బేరమేల?

అచ్చమైన తొమ్మిగుమ్మాల తోలుతిత్తిలాంటిది దేహం
హేయమైన కోరికలు అంటూనే ఆపుకోలేనిది మోహం 
కొవ్వుపట్టిన జగత్తు విచిత్ర రంగుల మైకపు సంతలో
అరువు తెచ్చుకున్న అందాలకు కట్టేటి వెల ఎంతనో?

నిదురలేని రాని అశాంతి రాత్రులు ఎరువిచ్చే శృంగారం
మెడలో జిగేలంటూ మెరుస్తున్న గిల్టు గోల్డు చంద్రహారం   
చెమ్కీ చీర తళుక్కులో పెదవులకు పూసిన రంగులతో
చపలమనసుల బురదలోబొర్లేటి బొమ్మ సంపాదనెంతనో?

చీకటిముసుగేసి సందులో దూరేటి ప్రబుధ్ధుల సంస్కారం 
వెలుగులో సానిదాని ముఖం చూస్తే ఎందుకనో చీత్కారం
నలిగిన పైట పూలు సరిచేసుకుని చూడ బ్రతుకుటద్దంలో
సిగ్గుచచ్చిన ప్రతిబింబం గారపళ్ళతో నవ్వుతుందెందుకనో?

చలిగాలి పొందుకోర వేడెక్కించే తొడల కోసమేగా ఆరాటం 
క్షణాల్లో మాయమైపోయే ఆయువుకి ఎందుకనీ బీభత్సం
పెట్టుబడిగా పడుకుని పొర్లేటి దేహమది పడుపు వృత్తిలో
అవసరం తీర్చుకుని పోతూ బేరమాడితే లాభం ఎంతనో? 

30 comments:

  1. చావు రాని బతుకులు వెలయాలి జీవితాలు. అందరి ప్రేమకూ దూరమైన అందరితో చీ అనిపించుకుంటూ ఇంకెన్నాళ్ళు ఈ బ్రతుకు అనుకుంటూనే బ్రతికే వారి గురించి వ్రాసిన పదాలు ప్రశంసనీయం వ్యధాభరితం.

    ReplyDelete
  2. అశ్చర్యకరంగా ఆర్దతతో అమరిన అద్భుత కావ్యం. కుడోస్ పద్మగారు.

    ReplyDelete
  3. శారీరకంగా పతనమైన వారి జీవితాలు ఎంతో మానసిక పరివర్తన కలిగి ఉంటాయి అనిపిస్తుంది మీ కవిత చదువుతుంటే. చాలా బాగా వ్రాసారండీ.

    ReplyDelete
  4. ఏంది గిట్ల సంపేసినారు మగాళ్ళు కంజూసీగాళ్ళను చేసినారు.

    ReplyDelete
  5. వేశ్యలతో బేరసారాలు చేసి సంపాదించే సొమ్ము కూడా సొమ్మేనా.
    గతిలేక వాళ్ళు శరీరాన్ని కుళ్ళబెట్టుకుని బ్రతుకుతుండ వారితో బేరం అతి నీచమైన పని.
    వేశ్యల వ్యధని కళ్ళకు కట్టినట్లుగా రాశారు.

    ReplyDelete
  6. పడుపువృత్తి చేసుకుని పబ్బం గడుపుకునే వారిని శారీరకంగా బాధించి కోర్కెలు తీర్చుకుని ఆపై వారికి ముట్టజెప్పవలసిన సొమ్ము ఎగ్గొట్టే వారు కూడా లోకంలో లేకపోలేదు.పడుపు వృత్తి చేసుకోవడం లీగలైజ్ అయిన తరువాత డైరెక్టుగా వీరి చేతికే సొమ్ము చేరుతుంది అనుకుంటా..ముందు వీరికి సొమ్ము ముట్టేది కాదు, మధ్యలో దళారులు మ్రింగేసేవారు. మంచి అంశాన్ని తీసుకుని కవితగా వ్రాశారు.
    వ్యభిచార వృత్తి మానుకుని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుంటే వీరి జీవితాలు సక్రమ మార్గంలో సాగుతాయి అలాగే వీరి పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది.

    ReplyDelete
  7. వేశ్యల దుర్భర జీవితాల
    వివరణ మదిని తడిమేసె
    పదముల చిత్రీకరణ తీరు
    కళ్ళని చెమర్చేలా చేసె
    లోకం తీరుతెన్నులనే
    అక్షరాలు ప్రశ్నించే
    భాళారే పద్మార్పితా భళా..

    ReplyDelete
  8. సామాజిక రుగ్మతలలొ
    కామము పాళ్లెక్కువ , పొరగ్రమ్మి , బ్రతుకులో
    క్షేమము గోల్పోదు రిరువు ,
    రేమాడ్కి దీన్ని గెలువగ లేరా ? పతితుల్ .

    ReplyDelete
  9. లాభం లేనిది ఎవరు ఏపని చెయ్యరు.
    అవకాశం చూసుకుని బేరం చేయ్యని వారు తెలివితక్కువ వారు.

    ReplyDelete
  10. మరో బాణం గురి చూసి కొట్టింది..ప్లాష్ న్యూస్ అన్నట్లు.

    ReplyDelete
  11. మాటలు కరువైనాయి
    అద్భుతం మీ పోస్ట్.

    ReplyDelete
  12. అచ్చమైన తొమ్మిగుమ్మాల తోలుతిత్తిలాంటిది దేహం మొదటి ముక్కతోనే చంపేసారు.

    ReplyDelete
  13. మీరు అడిగే ప్రశ్నలకి ప్రకృతి తన రహస్యాలను తెలిపే తలుపులను తెరుస్తుంది.
    ఆలోచనాత్మకం మీ కవనం.

    ReplyDelete
  14. శ్రీనాథుడు వేశ్యలపై రచించిన ఒక పద్యం:
    పురుషుడు గూడువేళ బెడబుద్ధులు, యోగ్యముకాని చేతలున్
    సరగున మేని కంపు, చెడు చందపు రూపము, నేహ్యవస్త్రముం
    బరగు నిరంతరంబు, నెడబాయని సౌఖ్యము, లేని ప్రేమయున్
    విరహపు జూడ్కు, లుమ్మలిక వీసము, జల్లులు వేశ్యభామకున్ !

    ReplyDelete
  15. వేశ్యల జీవితాల్ని ఇతివృత్తంగా ఎంచుకొని యదార్థ సంఘటనలని చక్కగా కవితల్లావు. దేశంలోని సగానికి సగంపైగా జిల్లాల్లో ఆడపిల్లలు అన్యాయంగా వ్యభిచార కూపాలకు తరలిపోతున్నారు, వారు వేశ్యావాటికల్లో మగ్గిపోతున్నారని ఒక నివేదికలో వెల్లడయ్యింది.

    ReplyDelete
    Replies
    1. ఈ కూపంలో చిక్కున్న అనేకమంది ఇప్పుడు సక్రమ మార్గంలో బ్రతుకుతున్నారు మాస్టారు.

      Delete
  16. సామాజిక ఇతివృత్తానికి న్యాయం చేస్తూ నిజాలు రాసారు. అభినందిస్తున్నాను.

    ReplyDelete
  17. Padma Outstanding Post. Keep it up.

    ReplyDelete
  18. మీరు మనసుపెట్టి వ్రాస్తారు అందుకేనేమో అద్భుతంగా ఉంటాయి ఎవి వ్రాసినా.

    ReplyDelete
  19. వేశ్యల జీవన విధానంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి.
    వారు కూడా జనాల్లో కలిసి మామూలుగా బ్రతుకుతున్నారు.

    ReplyDelete
  20. వాస్తవ చిత్రీకరణ.

    ReplyDelete
  21. శతకోటి వందనములు-పద్మార్పిత

    ReplyDelete
  22. అద్భుతం మీ కవిత

    ReplyDelete
  23. మీ సత్తా ఉన్న కవిత

    ReplyDelete
  24. Mee kavitha nipunyam, katina manasu kalavadini kuda karigistundhi.

    ReplyDelete
  25. చీకటి కోనేరులో విరిసిన కలువను
    పచ్చనోటు చూసి పైట తొలగిస్తాను
    పక్కదారిలో పయనించే ప్రతిమగవాడికీ
    సొగసుల పువ్వులు సరసంగా అందిస్తాను
    మోసానికి గురై వంచన వలలో చిక్కాను
    చాలీచాలని అతుకుల బ్రతుకు కూడదని
    పిల్లలకు చాలీ చాలని తిండితో చంపలేక
    వలపుఅంగట్లో అమ్ముడై బ్రతుకుతున్నా..

    ReplyDelete