మారనా?

ఋతుపవనాలపై గాలితెమ్మెరయే అలిగింది
పువ్వులోని తేనెను తుమ్మెదొచ్చి తాగింది
జీవితం నడవడికనే మార్చి దారిమళ్ళింది
ఈ వంకన నేను నా మనసు మార్చుకొని
బ్రతుకు మతలబు తెలుసుకుని మెలగనా? 

పాతలోగిలి లోనికి క్రొత్తకిరణమొచ్చి వాలింది
మండుటెండకి మోముపై మెరుపు తరిగింది
చిలిపితనం గంభీరరూపానికి బానిసై ఒరిగింది
ఇదే అదుననుకుని నా రూపం మార్చుకుని
బంధాలు త్రెంచుకుని నేను ఎటైనా ఎగిరిపోనా?

కోయిల పావురంలా సమాచారం అందించింది
ఉడుత నిలకడగా నిలబడి ఉన్నది చెప్పింది
అవకాశం అస్తిత్వానికి అవసరమనే రంగద్దింది
ఇలాగైనా రంగువేసి నన్ను నేను మార్చుకుని
అబధ్దపు లోకానికి నా ప్రత్యేకతను చాటుకోనా?

21 comments:

  1. Welcome to 2019
    No never change
    Be what you are :)

    ReplyDelete
  2. The Truth is just a lie that hasn't been found out !

    మారండి 💑

    ReplyDelete
  3. వద్దు వద్దు వద్దు
    మారవద్దు----

    ReplyDelete
  4. మార్పు అవసరం అనివార్యం అనుకుంటే మారడమే మంచిది.
    చక్కటి చిత్రం.

    ReplyDelete
  5. అవకాశం అస్తిత్వానికి రంగు అద్దడం బాగుంది పద్మార్పిత

    ReplyDelete
  6. పాతలోగిలి లోనికి కొత్త కిరణం వచ్చి వాలింది..అంతే కొత్త ఒక వింత పాత ఒక రోత. కవితలు తగ్గిపోయాయి ఇది కూడా మార్పులో భాగమేనా?

    ReplyDelete
  7. ప్రకృతిని ప్రేమించే గుణం మంచిదే

    ReplyDelete
  8. అందమైన లోకం
    మీరు మారి మమ్మల్ని మారమనడం ఎందుకు?
    ఎవరికి నచ్చినట్లు వారు ఉంటే సరి సరి..

    ReplyDelete
  9. anukunnade cheyandi adagavalasi avasaram ledu...ha haha

    ReplyDelete
  10. ఎప్పుడూ ప్రత్యేకమే మీరు.

    ReplyDelete
  11. ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి అనుకోవడంకన్నా బహు విధంగా ఆలోచించి మార్పుచెందడం ఎంతో అవసరం.. మన ఎదురుగా ఉన్న వారు బాగున్నారు సంతోషంగా ఉన్నారు అనుకుని ఏడవడం కన్నా నేను అభివృద్ధి చెందాలి, అందరికన్నా భిన్నంగా ఉండాలి, ఏదో ఒకటి సాధించాలి. గుర్తింపు తెచ్చుకోవాలి. అనుకుంటే అందుకు అవసరమయ్యే ఆలోచనలు చేసి మారవచ్చు. మార్పును ఆహ్వానించు, లక్ష్యాన్ని సాధించు.

    ReplyDelete
  12. మారవద్దు అంటే షూట్ చేస్తారా ఏంది?

    ReplyDelete
  13. అబధ్దపు లోకానికి ప్రత్యేకత ఏం చాటాలి?
    అందుకే మారవద్దు....

    ReplyDelete
  14. ఆఖరి వాక్యాలు... ఆమోగం అర్పిత

    ReplyDelete
  15. పాతలోగిలిలోనికి కొత్తకిరణం రావడం అంటే మార్పులు జరిగినవి అనంటారా? అయితే మంచిదే కదా!

    ReplyDelete
  16. కోయిల పావురంలా సమాచారం అందించింది.

    ReplyDelete
  17. మీ స్పందన స్పూర్తులకు వందనమాల. _/\_

    ReplyDelete