ప్లాస్టిక్ పతంగీతో పంతమేల గాలిపటమా
చంద్రుడ్ని తాకబోయి చెట్లలో చిక్కుకుంది
గాలిపటానికి దారమాధారమని ఎవరికెరుక?
హద్దుమీరిన ఆశయాల్ని ప్రేమతో పెనవేసి
పైకెగిరితే పడిపోతానని తెలిసీ గాలిపటము
ఎవరో పట్టుకుంటారన్న ధీమాతో ఎగసింది
రాలినగాలిపటం రంగులు నచ్చి ఉండొచ్చు
ఉరికొమ్మకు వ్రేలాడుతుందని ఎవరికెరుక?
ఆశల ఆధారాలన్నీ దారంగా ముడులువేసి
పైకెగిరిన మనసు చిల్లుపడిన గాలిపటంలా
క్రిందపడి ఇంకా రెపరెపలాడుతూనే ఉంది
ఎగరేసే వారికది కాలక్షేపం అయ్యుండొచ్చు
ప్రాణాన్ని ఫణంగా పెట్టిందని ఎవరికెరుక?
అయ్యో ఎగిరి రాలిన గాలిపటమా....చాన్నాళ్ళకు మీదైన కూర్పుతో బాగుంది కవిత.
ReplyDeleteఅద్భుతం అండి.
ReplyDeleteprema kosam pranam phanam pettadam bagoledu.
ReplyDeleteక్రిందపడి ఇంకా రెపరెపలాడుతూనే ఉంది
ReplyDeleteగాలిపటం హృదయాన్ని తాకింది
తెగిన గాలిపటం క్రిందపడి చిరిగిపోతుంది.
ReplyDeleteTo who it is concerned madam?
ReplyDeleteNice but hard feel.
ReplyDeleteLothaina bhavam dagi undi.
ReplyDeleteఅద్భుతం అమ్మా...
ReplyDeleteప్రాణాన్ని పణంగా పెట్టడం పెయిన్ ఫుల్
ReplyDeleteyedi vadalaru kada
ReplyDeleteరాలినగాలిపటం రంగులు???
ReplyDeleteSo calculated :)
ReplyDeleteఅక్షర అభిమానులకు అభివందనములు
ReplyDelete