పెళ్ళి/చావు

పల్లకీలో కూర్చున్నావు నీవు
పాడెపై పడుకోపెట్టారు నన్ను
పూలతో నిన్ను అలంకరించారు
పూలని నాపై పరిచారు.....

అలంకరించుకున్నానీవు
అలంకరించారు నన్ను
నలుగురిలో కూర్చోబెట్టారు
నలుగురు మోసుకెళ్ళారు....

గమ్యంవైపు పయనం నీవు
తుది మజిలీకి చేర్చారు నన్ను
ఆనందంతో కేరింతలు అందరు
రోదనలతో ఇక్కడ కొందరు....

పురోహితుని మంత్రాలు వింటూ నీవు
కాటికాపరి కాలుస్తున్నాడు నన్ను
నిన్ను అక్షింతలతో ఆశీర్వదించారు
నన్ను ఆశ్రువులతో సాగనంపారు....

బంధాలకు బానిసవు నీవు
బంధవిముక్తున్ని చేసారు నన్ను
జీవితం వైపుకి నీది పయనం
నాతోనే అంతం జీవితం....

21 comments:

  1. Beautiful.. నాకు చాలా బాగా నచ్చిందండీ.. మళ్ళీ మళ్ళీ చదివాను..

    ReplyDelete
  2. Nice....Great comparison...

    ReplyDelete
  3. ఇలా రాస్తే ఎలా కామెంట్ కొట్టాలో అర్ధం కావడం లేదు కానీ చాలా బాగా రాసారు

    ReplyDelete
  4. మురళీగారు నా కవితతో మీ మనసుని మెప్పించగలిగాను....ధన్యవాదాలండి!
    పార్థసారధిగారు మీకు కూడా...

    ReplyDelete
  5. వంశీకృష్ణగారు సుత్తి కొట్టడమే కాదు కమెంట్ కూడా వెరైటీగానే కొట్టారు...థ్యాంక్సండి:)

    ReplyDelete
  6. పుట్టుకకు చావుకు లంకె పెట్టడం విన్నాం గాని ఇలాంటి పోలిక ఎక్కడా చదివినట్టు లేదు.

    ReplyDelete
  7. పద్మార్పితా....ఏది చెప్పినా విభిన్నంగా, వినసొంపుగా ఉంటుంది.

    ReplyDelete
  8. ee bommalanni meeru vesinavenaaA??

    ReplyDelete
  9. నమస్తే.
    అలంకరించుకున్నానీవు
    పై వాక్యం మినహా తతిమ్మావి అర్థం చేసుకుంటున్నాను. స్త్రీ హృదయం లోపించింది.
    ఒక వయసు ఉంటుందా కవిత్వంలో?

    ReplyDelete
  10. @సృజనగారికి థ్యాంక్స్,
    @నేస్తం.....మీ నిట్టూర్పుకి కారణం నేనేనా?
    @మధు మానసం కొన్ని బొమ్మలు వేసినవి, కొన్ని కలెక్ట్ చేసినవి.

    ReplyDelete
  11. నాయుడుగారు నమస్కారమండి.
    మీరు నా బ్లాగ్ కి విచ్చేసినందుకు ధన్యవాదాలు.
    అలంకరించుకున్నావు నీవు అంటే పెళ్ళిలో పెళ్ళికుమార్తె/కుమారుడు అలంకరించుకుంటే చావులో శవాన్ని అలకరిస్తారు కదా అని నాభావం.
    స్త్రీ హృదయం లోపించింది అన్నారు..పెళ్ళిని స్త్రీగా, చావుని పురుషుడిగా అనుకోండి(అక్కడ వ్యక్త పరుస్తుంది చావు) అందుకే మీకు అలా అనిపించి వుంటుంది అనుకుంటున్నాను.
    భావ వ్యక్తీకరణలో లోపాల్ని మన్నించగలరు.

    ReplyDelete
  12. సిరాకిపుత్రగారు,ఇది ఒకపాట చిత్రీకరణని టీవీలో చూస్తుంటే కలిగిన ఆలోచనండి.....

    ReplyDelete
  13. చాల బాగుంది... చావుకూడా పెళ్ళిలాంటిదే బ్రదరూ పాటతో పాటు ఒక హింది షాయరి గుర్తుకొచ్చింది..." ఖబర్ మేరి మర్నేకి సున్‌తేహీ దేఖొ...వొ హాతోమే మెహంది రచనేలగె హై"

    మీ మిగతా కవితలు కూడా కొన్ని చదివాను... చాల బాగున్నాయి...అద్బుతమైన భావ వ్యక్తికరణ, పదాల అల్లిక, బాగున్నాయి.

    ReplyDelete
  14. అత్యంత ఆనందకరము విషాదకరమైన సంఘటనలు చక్కగా జొడించారు. రెండవవిషయం తనదాక వస్తేకాని తెలియదంటారు. ఏదిఏమైన బ్రతికినంత కాలం రొజూ చస్తూ బ్రతుకుతున్నా సుఖసంతొషాలతొ బ్రతకాలి. చివరిగా "నాతోనే అంతం జీవితం...." అనే అందరం భావిస్తాం. కాని అక్కడే మనకు తెలియనిది ఏదొ దాగివుంది. అది తెలుసుకున్ననాడు జీవితం ధన్యమౌతుందని అనిపిస్తుంది. మీకు మరొకసారి అభినందనలు.

    ReplyDelete
  15. baavundi.. yekkado chadivina gnapakam... :-)

    Teri doli uthi,
    Meri mayyat uthi,
    Phool tujh par bhi barse,
    Phool mujh par bhi barse,
    FARQ SIRF ITNA SA THA
    Tu saj gayi,
    Mujhe sajaya gaya .

    Tu bhi ghar ko chali,
    Main bi ghar ko chala,
    FARQ SIRF ITNA SA THA
    Tu uth ke gayi,
    Mujhe uthaya gaya .

    Mehfil wahan bhi thi,
    Log yahan bhi the,
    FARQ SIRF ITNA SA THA
    Unka hasna wahan,
    Inka rona yahan.

    Qazi udhar bhi tha, Molvi idhar bhi tha,
    Do bol tere pade, Do bol mere pade,
    Tera nikah pada, Mera janaaza pada,
    FARQ SIRF ITNA SA THA
    Tujhe apnaya gaya ,
    Mujhe dafnaya gaya...

    ReplyDelete
  16. నాకు మీ ప్రొఫైల్ బొమ్మ (నలుపు-తెలుపు రంగులతో చుడీదార్ లో ఉన్న అమ్మాయి) చాలా నచ్చింది..అది మీరే వేసారా అండీ?

    ఈ కవిత నాకు చాలా బాగా నచ్చింది :-)

    ReplyDelete
  17. chala cahal bagunnai edi okkate kadu anni chalabagunnai Ra... i love so much take care bye

    ReplyDelete
  18. మీ కవితలన్నీ ఇప్పుడే చదువుతున్నాను...
    చాలా బాగున్నాయన్నీ...

    ReplyDelete
  19. is this imagination?any incident behind this writting beautiful peotry?

    ReplyDelete
  20. तेरी दोस्ती के भी चार किनारे होंगे
    मेरी आरती के भी चार किनारे होंगे
    फूल तुज पर भी बरसेंगे
    फूल मुझ पर भी बरसेंगे
    लोग तेरे लिए भी रोएंजे
    लोग मेरे लिए भी रोएंजे
    बस फरक इतना होगा
    तेरा किसिको इंतजार होगा
    और हमारा अंतिम संस्कार होगा
    this is what i read..

    ReplyDelete