టాటా...బైబై!!

 నేను రాసేవి కవితలంటే కవితా హృదయం నన్ను గేలిచేస్తుంది
రాయకపోతే మీకు దూరమై నా ఒంటరితనం నన్ను వేధిస్తుంది

నా రాతల్లోనిది కవిత్వమే కాదు కల్పన కూడా అందులో లేదు
గుండె యొక్క స్వరానికి తర్జుమాయే కానీ పదాల అల్లిక కాదు

అప్పుడప్పుడు గుండెలయలే ఊసులై పదమాలికలై పెనవేసాయి
కొన్నిసార్లు కన్నీళ్ళే నా కవితలకి కారణమై ఉప్పొంగి పారాయి

శాంతి కరుణ శృంగార శౌర్య భయ రౌద్ర అద్భుత హాస్య భీభత్సం
ఈ నవరసాలు మేళవించిన జీవిత సత్యాలే నా రాతలకు కారణం

ప్రేమికుల అనురాగమే అలవోకాక్షరాలై అల్లుకున్న కవితలుకొన్ని
మధురసంగీత సప్తస్వరాలు అందించిన ఆనందపు వీచికలింకొన్ని

చావుబ్రతుకుల సారమెరుగని నాకు సాహిత్య సారాంశమేమెరుక
సాదాగాబ్రతికే నేను సంఘసంస్కరణ చేయ ఏపాటిదాననుగనుక

నే రాసే ఈ రాతలు నలుగురి నవ్వుకి కారణమైతే అదే ఆనందం
నా ఈ బ్లాగ్ రాతలు ఎవరినీ నొప్పించి ఉండవనేదే నా నమ్మకం!!
టాటా...బై...ఇంక చాలు ఈ 2012లో మిమ్మల్ని హింసించింది:-)
మరి మీరంతా రెడీనా!!.....2013 లో నా సుత్తిని భరించడానికి:-)

48 comments:

  1. చాలా బాగుంది, 2,3 బాగా నచ్చాయ్,..మన కవిత్వం మనకి తృప్తినిస్తే అది మంచి కవిత్వమే,....నూతన సంవత్సర శుభాకాంక్షలు,...

    ReplyDelete
    Replies
    1. మనకి నచ్చింది నలుగురు మెచ్చితే మహదానందం:-) మెచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  2. ఈ కవితకి ప్రకాశ్ బాబు గారి పెయింటింగ్ ఎంత బాగా కుదిరిందో !! ఆయన పెయింటింగ్స్ మీద ఉండే అభిమానంతో కళ్ళు అక్కడే చాలా సేపు నిలిచిపోయాయి
    ఎవ్వరినీ నొప్పించలేదు పద్మార్పిత గారూ, మెప్పు పొందుతూనే ఉన్నారుగా :) మీరు విచ్చలవిడిగా వ్రాసేయండి, నేను రెడీ :)

    ReplyDelete
    Replies
    1. చూపుని పెయింటింగ్ నుండి తిప్పి ఇటు రాసింది చదివి విచ్చలవిడిగా వ్రాసేయమన్న మీకు అభివందనం.:-)

      Delete
  3. పద్మ గారూ!...మనం అలా వ్రాయడం మానేస్తే...జనం సుఖపడిపోరూ!...:-)....అంచేత ఎవరు ఏమైనా ఏమనుకున్నా...అక్షరాలూ గుప్పెచ్చేద్దాం...బ్లాగ్ లో మన పుటలని భావాలతో నింపెద్దాం...ఏమంటారు?...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. ఓహో.....నా పార్టీయే మీరుకూడాను, ఇంకేం కుమ్మేద్దాం:-)

      Delete
  4. మీ పదాలా మద్య కామాలు పెట్టి కవిత అనుకోమంటే ఎలా పద్మ
    కాసుకోండి వచ్చే సంవత్సరం కూడా అంటే తప్పించుకోవడం ఎలా చెప్మా?
    మీరు రాయడం మానేస్తా అంటే చేసుకోస్తా ఉప్మా
    మనసులో భావాల్ని కక్కి చస్తా , మీ అంతు చూస్తా అంటే మాత్రం
    మీ కవితల ఫోటోలు చూసి బతికేస్తా .

    ReplyDelete
    Replies
    1. రవిగారు..మీ రిప్లై ఇంత సాప్ట్ గా ఉప్మాలా ఉందేంటి చెప్మా?
      తప్పదు మీరు ఫోటోలను చూస్తూ ఫాలో కావలసిందే:-)

      Delete
  5. మంచి భావుకతతో 2012 కి టాటా చెప్పారు.
    అందమైన కవితా బొమ్మతో 2013 కి స్వాగతం ఎలా చెప్తారా అని వేచి ఉన్నాం.
    ఎప్పటిలానే మీ "పద"నిసలు చలా బాగున్నాయి.
    బొమ్మా మీరేశారేమో అనుకున్నాం, బ్యూటిఫుల్!

    ReplyDelete
    Replies
    1. నా భావుకత్వం నచ్చినందుకు నెనర్లండి.
      ఆ పిక్ PRAKASH గారిదండి.....
      మీలా ఊహించి అందమైన బొమ్మలు వేసేయలేను కదండి:-(

      Delete
  6. Love reading your posts.. and yeah..keep writing.. :)
    -- Ananth

    ReplyDelete
    Replies
    1. thanks for your affectionate compliment:-)

      Delete
  7. మీరాసేవి కవితలు కావంటూనే మార్కులు కొట్టేస్తారు:)
    మీరు కాదన్నంతమాత్రాన్న కాకుండా పోతాయేంటి:)

    ReplyDelete
    Replies
    1. మార్కులు వేసి పాస్ చేసి ప్రేరేపించేది మీరంతానే కదండి:-)

      Delete
  8. ఆ టైటిల్ చూసి కించిత్ భయపడ్డా.. ఆ తర్వాత భావం చూసి శాంతించా.... ఏది రాసినా భలే నచ్చేట్టు రాసేస్తారు అదేంటో మరి...
    మీరేమో సుత్తి అంటారు కాని వాటికే మిమ్మల్ని స్తుతించాలని అనిపిస్తుంది....

    ReplyDelete
    Replies
    1. టాటా అన్నానంటే టపాకట్టేసాననుకున్నారా:-) అంత సులువుగా పోతానేంటి....ఇంకా ఎంతో స్తుతించేలా రాసేయాలి కదండి:-) మీ అభిమానానికి ధన్యవాదాలండి.

      Delete
  9. నవ రసాలు పలికించే మీ హృదయాంతరాళంలోని భావోద్వేగానికి సుమాంజలులండీ.. చిత్రం మీ అంత అందంగా లేదనిపించింది.. నూతన సం.లో ఓ అందమైన చిత్రంతో సరికొత్త భావావేశంతో బ్లాగిల్లు అలంకరిస్తారని ఆశిస్తూ... అభినందనలతో...

    ReplyDelete
    Replies
    1. నా భావోద్వేగాలకి మీరందించే అభిమాన స్పందనలకు వందనాలు. ఇక ముందు మీ కళ్ళకింపైన చిత్రాలతో రంజింపజేసే ప్రయత్నం చేస్తానండి.

      Delete
  10. చాల్లే సంబరం.....అలా రాయలేను ఇలా రాయలేనంటే మేము ఒప్పుకుంటామేంటి:-) 2013 అలా అనకుండా అదరకొట్టేయండి అందమైన కవితలతో దానికి తగిన చిత్రాలతో.

    ReplyDelete
    Replies
    1. అలాగే.....భరిస్తానని భరోసా ఇస్తే:-)

      Delete
  11. టాటా 2012 కదా మాకు కాదు కదా
    హమ్మయ్య శీర్హిక చూసి భయమేసింది.:)
    నుతన సంవత్సరంలో
    మరిన్ని హృదయా'ర్పిత పద్మా'లను అందుకోవడానికి మేము సిద్ధం.
    పూయించేయండి ఇక భావాల నీరుపోసి...:)
    Yappie Yappie New Year..:)

    ReplyDelete
    Replies
    1. నా భావాల నీటితో పాటు మీ అభిమానపు స్పందనల గాలి తోడైతేనే పద్మ మరిన్ని పుష్పాలని అర్పించగలదండి.Thank you:-)

      Delete
  12. టాటా బై బై అంటే ఢిల్లీ అమ్మాయి గురించి రాసారేమో అనుకున్నానండి......అది విషాదకరమే అయినా అందరూ పుంఖాను పుంఖలుగా పోస్ట్ లు రాయడానికే కాని ఎంతవరకు ఆమె ఆత్మకు శాంతి చేకూరి, మనుషుల్లో మార్పు వచ్చిందో తెలీదు....ఇది ఇక్కడ అప్రస్తుతమే అయినా ఎందుకో రాయాలనిపించింది:(

    మీరు రాసేవి మన్సుకు కాస్త ఉపసమనాన్ని ఉత్తేజాన్ని ఇస్తాయి.....2013 లో రెచ్చిపొండి:-)



    ReplyDelete
    Replies
    1. తప్పకుండా ప్రయత్నిస్తాను...ఉల్లాసంగా ఉత్తేజపరచడానికి:-)

      Delete
  13. nice one andi. wish u good luck in 2013 also. Wish u happy new year...

    ReplyDelete
  14. బాగుందండీ... ;)
    మీకూ మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు...
    ఇంకో మాట... మీ బ్లాగ్ టెంప్లేట్, రాగానే ప్లే అయ్యే సాంగ్,దానికి తగ్గ మీ పోస్ట్ కాంబినేషన్ సూఊఊఊఊపర్...

    ReplyDelete
    Replies
    1. టాంకుల కొద్ది థ్యాంక్సండి.:-)

      Delete
  15. మీరు రాయకపోతేనే లైఫ్ సుత్తిలా అనిపిస్తుంది:)
    నూతన సంవత్సర శుభాకాంక్షలు..Rock on

    ReplyDelete
  16. బాగుంది

    ReplyDelete
  17. అధ్బుత కవితా ప్రపంచం మీది. ఇంకా చదవాలనిపించే మీ పదాల కలయిక వర్ణించలేనివి.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనలకు ధన్యవాదములు.

      Delete
  18. Happy New Year 2013

    ; కోణమానిని

    ReplyDelete
    Replies
    1. మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు.

      Delete
  19. చాలా బాగుందండీ. మీ కవితలన్నీ బాగుంటాయి.అలవోకాక్షరాలని సంధి చేయకుండా ఉంటే బాగుండేది.అలవోకగా అక్షరాలై అన్నా హాయిగానే ఉంటుంది.కవితలతో పాటు మీరు పెట్టే ఫొటోలు కూడా మమ్మల్ని అలరిస్తున్నాయి..

    ReplyDelete
  20. చాన్నాళ్ళకి ఇటువైపు మీ చూపు. నిజమే మీరన్నట్లు విడిగానే బాగుంది. సదా మీ అభిప్రాయాలని, అభిమానాన్ని ఆశిస్తూ....ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  21. హహహ మీరు కూడా బ్రేక్ తీస్కుంటున్నారా ఓ నిముషం భయపడ్డానండీ :-)
    చాలా చక్కగా రాశారు. మేము సిద్దమే మీ సుత్తి భరించడానికి కాదండోయ్... మీ అందమైన ఊహలను మరింత అందంగా ప్రజంట్ చేసే మీ కవితలను మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి :-)
    మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  22. చింతవలదు...ఎలాగో భరించక తప్పదు....:-)
    ధన్యవాదాలండి.

    ReplyDelete
  23. ఈ తవికేదో నేను కవయిత్రిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయుచ్చుకుని కొడతా అన్నట్లు వున్నది. ;)
    నవరసాలవరకు వోకే! సామాజిక సౄహ గట్రా అంటూ దశమరసం జోలికి వెల్లకండి. ప్లీస్.
    నవ్వు నాలుగు విధాలా చేటు అని ఊరికే అన్నరా పెద్దలు. ఆ నాపచేను పండాలా వద్దా అనేది మీ చేతుల్లొనే వుంది. ;)
    నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. నా తవికని కవితనుకుని తిట్టారో పొగిడారో తెలీదు...అందుకే :-) :-)
      థ్యాంక్యూ, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

      Delete
  24. wish u a very very happy new year padmarpita gaar.....

    ReplyDelete
  25. ఆ చిత్తరువులలోని చిత్రాలు మీవేనా?
    మీరు మిమ్మల్ని చిత్రించుకున్నారా?
    పెన్సిల్ స్కెచెస్ చాలా అందంగా ఉన్నాయి.
    క్రిష్ణవేణీ అలల తరంగాల్లా ఆ కురుల చిత్రీకరణ బాగుంది.
    చిరుగాలి తెమ్మెరల్లా,
    చిన్నపిల్లల అల్లరిలా
    మీ మీ గీతికలు, పదాల అల్లికలు చాలా బాగున్నాయి.
    నాకెందుకో ఇది చదవగానే ఒక చిన్నపాప చేసే అల్లరిలా అనిపించింది.

    మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. Welcome to my blog.
      మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

      Delete