద్దరి మధ్య జరుగును కిష్కింధకాండ

17 comments:

  1. ha ha ha
    mee posts excellent

    ReplyDelete
  2. I love this painting and post too

    ReplyDelete
  3. హాస్యంతో కూడిన బెదిరింపు.

    ReplyDelete
  4. So beautifully written.

    ReplyDelete
  5. అందమైన కూర్పు.

    ReplyDelete
  6. ఇద్దరి మధ్య జరుగును కిష్కింధకాండ :) ha ha ha

    ReplyDelete
  7. సూపర్ సరసం
    చిత్రము చమత్కారం

    ReplyDelete
  8. Iam fan of your write ups.

    ReplyDelete
  9. నువ్వు అనుకోకు నన్ను గుదిబండ
    నేను నీ కోసం ఊగేటి పచ్చజెండ
    ఇద్దరం ఒకటైతిమా సుందరకాండ..ha ha
    super andi mee bedirimpu

    ReplyDelete
  10. preamatho cheppina gatti warning bagundi.

    ReplyDelete
  11. ప్రేమ ఎంత మధురమో అంత డేంజర్ అంటారా...హా హా హా

    ReplyDelete
  12. బాగానే బెదిరిస్తున్నారు.

    ReplyDelete
  13. ఇద్దరి మధ్య కిష్కింధకాండ?????

    ReplyDelete
  14. నమస్తే మాడం
    ఎలా ఉన్నారు?

    ReplyDelete
  15. ప్రతీ స్పందనకు
    పద్మార్పిత నమస్సులు

    ReplyDelete