కలల బూడిద కాళ్ళకు అంటింది
ఎంతో చెయ్యాలని ఏం చెయ్యలేక
నాగరికత వాడి అస్త్రం సంధించగా
అనాగరికం నగ్నంగా నర్తించింది
అది చూసి జ్ఞానం నవ్వ ఏడ్వలేక
అక్షరం అజ్ఞానంతో అశ్చర్యపడింది!
నిస్వార్ధ నిజం నడుస్తూ నిలకడగా
అబద్దాన్ని ఆత్మహత్య చేసుకోమంది
ఆనందానుభూతులు కలిసుండలేక
విడివడి చెరొక చెంతన చేరుకుంది!
నీచానికి హద్దులు ఆంక్షలు లేవుగా
విప్పుకున్న రెక్కల్తో ఎగిరిపోయింది
దిక్కు తోచని దేహం దిగులు వీడక
కృంగికృశించి చివర్లో అదృశ్యమైంది!
బహుకష్టం మీ భావాలు అర్థంచేసుకోలేం :(
ReplyDeleteMARVELOUS
ReplyDeleteనేటి సమాజం ఇదే.
ReplyDeleteIt is very tough lyrics to understand.
ReplyDeleteభావగంభీరం.
ReplyDeleteప్రతీ లైన్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది మేడం.
ReplyDeleteదిక్కు తోచని దేహం దిగులు వీడక కృంగికృశించి చివర్లో అదృశ్యమైంది.
ReplyDeleteవిచారకమైన అంతం..
Excellent but hard to digest.
ReplyDeletemeeru rasevi jeevitamu anukovala leka badhalu ani saripettukovalaa?
ReplyDeleteఅనాగరికం నగ్నంగా నర్తించింది అది చూసి జ్ఞానం నవ్వ ఏడ్వలేక...your mark
ReplyDeleteఅంతా అయోమయం అంధకారం జీవితం.
ReplyDeleteనమస్సులు
ReplyDelete