సెక్స్ శీర్షిక

మగాడు మోసం చేయాలని చేస్తాడు

కానీ..ప్రతిఫలంగా మోసాన్ని కోరడు
వాడికి కావల్సిన శారీరక సుఖానికై
ప్రేమనే పంచరంగులను అద్దగలడు!!

ఆడది ఆప్యాయత కోరి మోసగిస్తుంది
తన ఆశల భర్తీ కోసం మోసపోతుంది
ఆమె ప్రేమతో కూడిన శృంగారానికై
బానిసలామారి సర్వం సమర్పిస్తుంది!!

మగాడు తడవతడవకూ మోసగిస్తాడు
ఆడది తలచుకుంటే తెలివిగా చేస్తుంది
ఒకరు సెక్స్ కోసం పోరాడి గెలుస్తారు
మరొకరు ఫీలింగ్స్ కొరకు పడిచస్తారు!!

ప్రేమించే మగాడు మగతనం చూపడు
ఆమె అనురాగం అడక్కుండా ఇస్తుంది
ఇచ్చిపుచ్చుకోడంలో ఇద్దరూ తీసిపోరు
అయినా కామం కళ్ళు మూసేస్తుంది!!

తలగడ మంత్రానికి లొంగని మగాడూ
గర్భం చేసినోడిని వదిలిన ఆడదీ లేదు
మగ-ఆడను శృంగారమేగా నిర్దేశిస్తుంది
తొడ-తొడ బంధం తొంభై ఏళ్ళుంటుంది!!

18 comments:

  1. Padmarpita Bold & Beautiful

    ReplyDelete
  2. ఇచ్చిపుచ్చుకోడంలో ఇద్దరూ తీసిపోరు...దొందూ పోరాట యోధులన్నమాట!

    ReplyDelete
  3. తలగడ మంత్రానికి లొంగని మగాడు...హ హా మీరు మాగట్టి చతురులు.

    ReplyDelete
  4. నిజాలు నిర్భయంగా వ్రాస్తారు మీరు.
    చిత్రం అత్యద్భుతం.

    ReplyDelete
  5. తొడ-తొడ బంధం తొంభై ఏళ్ళు????

    ReplyDelete
  6. Fantastic poetry Madam.

    ReplyDelete
  7. మాగొప్ప ధైర్యశాలివి తల్లీ
    చక్కగా రాశావు తగ్గ చిత్రము తగిలించావు.

    ReplyDelete
  8. ఇలా వ్రాయాలంటే ఓర్పు, నేర్పు తో బాటు కూర్పు కూడా కలసి రావాలి. అది మీకు మాత్రమే చెల్లింది, పద్మ గారు

    ReplyDelete
  9. గ్రేట్ పోస్ట్
    డేర్ పిక్..

    ReplyDelete
  10. ఆడది ఆప్యాయత కోరి మోసగిస్తుంది
    మగాడు తడవతడవకూ మోసగిస్తాడు
    ....No No ??????

    ReplyDelete
  11. ప్రస్తుతం మీరు వ్రాసినవి ఒక్కరికే వర్తించదు. ఇద్దరూ మోసగించటంలో తీసిపోరు.

    ReplyDelete
  12. Talagada mantramaa...yemiti adi?

    ReplyDelete
  13. అక్షర అభిమానులకు అభివందనములు_/\_

    ReplyDelete
  14. కోపం అలక జీవితాంతం నీతోనే ఉంటాయి. ఇది తెలిసి కూడా నీ వద్దకు వచ్చిన వారి హృదయాన్ని గాయపర్చకు. ఒంటరిగా మిగిలితే తోడుండేది మరల ఆ భావోద్వేగాలే

    ~శ్రీ

    ReplyDelete