ఇద్దరమొకటి కాదు..

నాకేమో భావోద్వేగాలజడిపాళ్ళు ఎక్కువ
తనకేమో చలించని నిశ్చింతే మక్కువ..

నాదేమో సున్నితసరళలజ్జాపూరిత తత్వం
తనదేమో అన్నింటా ఒకే సమానత్వం..

నాకేమో విరహవైరాగ్యవలపొక అనుభూతి
తనకేమో అవన్నీ పనికిరాని పురోగతి..

నాదేమో కన్నీటితరంగకెరటాలవ్యధ హోరు
తనదేమో నిలకడ జీవిత కడలి జోరు..

నాకేమో చిత్తశుద్ధిక్రియాక్రమంటే భలేఇష్టం
తనకేమో ఒక్కటే పట్టుకోమంటే కష్టం..

నాదేమో గందరగోళగాభరాగమ్య పరిస్థితి
తనదేమో తెలివిగా నిలబడ్డ తటస్థస్థితి..

నాకేమో స్వార్ధపూరితప్రేమచేష్టలు కావాలి
తనకేమో అవి జీవితంలో భాగమవ్వాలి..

17 comments:

  1. Awesome Lines and Art.

    ReplyDelete
  2. అద్భుత పదప్రయోగాలు..హ్యాట్సాఫ్ పద్మార్పిత

    ReplyDelete
  3. మీకు సరిలేరు తెలుగు వాక్యాలు కొత్తవి పుట్టించడంలో...

    ReplyDelete
  4. అద్భుతహా..

    ReplyDelete
  5. అతిమధురం మీ ఈ కావ్యం.

    ReplyDelete
  6. Mashah Allah
    Bahoot sundar

    ReplyDelete
  7. ఎవరికి వారే యమునా తీరే
    ఏ ఇద్దరూ కూడా ఒకటేలా ఎలాఉంటారు?
    అలా ఉండాలి అంటే కుదురుతుందా అసలు
    అది అంతా ఒక భ్రమ మాత్రమే అని నా ఉద్దేశం.

    ReplyDelete
  8. మీరు మీ భావాలు మాత్రమే ఒకటి అనుకుంటే ఎలా>???????

    ReplyDelete
  9. railupattalu eppatiki kaluvavu
    alege iddaru kaluvaru anukovali.

    ReplyDelete
  10. పద్మా...చాలా బాగ రాసావు.

    ReplyDelete
  11. నాదేమో గందరగోళగాభరాగమ్య పరిస్థితి
    తనదేమో తెలివిగా నిలబడ్డ తటస్థస్థితి..ఇది నిజమా???

    ReplyDelete
  12. యద సడులు నాలుగు హృదయాలు రెండు ప్రాణం ఒక్కటే
    ఏటి పాయలు నాలుగు నదులు రెండు సంద్రం ఒక్కటే
    ఆలోచనలు నాలుగు భావాలు రెండు మనసు ఒక్కటే

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  13. Super andi.
    Happy Rakshabandhan

    ReplyDelete
  14. అందరికీ పద్మార్పిత వందనములు

    ReplyDelete