పర్మినెంట్ పర్మిషన్ గ్రాంటెడ్ టు డూ సెక్స్ కదా
పచ్చిగా చెప్పినా అడిగినా బాగుండదనే ఈ తంతు
ఒంట్లో కోర్కెలు సంకెళ్ళు తెంచుకుని వెల్లువై పొంగ
చట్టబద్ధంగా నాలుగ్గోడల మధ్యన చీకట్లో చేసుకునే
టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజెన్ కలిసి జరుపుకునేదీ రాసకేళీ!
ప్రాబ్లం కానంత వరకెన్ని పాతివ్రత్యాలనైనా వల్లించి
ప్రవచనాలెన్నో నిజమనుకునేలా చెప్పే అబద్ధం కదా
శరీర వేడి తగ్గడానికి జరిపే రెండు నిముషాల తంతు
ఇద్దరూ అమాయకులమని ఆత్మవంచన చేసుకుంటూ
సత్ సంస్కారసహజీవన ముసుగులో గుద్దులాడుకునే
ఆమె ఎప్పటికీ ఒక శీలవతీ అతడు ఒక చెక్కరకేళీ!
ఫ్రాంక్ గా...కావల్సిన్నప్పుడు కామమందించే కంపెనీ
కండిషనల్ అటాచ్మెంట్స్ ని పిల్స్ గా మింగడమే కదా
ప్రేమ పక్కలో పడుకుని పైత్యం పెనవేసుకునేదీ తంతు
పరిస్థితుల ప్రభావంలో ఆడామగతనాలు సంసారం చేసి
మరోప్రాణి జీవంపోసుకుని బలమైన బంధం ఏర్పడగానే
మేల్ ఫిమేల్ ఆర్గాన్స్ ని పత్తిత్తులుగా చేస్తుందీ రంగేళీ!
అయ్యబాబోయ్ పెళ్ళి తంతు మొత్తం తిరగరాసారు.
ReplyDeleteఏమైనది పద్మార్పితగారు..
"పెళ్ళంటే నూరేళ్ళ పంట"
ReplyDeleteScience and social mixed poem.
ReplyDeleteపెళ్లంటే....
ReplyDeleteపెళ్ళంటే సందళ్ళు..పందిళ్ళు మూడే ముళ్ళు
ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు
అందుకే ఒక అడుగు ముందుకు వేయక ఒక అడుగు వెనుకకు వేయక కలిసి నడవాలండీ చివరి వరకూ చేయి వదలక....
ఎందుకు అంత వ్యతిరేక భావాలు వేదచల్లుతున్నారు,భారతీయ వివాహా వ్యవస్థ ని అంత చులకన చేయాల్సినది ఏముంది.మన తల్లితండ్రులు వివాహం చేసుకోకుంటే మనం వుండము కదా.పెళ్లి మన భారతీయ సంస్కృతి వెన్నెముక.మీరు చెప్పిన విషయం మనపై బలవంత ముగా రుద్ద బడుతుంది.పెళ్లి కాకుండా కోరికలు తీర్చుకోడం మంచిదా.ఏమి చెప్పాలనుకొంటున్నారు.
ReplyDeleteఇది నా అభిప్రాయం .
మీరేమైనా పత్తిత్తా అని మీరు నిలదీస్తే చెప్పలేను కానీ ఓటమి అనేది ఎక్కడైనా ఉంటుంది. ప్రేమలోనో, పెళ్ళిలోనో ఓడిపోతే మొత్తం వ్యవస్థనే నిందించడం మంచిది కాదు. మీరు చెపితే జనాలు వినేస్తారని కాదు గానీ నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనీయవు.
ReplyDeleteఇది సత్యం.
Deleteపెళ్ళి చేసుకోకుండా మాస్టుర్బేషన్ (హస్తప్రయోగం) చేసుకుని ఎవడు సంతృప్తి పడగలడు?
ReplyDeleteఈ మారు ప్రేమ బంధం వీడి వివాహ బంధానికి ఎసరు పెట్టారా మేడంజీ.
ReplyDeleteఏదో లోతట్టు విష్యం చెప్పాలి అనుకున్నారు.
ఇరువురికీ ప్రాబ్లం లేకుంటే నో ప్రాబ్లం.
ReplyDeleteవివాహ వ్యవస్థను ఎంతో పకడ్బందీగా పెద్దలు చేసారు. అటువంటి వ్యవస్థను నేటి తరం మొత్తం గల్లంతు చేసి కొత్త పంధా ఫాలో అవుతుంది. దీని నుండి బయటపడే విధానం ఆలోచించాలి అంతే కానీ అదే కరెక్ట్ అంటే ఎలా మంచి ఫాలో ఉన్న మీలాంటి వారు.
ReplyDeleteమొత్తం వివాహం ఆ ప్రక్రియయే తప్పు అనే ధృక్కోణమే తప్పు అన్నట్లు చిత్రించారు.
అంటే పెళ్ళి పెటాకులూ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు బలాదూర్ అంటారా!
ReplyDeleteపెళ్ళనేది ఇద్దరి మనసుల కలయిక
ReplyDeleteచిన్న చిన్న సర్దుబాట్లతో సరి చేసుకుని పయనిస్తే స్వర్గం లేదంటే నరకం.
బాగుంది
ReplyDeletehttps://postpapa.com/Photo/
ప్రేమ, సహజీవనం, కళ్యాణం అంటూ స్త్రీ పురుషులు ఇద్దరూ నాగరీకంగా ఒకరినొకరు మోసం చేసుకోవడమే నేటితరం పెళ్ళిళ్ళు.
ReplyDeleteమనిషి పుట్టుక మెటీరియలిజం అనుకుంటే మనిషి చావు కూడా మెటీరియలిజమే అలాగే పెళ్ళిచేసుకుని పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేసి నిష్క్రమించడం కూడా అంతా మెకానికల్ జరిగిపోతుంది. చెప్పాలంటే మనిషి బ్రతుకు మెటీరియలిజమై సెక్స్ కూడా మెటీరియలిజమే అయిపోయింది ఈ రోజుల్లో. ఇటువంటి సిచ్యువేషన్లో మీ భావాలు సరిపోతున్నాయి.
ReplyDeleteవిచ్చల విడి గాని విధమొప్ప , ధర్మార్థ
ReplyDeleteకామములను , పెండ్లి ఘనము సేయు ,
పరగ పెండ్లి వల్ల పత్తిత్తు లౌదురా ?
జంతు ధర్మము విడజాలు గాని .
ReplyDeleteఏ బంధాలూ లేకుండా మనుషులు ఎలా ఉండగలరు.
పెళ్ళి చేసుకున్నవారు మాత్రమే అని వేరు చెయ్యనేల?
ReplyDeleteపెళ్ళి ఎందుకని మమ్మల్ని ప్రశ్నించి పెళ్ళిపై తిరుగుబాటు ధోరణి ప్రదర్శించారు.
ReplyDeleteపెళ్ళి చేసుకునే ముందు ఆలొచించవలసినవి పెళ్ళైపోయిన వారికి వేస్ట్...ఏమీ చెయ్యలేము సర్దుకుపోతూ సంసారం చేయడము తప్పదు.
ReplyDeleteఇక్కడ కేవలం నా భావాలని వ్యక్తపరిచాను
ReplyDeleteనాణ్యానికి నేను ఒక వైపు మాత్రమే చూసి ఉంటాను.
ఏది ఏమైనా నా భావాలని సహృదయంతో చదివి వ్యాఖ్యలు వ్రాస్తున్న ప్రతీ ఒక్కరికీ నా హృదయపూర్వక అభివందనములు. మన్నించాలి విడిగా రిప్లైస్ ఇవ్వనందుకు. ఇక పై తప్పక అందరికీ విడివిడిగా సమాధానం రాసే ప్రయత్నం చేస్తాను-పద్మార్పిత