కారుమబ్బు..

నా వద్ద ఉన్నవన్నీ ఇచ్చాగా
మనువు తనువు ఇంకా ఆత్మ
అలా చేయడం నాకచ్చిరాలేదు
అందుకే ఇప్పుడింకేం చేయను
రేయిలో వెలుగు వెతుక్కున్నా..
నాకు నలుపు అంటే ఇష్టంగా
నా నీడ నీ అత్మల నడుమ
రహస్యంగా ఏదో జరిగుంటుంది
అందుకే నిన్ను ప్రేమించాను
చీకటిని కైవసం చేసుకున్నా..
నా గురించి నీకిక చెప్పనుగా
నిన్ను కావాలని కోరడం భ్రమ
హామీలు బాసలు మూగబోయి
ప్రేమ ఏడారిలో ఒయాసిస్సైనా
రాత్రినే దారెటో చూపమన్నా..
నా ఈ చేష్టలన్నీ తప్పులేగా
నన్ను నేను కోల్పోవడం వ్యధ
తిరిగి ఎదగాలన్నదొక అభిలాష
దాని కోసం దారినే మార్చుకుని
నిశినే నిండుకాంతి కోరుతున్నా..

12 comments:

  1. కారు మేఘాలుంటేనే చినుకు తడి
    భావం మెండుగా ఉంటేనే నూతన ఒరవడి

    ReplyDelete
  2. శశి
    నిశి
    కలిసే

    ReplyDelete
  3. చిత్రానికి తగిన వాక్యాలతో చిక్కని భావాన్ని పలికించారు.

    ReplyDelete
  4. దారినే మార్చుకుని నిశినే నిండుకాంతి కోరుతున్నా..భావం మధురం.

    ReplyDelete
  5. Bagundi andi bhavachitramu.

    ReplyDelete
  6. అందమైన భావాలతో అలరించారు.

    ReplyDelete
  7. నా దగ్గర ఉన్నవి అన్నీ ఇచ్చా, ఇంకేం కావాలి?

    ReplyDelete
  8. నా గురించి నీకిక చెప్పను?

    ReplyDelete
    Replies
    1. హే ఆకాంక్ష గారు.. ఎలా ఉన్నారు.. దాదాపుగా మూడేళ్ల తర్వాత..

      తెలుసుకోవాలి అనూకుంటే మనసు మంచు బిందువు
      తెలుసుకోవాలి అనుకుంటే హృదయం రుధిర తడాగం
      తెలుసుకోవాలంటే భావం అక్షర ఆలోచనల సమాహారం
      నాలుగు పంక్తులను మించక ఎట్లుంది నా కవనం

      Delete
  9. అందరికీ వందనములు _/\_

    ReplyDelete
  10. అర్ధం అయీ అవని దాన్నే కవిత్వం అంటారా!!

    ReplyDelete