సాగుతున్న కాలం...

సాగిపోతున్న కాలాన్ని సాగనంపలేక
కౌగిలించుకుని ఆలోచిస్తే అర్ధమైంది
కనుక్కోవడం మరియు కోల్పోవడం
మర్చిపోవడం ఇంకా గుర్తుంచుకోడం
వదిలేయడం తిరిగిరావడం లాంటివి
అంతులేని నిరంతర ప్రక్రియలని...
జీవితం ప్రతొక్కరికీ ఇంకో అవకాశమిచ్చి
మరో ప్రారంభానికి నాంది పలుకునని!
నా అస్తిత్వపు వస్త్రాల్లో ఆనందం దుఃఖం
ఆశ మరియు నిరాశల దారాలు నిక్షిప్త
నమూనాల్లో పెనవేసుకోవడం చూసి నేను
ఏ పనైనా పరిపూర్ణతతో పూర్తి కాదనెంచి
నడచిన దారి తిరిగి చూసుకుంటే తెలిసె
ప్రతీనష్టం ఒక గుణపాఠాన్ని నేర్పగా...
స్వీకరించే ఓర్పు నేర్పులే పునరుద్ధరణని!
జీవితం చివర్లో ఒక బహుమతిచ్చింది
మరో అవకాశాన్ని కళ్ళముందు ఉంచి
పయనిస్తూ ప్రయాణాన్ని ఆపవద్దనంది
ఇక చేసేదేంలేక జీవితమిలా సాగిస్తున్నది!

14 comments:

  1. బ్రతుకే మూణ్ణాల్ల ముచ్చట.. బాల్యం తెలియకుండ ఎగిరిపోయే.. యవ్వనం ఆస్వాదించే లోపే ఎగిరిపోయే.. వృద్ధాప్యం ఏ క్షణాన మిణుక్కు మంటుందో ఏ క్షణాన తుస్సు మంటుందో తెలియని వైనం.. మరి మిగిలింది వయస్కం ఆయస్కాంతం తొలినాళ్ళలో నీరసం మలినాళ్ళలో.. కొద్దో గొప్పో మిగిలిన కాలం పిల్ల జెల్లతో బరువు బాధ్యతలతో పితలాటకం

    ~శ్రీ~

    ReplyDelete
  2. Zeevithame oa poratam madam
    tappadu poyrvaraku poeradali.

    ReplyDelete
  3. అన్నీ రుచి చూడండి
    అప్పుడే జీవితానికి పరిపూర్ణత.
    Nice thought.

    ReplyDelete
  4. నిర్ణయాలు ఎప్పుడూ బహీనం కాకూడదు

    ReplyDelete
  5. కాలం భారం అనుకుంటే బాధలు తప్పవు...నవ్వుతూ సాగిపోవడమే

    ReplyDelete
  6. ప్రయాణం ఆపకూడదు. బాగాచెప్పారు.

    ReplyDelete
  7. స్వీకరించే ఓర్పు నేర్పులే పునరుద్ధరణ. Meaningful lines.

    ReplyDelete
  8. Life is beautiful
    manam anukovadamlo undi antha.

    ReplyDelete
  9. madam how are you?
    mee postlslo yedo nirasha. enduku? be positive andi.

    ReplyDelete
  10. వెలుగు చీకటి, రేయి పగలు, సుఖదు:ఖాల నిరంతర చక్రభ్రమణ సంచార గమనంలో వెలుగు, పగలు, సుఖాలనే అంటిపెట్టుకొని ఉంటామంటే ఒప్పుకుంటుందా విధి..? ముప్పతిప్పలు పెట్టి అనిపించదా హతవిధి..!

    ReplyDelete
  11. ఆవేదన అంచున ఉన్నా చెదరనీయకు చిరునవ్వు
    ఆవేశాన్ని ఆలోచనతో అణగద్రొక్కు
    రేపటి రోజు సదా దైవాధీనమే
    నేటి రోజు సైతం కాలక్రమమే

    ఏడిస్తే తిరిగి రావేవి దూరం ఐనవి
    కనురెప్పల అలికిడికి చెదిరిపోవు ఆశలనేవి
    అయ్యెవి ఔతూనే ఉంటాయి
    కాదనటానికి మన ప్రమేయం ఎంత మాత్రం

    రాగద్వేషాల నడుమ ఉక్కిరి బిక్కిరి జీవితాన
    గందరగోళమైన మనసు సంద్రాన అలలు చాన
    తెప్ప ఒడ్డు చేరే దాక పయనం
    ఎదురు చూస్తున్న నయనం

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  12. అక్షరాలు చాలు వర్ణమాల నుండి తుంచి
    అలవోకగా భావాల దారం పై అల్లుకుని
    సునాయాసంగా కావ్యమాలికను పేర్చి
    అనునిత్యం ఆబాలగోపాలం అలరించి

    దాదాపుగా నెల రెండు దాటే గదా
    కుషలమా అని అడగ మాట రాక
    మౌనంగా అక్షరాల పూలతోనే పలకగా
    పద్మ గారు క్షేమమనే తలుచును గాక

    ~శ్రీత ధరణి

    ReplyDelete