యుక్తవయసొచ్చెనని సందేశంతో మొదలైన లెక్కలు
నెలనెలా క్రమం తప్పక వచ్చి అలవాటైన ఆ లెక్కలు
ఈమధ్య రాక అలుగుతున్నవి రెండుమూడు నెలలు!!
మదిమూల నీడై ఒదిగి జతగా పలుకరించిన లెక్కలు
అవసరం తీరెనో ఏమో మారాం చేస్తున్నవి ఆ లెక్కలు
అలవాట్లు మారేలా చిందులేసి చేసె అంకెలగారడీలు!!
తలపుకి రావలసినవి గుర్తురాక తప్పుతున్న లెక్కలు
వస్తుందనుకున్నప్పుడు రాక విసుగు తెప్పించే లెక్కలు
ముగిసిపొమ్మంటే వినక పట్టిస్తున్నవి ముచ్చెమటలు!!
అడ్డాలనాటి బిడ్డలు పెరిగి గెడ్డాలుపెంచి అడుగ లెక్కలు
అండాల సంఖ్య తరిగిపోయి తడబడుతున్నవిగా లెక్కలు
జవాబులేని చికాకులకి సమాధానం ఆగిన బహిష్టులు!!
శరీరమార్పుకీ మనుషుల్లో మార్పుకీ పొంతలేని లెక్కలు
అయోమయ గందరగోళంతో తైతెక్కలాడుతున్న లెక్కలు
ఇవన్నీ జీవితం తరిగిపోతున్నట్లు చేస్తున్న హెచ్చరికలు!!

ఆడవారి సాదకబాధల్ని కవితరూపంలో అందించారు...అబ్బురం
ReplyDeleteఅడ్డాలనాటి బిడ్డలు పెరిగి
ReplyDeleteగెడ్డాలు పెంచి అడుగుతున్న ప్రశ్నలు-వాస్తవికతకు దర్పణం.
నెలసరి నిలిచిపోవటం..బహిష్టులు ఆగిపోవటం..ముట్లుడిగిపోవటం..పేరేదైనా ప్రతీ మహిళ జీవితంలోనూ ఎదురయ్యే అనుభవమే. దీనికి మీరు సున్నితమైన భావాలను జోడించి మనిషి బాంధవ్యాలను మరచిపోతున్నాడని చెప్పకనే చెప్పిన తీరు ప్రశంసనీయం.
ReplyDeleteSerious matter in a casual way, expressing in poetic way is good.
ReplyDeleteజీవితం లెక్క తప్పినా మనం తప్పకూడదు లెక్క :)
ReplyDeleteమతిమరపు కామన్
ReplyDeleteకీళ్ళనొప్పులు కూడా
మనసు గురించి మాత్రం అడగొద్దు
ఆలోచనాత్మక విలువగల పోస్ట్.
ReplyDeleteస్త్రీ సహజత్వానికి సున్నిత రూపం
ReplyDeleteమెనొపాజ్ స్టేజ్ ని మెట్రొపాలిటన్ లెవల్ మనుషులకు లింక్ కట్టారు. భేష్ భేష్
ReplyDelete👍👍👌
ReplyDeleteఆడవారికి స్పెషల్..
ReplyDeleteమనుషుల్లో మార్పు సహజం
ReplyDeleteమహిళలు ఉన్నంత నిగ్రహ నిష్టలు పురుషుల్లో ఉండవు
మంచి సబ్జెక్టుకు అక్షరరూపం ఇచ్చారు.
స్త్రీ సమస్య సమాహారం.
ReplyDeleteప్రకృతిసిద్దమైన సమస్యలు పరిష్కారం సుచిశుభ్రం...అంతేనంటారా?
ReplyDeleteఅడ్డాలనాటి బిడ్డలు పెరిగి గెడ్డాలుపెంచి అడుగ లెక్కలు..touching line
ReplyDeleteChange unavoidable madam
ReplyDeleteజీవితంలో లెక్కలెట్లా తప్పుతం కరెక్ట్ నడుస్తే
ReplyDeleteమీ అందరి అభిమానమే నా అక్షరభావాలు...
ReplyDeleteఅందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు
manchi subject
ReplyDeleteస్త్రీ ఆదిశక్తి, ఏదైనా ఓర్చుకోగలదు.
ReplyDelete