తొమ్మిది ఒకట్ల తొమ్మిది
నీకే ఇచ్చేసాగా నా మది..
తొమ్మిది రెండ్ల పద్దెనిమిది
నీపై నాకున్న ప్రేమ గట్టిది..
తొమ్మిది మూళ్ళ ఇరవైఏడు
నువ్వే నాకు సరైన జోడు..
తొమ్మిది నాలుగుల ముప్పైఆరు
నువ్వు చూపించు నీ ప్రేమ జోరు..
తొమ్మిది ఐదుల నలభైఐదు
నీ మౌనం నాకు చాలా చేదు..
తొమ్మిది ఆరుల యాభై నాలుగు
నాకు కాకు దూరం ఇక ఆగు..
తొమ్మిది ఏడుల అరవైమూడు
నువ్వే కావాలి నా మొగుడు..
తొమ్మిది ఎనిమిదుల డెబ్బైరెండు
నువ్వు కలకాలం ఉండు తోడు..
తొమ్మిది తొమ్మిదుల ఎనభై ఒకటి
మనసావాచా అవుదాం ఇద్దరం ఒకటి..
తొమ్మిది పదుల తొంభై
నా చివరి శ్వాసకు చెప్పాలి నీవు బై..
So Beautiful Picture
ReplyDeleteచాలా బాగుంది మీ తొమ్మిదో ఎక్కం
ReplyDeleteమీరజాల గలడా మీ ఆనతి..
ReplyDeleteమీ మునుపటి పోస్టులు ఇలాగే అలరించేవి.
ReplyDeleteSimply Superb
ReplyDeleteVery nice.
ReplyDeleteతొమ్మిది ఇరవైల నూటేనభై...జీవితానికి భై బై :(
ReplyDeleteకొత్త పంధాలో బాగారాసావు.
ReplyDeleteExcellent Narration.
ReplyDeletechala chala bagundi madam.
ReplyDeleteSo...amazing ninth table
ReplyDeleteమీరు ఎప్పుడూ అద్భుతాలు సృష్టిస్తారు.
ReplyDeleteఅక్షరాభిమానులకు అభివందనములు.
ReplyDeleteAmazing
ReplyDeleteనాకు కాకు దూరం
ReplyDeleteఅద్భుతం అండి
ReplyDeleteExcellent andi
ReplyDeleteతొమ్మిది సున్నా సున్న
ReplyDeleteకాలం గిర్రున తిరిగినా నిన్న మొన్న