నేను సంగీతంతో సంపర్కం చేసినా
జ్ఞాపకాలు ఒంటరిగా మిగిలున్నాయి
వాటిని నేను ఆహ్వానించక పోయినా
ప్రతీపాటలో వచ్చి చేరుతానన్నాయి!
కన్నీళ్లు నాముఖాన్ని కౌగిలించుకున్నా
జలజలా ధారగా కారుతూ ఉన్నాయి
ఎన్నో జ్ఞాపకాల్ని దూరంగా నెట్టేయగా
పరుగున పలుమార్లొచ్చి వీడకున్నాయి!
నేను పాటతో పానుపుపై పవళించినా
జ్ఞాపకాలు రెచ్చిపోయి రమిస్తున్నాయి
వాటిని లెక్కచేయక దారి మళ్ళించినా
అప్పుడు నవ్వులు నన్ను నలిపేసాయి!
సరిగమలు నాతో సరసం ఆడుతున్నా
అహ్లాదం అందంతో చిందులేస్తున్నాయి
ఆలోచనలు లయతో శోభనం చేయగా
సంతోషాలే సంతానమై పుట్టుకొచ్చాయి!
సంగీతంతో సంపర్కం సరసము మీకే చెల్లు.
ReplyDeleteAwesome andi.
ReplyDeleteప్రేమ కవితకు
ReplyDeleteపాటతో ప్రాణం పోసినట్లు ఉంది.
చాలా బాగారాశారు
ReplyDeleteEXCELLENT
ReplyDeleteSa Ri Ga Ma
ReplyDeleteSarasamu
Super.......
జ్ఞాపకాలు ఒంటరిగా మిగిలున్నాయి
ReplyDeletepata lo pranayam bagundi madam.
ReplyDeleteమీ రచనల్లో భావగంభీరత చాలాబాగుంటుంది. ప్రతీ విషయాన్ని లోతుగా ఆలోచించి వ్రాస్తారు. అభినందనలు మీకు.
ReplyDeleteWow santhosham santanam..ha ha ha ha
ReplyDeleteసంగీతంతో సంపర్కం భేష్
ReplyDeleteVery Beautiful.
ReplyDeleteఎంత అందంగా చెప్పారు.
ReplyDeleteRomance in different way.
ReplyDeleteసరిగమలు నాతో సరసం ఆడు..wow
ReplyDeleteనమస్సులు _/\_
ReplyDelete