కౌగిలించుకుని ఆలోచిస్తే అర్ధమైంది
కనుక్కోవడం మరియు కోల్పోవడం
వదిలేయడం తిరిగిరావడం లాంటివి
అంతులేని నిరంతర ప్రక్రియలని...
జీవితం ప్రతొక్కరికీ ఇంకో అవకాశమిచ్చి
మరో ప్రారంభానికి నాంది పలుకునని!
నా అస్తిత్వపు వస్త్రాల్లో ఆనందం దుఃఖం
ఆశ మరియు నిరాశల దారాలు నిక్షిప్త
నమూనాల్లో పెనవేసుకోవడం చూసి నేను
ఏ పనైనా పరిపూర్ణతతో పూర్తి కాదనెంచి
నడచిన దారి తిరిగి చూసుకుంటే తెలిసె
ప్రతీనష్టం ఒక గుణపాఠాన్ని నేర్పగా...
స్వీకరించే ఓర్పు నేర్పులే పునరుద్ధరణని!
జీవితం చివర్లో ఒక బహుమతిచ్చింది
మరో అవకాశాన్ని కళ్ళముందు ఉంచి
పయనిస్తూ ప్రయాణాన్ని ఆపవద్దనంది
ఇక చేసేదేంలేక జీవితమిలా సాగిస్తున్నది!
Jeevitam bratakali .
ReplyDeleteబ్రతుకే మూణ్ణాల్ల ముచ్చట.. బాల్యం తెలియకుండ ఎగిరిపోయే.. యవ్వనం ఆస్వాదించే లోపే ఎగిరిపోయే.. వృద్ధాప్యం ఏ క్షణాన మిణుక్కు మంటుందో ఏ క్షణాన తుస్సు మంటుందో తెలియని వైనం.. మరి మిగిలింది వయస్కం ఆయస్కాంతం తొలినాళ్ళలో నీరసం మలినాళ్ళలో.. కొద్దో గొప్పో మిగిలిన కాలం పిల్ల జెల్లతో బరువు బాధ్యతలతో పితలాటకం
ReplyDelete~శ్రీ~
Zeevithame oa poratam madam
ReplyDeletetappadu poyrvaraku poeradali.
అన్నీ రుచి చూడండి
ReplyDeleteఅప్పుడే జీవితానికి పరిపూర్ణత.
Nice thought.
Nijalu jeernimpu kavu
ReplyDeleteనిర్ణయాలు ఎప్పుడూ బహీనం కాకూడదు
ReplyDeleteకాలం భారం అనుకుంటే బాధలు తప్పవు...నవ్వుతూ సాగిపోవడమే
ReplyDeleteప్రయాణం ఆపకూడదు. బాగాచెప్పారు.
ReplyDeleteస్వీకరించే ఓర్పు నేర్పులే పునరుద్ధరణ. Meaningful lines.
ReplyDeleteLife is beautiful
ReplyDeletemanam anukovadamlo undi antha.
madam how are you?
ReplyDeletemee postlslo yedo nirasha. enduku? be positive andi.