వినతి!!!!

నా ఊహలనే నీ బాసలుగా అనుకున్నానని, ఎదురు చూపులతో నీకై నిరీక్షిస్తూన్న నన్ను మౌనంగా ఉండనీకు.

నాకున్న తావు నీగుండెలోనేనని మనసుతో ఆడుకోవడం నాకు రాదని, తెలిసి ప్రేమలో నన్నోడిపోనీకు.

నీవు కాదన్న నాడు నేను లేనే లేనని నీతో జీవించాలనుకున్నానని, నా జీవితంతో ఆడుకోకు.

నేను కన్న కలలన్నీ నీ కళ్ళతోనేనని, కష్టసుఃఖాల్లో నీతోడు నీడై ఉంటానని మరచిపోకు.

నా మనసొక వాగై ఈ వెల్లువలో ఎటుపోతుందోనని, భీతిల్లిన నన్ను ఒంటరిని చేసిపోకు.

నా జీవనయానంలో చుక్కానివై దరిచేరి నన్ను ఒడి చేర్చుకుంటావనే నమ్మకాన్ని వమ్ముకానీకు!!!

19 comments:

  1. పద్మార్పిత గారు కవిత బాగుందండీ.. ఏమిటో ఈ మధ్య అందరూ ఇలా బేలగా రాసేస్తున్నారు. ట్రెండు మారినట్టుంది. నడుంకట్టి, పిడికిలిబిగించి గెలుచుకోవాలన్న కసిని, ఓడిపోకూడదన్న పట్టుదలని చూపించడంలేదు. నిరాశ నిస్సత్తువ కుమ్మరించేస్తున్నారు..(మీరు రాయలేదా ఇలాంటివి అనకండి .:-) ) మీ తరువాత కవిత కాస్త పదునుగా.. ఘాటుగా రాయండి అలా రాస్తే చూడాలని ఉంది.

    ReplyDelete
  2. ధన్యవాదాలండి!!! తప్పక రాస్తాను కాని....ఘాటుగా ఉందని రుద్రనారి అనో....రౌద్రనారి అనో అనకండి, సరేనా!!!

    ReplyDelete
  3. ఒక రిక్వెస్ట్. ఈ వార్త పైన ఒక కవిత వ్రాయగలరా?

    Auto Prakash1
    Auto Prakash2

    ReplyDelete
  4. పద్మార్పిత గారూ,
    చాలా స్వచ్చమైన భావాలను వెలిబుచ్చిన కవిత ఇదండీ.

    ReplyDelete
  5. జీడిపప్పు గారు... కవితలే సరిగ్గా వ్రాయలేని నేను "ఆశు కవితలు", "ఆదర్శ కవితలు" ఏమి వ్రాయగలను చెప్పండి?

    సిరాకిపుత్ర గారు.....అవునండి నిజమే!!! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలండి.

    ReplyDelete
  6. పద్మా గారు ఎమిటండి అంత బేల గా రాశారు. మా నేస్తము అలా వుండదు కదా కాని చాలా బాగుంది కవిత.
    All The Best Nestham

    ReplyDelete
  7. కవిత బాగుంది పద్మ గారూ..

    ReplyDelete
  8. "MIRCHY VARMA OKA MANCHI PILLODU" గారు బ్లాగ్లోకంలో కాలెట్టిన ఇంఅత్కాలానికి తెలుగులో వ్యాఖ్య రాసిన శుభసందర్భంలో అనేకానేక అభినందనలు. మీరు పది కాలాలపాటు తెలుగులోనే వ్యాఖ్యలు రాస్తుండాలని మా ఆకాంక్ష!

    ReplyDelete
  9. పద్మ గారు, బావుందండీ కవిత..
    కొత్తపాళీ గారు మీ వ్యాఖ్య భలే నవ్వు తెప్పించిందండీ.
    మిర్చి వర్మ గారు మీమ్మల్ని నొప్పించినట్టయితే క్షమించాలి. నిజంగా తెంగ్లీష్ లో ఉన్న కామెంటు చదవడానికి ఎవరికైనా కొంచెం కష్టంగా ఉంటుంది( తెలుగు బ్లాగులు చదవటం అలవాటు పడ్డ తర్వాత ).

    ReplyDelete
  10. bAgundamma mI kavitA O kavitA. migitAvi chadivAka trend artham chEsukoni appuDu vasta.. :)

    ReplyDelete
  11. "నేను కన్న కలలన్నీ నీ కళ్ళతోనేననినేను కన్న కలలన్నీ నీ కళ్ళతోనేనని"...
    కవిత బాగుందండీ

    ReplyDelete
  12. sorry padmagaru...
    i dont understand telugu script but main crieteria of visiting ur profile is ....
    i love ur display pictures...
    they r realy amazing n simply superb..
    tooo... good...
    al d best..

    ReplyDelete
  13. పద్మార్పితగారూ , కవిత బావుంది ..ఐతే త్వరలో రుద్రార్పితను చూస్తామన్న మాట :) :)

    ReplyDelete
  14. పద్మార్పిత గారు మీకవిత నాకు భలేనచ్చిందండి. అందుకే నేను ఇలా చదువుకున్నాను.

    ఊహలన్ని బాసలై , చూపులన్ని ఎదురుచూపులై
    నిరీక్షిస్తున్నా మౌనంగా!


    నీవు లేక నేను లేనని, ఈ జీవితమే నీదని
    నా ప్రాణం నీ హృదయమని, పగులగొట్ట నాకు రాదిని
    తెలిసి ఆడుకోకు నా జీవితంతో..

    నే కన్న కలలన్ని నీ కళ్ళతోనే
    కష్ట సుఖాలు నీ జీవితంతోనే
    తోడు నీడలు నీ నీడతోనే

    నీ ప్రేమతో నా మనసొక ప్రేమవెల్లువ
    జంట లేక భీతితో అది ఎటుపోతుందో...

    నా జీవన యానంలో చుక్కానివి కావా?
    నన్ను నీ దరి చేర్చుకోవా ?
    నమ్మిన నన్ను ఒడిచేర్చుకోవా?

    ReplyDelete
  15. భాస్కర రామిరెడ్డి గారు...
    బాగుంది మీ కవిత ఓ నేస్తమా!
    ఇవి మీ మనోభావాలకి ప్రతిరూపమా!

    బ్లాగ్మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాధాలండి!!!

    ReplyDelete
  16. నేను ఇంత ఆలస్యంగా చూసానేంటి చెప్పుమా!
    భలే బాగుంది మీ కవిత మిత్రమా!
    అమ్మో! నాకూ కవితలు వచ్చేస్తున్నాయి సుమా!!

    ReplyDelete
  17. అయ్యో పద్మార్పిత గారూ, ఇది నా కవితేమిటండి..మీదే! నేను మీ కవిత చదివేటప్పుడు ఇలా అయితే బాగుంటుందనే మీ భావానికి దగ్గరగా చదువుకుంటూ వ్యాఖ్య రూపంలో వ్రాసాను.అంతే.. ఇందులో నా భావాలేవీ లేవు.

    ReplyDelete
  18. పద్మార్పిత గారు, చాలా బాగుంది...లోతైన భావాన్ని చాలా చక్కగా చెప్పారు..

    ReplyDelete
  19. కొత్త పాళీ గారు నేను ఇంతకముందు కుడా తెలుగులొ కామెంట్స్ రాసానండి.
    శేఖర్ గారు ఇందులొ నొచ్చుకొవడానికి ఏముంది సరదాగా అంతె

    Please watch my new posting

    ReplyDelete