నన్ను నీలో..

నేను లేని వేళ నన్ను తలుస్తూ నిద్రపో
ఆ నిద్రలో నిశ్శబ్దంగా నీ చొక్కా విప్పి
గుండెపై వ్రాసిన పిచ్చిరాతల్ని తలచుకో

నేను పోయానన్న బాధ నుండి కోలుకో
ఆ వంకన నా లాలనాపాలల్ని గుర్తించి
నిష్కల్మషమైన నా ప్రేమని నీలో నింపుకో

నేను లేకున్నా నా గుండెలయ నీదనుకో
ఆ లయకు కొత్తవసంతపు జల్లులు అద్ది
మన బంధానికి ఒక నిర్వచనం ఇచ్చుకో

నేను నీ ఎదను తడుముతున్నా చూసుకో
ఆ స్పర్శలోని అమృతం గొంతులో పోసి
నా భావాలను మసకబారనీయక దాచుకో

నేను నీకు దూరమై దగ్గరున్నాను అనుకో
ఆ అనుకోవడంతో పాటు ఆలోచలని నెట్టి
నవ్వుతూ మరో జీవనానికి ఊపిరిపోసుకో

15 comments:

  1. లేని వేళ తలచి తలచి విలపించుట ఇప్పటి తరం చేయదు.

    ReplyDelete
  2. చాలా రోజులకి మనసుకి హత్తుకునే భావాలను అందించారు.

    ReplyDelete
  3. అద్భుతమైన అనుభూతి అయినా బాధాకరం అలా మసలుకోవడం.

    ReplyDelete
  4. అలా హత్తుకుని అల్లుకున్న బంధం దూరమైతే...ఊహల్లో బ్రతకడం కష్టమేమో కదండీ!
    మీరు వ్రాసిన భావాలు చదువుకోవడానికి బాగున్నా అనుభవించడం బహుకష్టం సుమా!

    ReplyDelete
  5. Rendu hrudayala kalayika eppatiki vidipodu. picture bagundi padmarpita garu.

    ReplyDelete
  6. Soooooo beautiful and heart touching words.

    ReplyDelete
  7. దూరాల దగ్గరితనం దరి చేరి
    దగ్గరి దూరాలను మానవేయగా
    మానిన గాయాల పై సున్నితంగా
    నీ జ్ఞాపకాల లేపనం చేయగా

    వైజాగపటం నుండి అమీర్ పేట
    కేవలం నాలుగొందల ఇరవై రోజులు
    ఆంధ్ర తెలంగాణ విభజన నుండి హుద్ హుద్ అల్లకల్లోలం నడుమ మాటల మాతరలే ఉపశమనం

    పన్నీటి జల్లులతో మొదలు కన్నిటి వీడుకోలుతో తుదకు
    ఆనందాల రాగాలాపన దరహాసం కాస్త మనసు నిర్వేదపు వేదన
    పదిహేడు మే నుండి పదిహేడు మే వరకు దశాబ్దం
    మన అమూల్యమైన బంధం అక్షరాల పదిలం

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  8. నేను పోయానన్న బాధ నుండి కోలుకో
    ఆ వంకన నా లాలనాపాలల్ని గుర్తించి
    నిష్కల్మషమైన నా ప్రేమని నీలో నింపుకో..హృదయాలాపన మధురం.

    ReplyDelete
  9. Still meeru manasu kavitalatho aakattukuntunnaru.
    Congratulations to your poetry and paintings madam.

    ReplyDelete
  10. ఆ స్పర్శలో అమృతం.

    ReplyDelete
  11. మనసుని తాకింది ప్రతీ పదం...

    ReplyDelete
  12. అభిమాన స్పందనలకు అర్పిత అభివందనములు.

    ReplyDelete
  13. Excellent heart touch feelings.

    ReplyDelete