వణికించిన వాక్యాలు

ఎలా జీవిస్తే బాగుంటుందోనని తీరిగ్గా నన్ను నేను ప్రశ్నించుకున్నా
పద్మార్పితాని లేని గంభీరాన్ని గొంతులో నింపుకుని గది పిలిచింది

అప్పుడే పైకప్పు: హైగా ఆలోచించి ఆకాశమంత ఎత్తుకి ఎదుగంది
సీలింగ్ ఫ్యాన్: సిల్లీ ప్రశ్న, ముందు మైండును చల్లగా ఉంచమంది
గడియారం: సమయానికి విలువిచ్చి మసలుకోమని సజెస్ట్ చేసింది
క్యాలెండర్: కాలంతోపాటు సాగిపోవాలి అదాగదని కిలకిలా నవ్వింది
నా పర్స్: పైసామే పరమాత్మ, భవిష్యత్తు కోసం మనీ దాచమంది
అద్దము: నిన్ను నీవు నాలో చూసుకుని సవరించుకోమని చెప్పింది
గోడ: పెద్ద ఆరిందాలా ఇతరుల భారాన్ని నువ్వు పంచుకోవాలనంది
కిటికీ: నీ కోణంలోనే కాక పదిమంది దృష్టితో చూసి నేర్చుకోవాలంది
నేల మాత్రం: నిబ్బరంతో ఎవరెంత ఎత్తుకెదిగినా నేలపైనే ఉండాలంది!

అప్పుడు నే మంచంవైపు మత్తుగా చూసి నువ్వు కూడా చెప్పన్నా
సలహాలు అనేవి చెప్పుడానికి వినడానికే తప్ప బ్రతకడానికి కాదని..
చల్లగా ఉంది దుప్పట్లో దూరి పడుకో, మిగతావి మోహమాయంది!!  

15 comments:

  1. అద్భుతమైన సందేశాన్ని చెబుతూనే చివరిలో ట్విస్ట్ ఇచ్చారు.

    ReplyDelete
  2. సలహాలు అనేవి చెప్పుడానికి వినడానికే తప్ప బ్రతకడానికి కాదని..

    ReplyDelete
  3. మన మెదడు కత్తి లేడా బ్లేడు లాంటిది, దానిని ఉపయోగించే విధానంలోనే ఫలితం ఆధారపడి వుంటుంది.

    ReplyDelete
  4. చిమ్మ చీకటిలో కూడా విశ్వాసం వెలుతురును నింపుతుంది, సగం సమస్యలకు కారణం చెడుగా ఆలోచించే మనసుదే.

    ReplyDelete
  5. Room so clever and intelligent

    ReplyDelete
  6. అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు పద్మార్పితా
    అందుకే ఇలా గది గోడలు వస్తువులు మాట్లడుతున్నవి
    జీవితాన్ని దాని దారిలో దాన్ని వెళ్ళనివ్వడం మంచిది
    లేదని అన్ని మన నెత్తిన వేస్తుకున్నామా ఇంతే మరి..

    ReplyDelete
  7. గది గుణపాఠం నేర్పింది.

    ReplyDelete
  8. నీతులు సలహాలు చెప్పడానికే అని చక్కగా వివరించారు.

    ReplyDelete
  9. మంచం నిజమే చెప్పినట్లుంది పద్మార్పితా
    హాయిగా దుప్పటి కప్పుకుని నిద్రపోకుండా ఎందుకు వచ్చిన అనవసరపు ఆలోచనలు చెప్పు.

    ReplyDelete
  10. 2019 ఆరంభంలో అదగొట్టే పోస్ట్ లేదు ఎందుకని?

    ReplyDelete
  11. జీవితం సక్రమ మార్గంలో సాగడానికి సూత్రాలు చెప్పిన గది. బాగుండి.

    ReplyDelete
  12. అందరికీ వందనములు.

    ReplyDelete