తప్పు నాదే..

ఎందరో అపరచితుల గురించి తెలుసుకుని
వారిని చదవడమే సరిపోయిందేమో అతడికి
నేను మాత్రం పరిచయమై కూడా పరాయినై
అతడి లోకంలో చిత్తుపుస్తకమై అమ్ముడయ్యా!
ఎందరినో అడిగి నాగురించెన్నో తెలుసుకుని
నా మనసుని చదివేసి నాకు దగ్గరైన అతడికి
నేను ఉసిగొల్పిన ఆలోచనలేవో అతడి ప్రేరణై
అతడు రాసిన గ్రంధంలో నేనో పంక్తినయ్యా!
ఎందరి మనోభావార్ధాలనో బాగా తెలుసుకుని
వారిమనసు మెప్పించడమే సరిపోయె అతడికి
నేను మాత్రం అంతరంగాలోచనల్లో పదిలమై
అతడి బాధ్యతల్లో బంధాలప్పుడు బరువయ్యా!
ఎవరితోనో నన్నునే పోల్చిచూసి తెలుసుకుని
నా మనోభావాలను చవమని చెప్పా అతడికి
నేను ఇలా అతిగా ప్రేమించేసానేమో చులకనై
అతడి దృష్టికి నేనిప్పుడు ఎంతో అలుసయ్యా! 

15 comments:

  1. వలపు వేదనా???

    ReplyDelete
  2. ప్రేమ అంటేనే వ్యధ.

    ReplyDelete
  3. chala baga rasavu akka

    ReplyDelete
  4. లోకంలో చిత్తుపుస్తకమై అమ్ముడయ్యా..oh no no

    ReplyDelete
  5. వేదన వ్యధలు ఎప్పటికి తొలగేను ప్రేమలో?

    ReplyDelete
  6. prema
    vedana
    yedupu
    moodu
    kalisi untayi.

    ReplyDelete
  7. మాడం అందుకే ఒకరితో ఇంకొకరు పోల్చుకో కూడదని పెద్దలు చెప్పారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండొచ్చు చేసుకోవచ్చు. అయినా మీకు ఇంకొకరితో పోటీ ఏమిటండి?

    ReplyDelete
  8. అమ్ముడు అవ్వటం బాగాలేదు.

    ReplyDelete
  9. Please change the trend of postings Padmarpita zee...Love and lust is now a days became common and boring too.

    ReplyDelete
  10. Self analysing antaru idi. Nice andi

    ReplyDelete
  11. అతడు రాసిన గ్రంధంలో నేనో పంక్తినయ్యా!
    ఎవరైనా అంతేనేమో ప్రతీ ఒక్కరి జీవితములో

    ReplyDelete
  12. నమస్సులు

    ReplyDelete
  13. థఫ్ఫు ణీధైణఫుడ్ సిచ్ఛా ణీఖే ఫఢాళ
    తెలసి తప్పు సేయరెవరు
    కాని తెలిసి సేస్తె సిచ్ఛా అనుభవించాల్సిందే ముమ్మాటికి

    ReplyDelete