నాకు నేనే..

నాకేం నాలుగ్గోడల మధ్య నలగాలనిలేదు
స్వచ్ఛమైన అభిప్రాయలమర్చిన సొరుగునై
భావోద్రేకాలు అన్నింటినీ వ్యవస్థీకృతంచేసి
నా జీవితారణ్యానికి నేనే లాంతరునౌతా..
నాకెవరూ సహకరించలేదని కృంగిపోలేదు
గాఢాంధకారంలో నాకు నేనే తోడూనీడనై
సంతోషాలు పంచి దుఃఖాన్ని దిగమ్రింగేసి
నా సొంత మంటలలో నేనే వెలిగిపోతా..
నాకేదో అయ్యిందని పరామర్శ అక్కరలేదు
బాధించేవారి సహేతుక సాకులకి దూరమై
మాట్లాడలేని వారికి మాటలు అప్పగించేసి
నా ఆయుష్షురేఖకు నేనే భరోసా అవుతా..
నాలోని నిస్తేజం నాకలసట కలిగించలేదు
ఎందుకంటే నేను నా శరీరానికి బానిసనై
పరుగులు పెట్టించి నన్నునే పరిపాలించేసి
నా బ్రతుకుకి మంచి అర్థం నేనే చెబుతా..

12 comments:

  1. మీ పదజాల అల్లికలకు సలాం.

    ReplyDelete
  2. జీవితారణ్యానికి నేనే లాంతరునౌతా..అద్భుత పద ప్రయోగం.

    ReplyDelete
  3. చాలా బాగారాశారు.

    ReplyDelete
  4. EXCELLENT
    ONE MORE FEATHER IN YOUR CROWN

    ReplyDelete
  5. ఎంత అందమైన వ్యధనో

    ReplyDelete
  6. అద్భుతం అమ్మా

    ReplyDelete
  7. భావోద్రేకాలు అన్నింటినీ వ్యవస్థీకృతం..awesome

    ReplyDelete
  8. Great inspiring lines. Hats off to you.

    ReplyDelete
  9. నాకేం నాలుగ్గోడల మధ్య నలగాలనిలేదు స్వచ్ఛమైన అభిప్రాయలను భావోద్రేకాలను చక్కగా పొందుపరిచారు.

    ReplyDelete
  10. బాధించే వారి సహేతు సాకులకి దూరం.

    ReplyDelete
  11. అక్షరాభిమానులకు వందనములు.

    ReplyDelete