ఇల్లాలు-ప్రియురాలి

తనకేమో కాలం కలిసొస్తుంది
అది క్రమబద్ధమైన సంబంధం
ఈమెదేమో అక్రమసంబంధం!

తను అధికార బద్దమనిపిస్తుంది
ఆమెది చెక్కు చెదిరిపోని స్థానం
ఈమెదేమో గడియకో నిగూఢం!

తన అవసరాలని లాక్కుంటుంది
ఆమెది అందరి ఆమోద యోగ్యం
ఈమెపైనేమో ఛీత్కార అభియోగం!

తనేమో అడిగి అలిగి సాధిస్తుంది
అది బాధ్యతగా చేయాల్సిన కార్యం
ఈమెదేమో ఎదురుచూసే తరుణం!

తన కడుపున వంశాంకురం ఉంది
అది భార్యగా అమెకున్న అదృష్టం
ఈమె కడుపు కొవ్వు కాలుజారడం!

తనకి అన్నింటా భాగస్వామ్యముంది
ఆమెది హక్కుతో కూడిన యవ్వారం
ఈమెదేమో ఇచ్చి పుచ్చుకునే బేరం!

తాను నలుగురిలో తలెత్తి నడుస్తుంది
ఆమెది గర్వంతో కూడిన నిర్భయం
ఈమె మనసున మూలెక్కడో పదిలం!

తను తిట్టినా కొట్టినా పక్కనుంటుంది
ఆమెతోటి చావుబ్రతుకుల సమ్మోహం
ఈమెతో ఉంటే అది రంకు బాగోతం!

ఇంటా బయటా ఇల్లాలు గెలుస్తుంది
అతడు కాదని అవునన్నా ఇది నిజం
ప్రియురాలు ఎప్పుడూ ఆమడ దూరం!

13 comments:

  1. నిర్మొహమాటం లేకుండా చెప్పండి
    మీరు ప్రియురాలా ఇల్లాలా????

    ReplyDelete
  2. Last lines are very true.

    ReplyDelete
  3. ఎవరి తరపున వాధిస్తారు మీరు?

    ReplyDelete
  4. Policalo iddaroo samaname...bagundi

    ReplyDelete
  5. Fantastic...I too agree but helpless.

    ReplyDelete
  6. మీరు చేసిన పోలికలు బాగున్నాయి.

    ReplyDelete
  7. వాస్తవాలు జీర్ణించుకోవడం కష్టం.

    ReplyDelete
  8. అది క్రమబద్ధమైన సంబంధం
    ఈమెదేమో అక్రమసంబంధం
    ఎంత సింప్లుల్ వ్రాస్తారు మీరు

    ReplyDelete
  9. పైకి ఎలా ఉన్నా...మనసులో ఉన్న వారిపైనే మక్కువ ఉంటుంది.

    ReplyDelete
  10. అందరికీ నమస్సులు

    ReplyDelete