ఏటిగట్టున ఎద..

మనసు మట్టికుండలాంటిది దాన్ని భద్రంగుంచన్నావు
మట్టికుండని గట్టిగా మలచినానని భరోసా ఇవ్వమంటే
కుమ్మరోడిని కాను కులికితే కుమ్ముతానంటున్నావు!

నా నాజూకు పలుకులకే పరవశించి ప్రేమించానన్నావు
పరవశానికి ప్రతిరూపంగా ఒక పట్టుచీరైనా ఇవ్వలేదంటే
నేతగాడిని కాను పట్టుకుంటే పట్టుచీరై జారిపోకన్నావు!

బట్టలెంత మురికైతేనేమి మానవత్వం ముఖ్యమన్నావు
మట్టిదేముంది మావా మంచినీళ్ళతో ఉతికేసుకోమనంటే
చాకలోడిని కాను చచ్చుసలహా ఇదని విసుక్కున్నావు!

పగలు కస్సుబుస్సలాడి రాత్రి ముద్దులతో ముంచేస్తావు
మాటలతో ముక్కలుచేసి మురిపాలతో కుట్లువేస్తావంటే
దర్జీని కాను కత్తిరించి కుట్లేయడానికని నవ్వుతున్నావు!

నిలువెత్తు బంగారాన్నని మభ్యపెట్టి వశంచేసుకున్నావు
నడుముకో వడ్డాణమైనా చేయించి విలువ పెంచరాదంటే
కంసాలిని కాను వగలుపోమాకే వగలాడి అంటున్నావు!

సముద్రమంత నీ జ్ఞానసిరులతో నన్ను కట్టిపడేసినావు   
స్వాతిముత్యమంటి స్వచ్ఛమైన నీవు సొంతమనుకుంటే  బెస్తవాడ్ని కానంటూనే నాఎదను ఏటిగట్టున విసిరేసావు!

ఏరికోరి ఎంచుకోగా నా గుండె రాజ్యానికి అధిపతివైనావు
నీ అనంతమైన సరససంపదలపై నాదేలే హక్కనుకుంటే
వృత్తి కాని రాజకీయ రాసలీలలాడి సంబరపడుతున్నావు! 

49 comments:

  1. ప్రియుడిపైన పగనో ప్రేమనో తెలియదు
    కవితలో మీ ప్రావీణ్యం కనబడుతుంది.

    ReplyDelete
    Replies

    1. ప్రేమ ఉన్న దగ్గరే పగ కూడా ఉంటుంది.

      Delete
  2. ఏరికోరి ఎంచుకున్న వాడిని ఎంతలేసి మాటలు అనటం తగదు కదండీ. లోన ప్రేమ బయట కోపం మీ కవితలో కనబడుతున్నాయి. చిత్రం సరిపడింది.

    ReplyDelete
    Replies
    1. ఎంచుకున్న వాడిని కాదు ఎవ్వర్ని అనకూడదండీ..

      Delete
  3. Chaduvtunte Evari medhoo unna kopam ila maatala roopam lo baitakochinatlu undhi. Kantam lo daachukunna bavaalu Kavita roopam lo kalla mundhu arpincharu- Arpita garu.

    ReplyDelete
    Replies
    1. evari meeda kopam chupiste evaru oorukuntaru cheppandi?
      Welcome to my blog Friend.

      Delete
  4. రొమాంటిక్ టచ్ ఇస్తారు అనుకుంటే తీపి తినిపించి తిట్టినట్లు ఉంది. మీరు దేనికైనా సమర్ధులు నేస్తం.

    ReplyDelete
    Replies
    1. రొమాంటిగ్గానే కోప్పడ్డానుగా

      Delete
  5. వృత్తులని పూలగుత్తులు చేసి కొట్టారు
    కోరికలు అడగలేదు అంటూ అడిగారు
    తీర్చడం ఎవరి తరం చెప్పండి?-?-?

    ReplyDelete
    Replies
    1. అంతగా కోరికలు ఏమడిగానబ్బా???

      Delete
  6. ఎద భారం తీరదు
    ఎందుకు వెళ్ళబుచ్చడం
    ఎదలోనే దాచుకోండి
    అదే పదిలం-----

    ReplyDelete
    Replies
    1. చెప్పకపోతే చెప్పలేదు అంటారు.

      Delete
  7. వావ్ అనుకోమంటారు

    ReplyDelete
  8. మేరు
    మేదరి
    వడ్రంగి ఇత్యాది వారిని మరచినారేల?

    ReplyDelete
    Replies
    1. నిజమే సుమా..ఈ వృత్తులకే న్యాయం చెయ్యలేదుగా

      Delete
  9. సమాజంలోని ప్రజలు జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు
    సంసారి కుటుంబాన్ని ఈదటానికి ముఖ్యంగా భ్యార నుంచి బయటపడటానికి వాడే ట్రిక్కుల్ని స్త్రీలు వంచన అంటారు...హా అహా హా
    ఏదో విధంగా జీవించాలి తప్పదు కదా పుట్టిన తరువాత పద్మార్పితాజీ..మీరు ఏమంటారు

    ReplyDelete
    Replies
    1. జో ఢరా ఓ మరా అని మీకు తెలియదా చెప్పండి.

      Delete
  10. అసలు సిసలైన వృత్తి రాజకీయం
    నేటి మేటి భేటి అది...తెలివైన వాడు మొత్తానికి ప్రియుడు

    ReplyDelete
    Replies
    1. రాజకీయ సీజన్ అంటారా?

      Delete
  11. మట్టికుండ ఎప్పుడో ఒకమారు పగిలిపోయేదే, ఎంతకాల్చినా రంగులువేసినా చిల్లుపడితే పనికిరాదు. పగిలిపోతే అతుకుపడదు. ఉన్నంత కాలమే మనది పోయిన తరువాత పులుస్టాప్. Good post and pic.

    ReplyDelete
    Replies
    1. జీవితాన్ని కుండ బ్రద్దలుగొట్టారు :)

      Delete
  12. ఘాటుగా నాటుగా వృత్తులు జోడించి మొట్టికాయలు వేశారు.
    చిత్రం సరిపోయింది.

    ReplyDelete
    Replies
    1. ఏమీ అనకపోయినా కొట్టాను అంటారు.

      Delete
  13. still ade pandhalo prema vyavaharam ennaloo

    ReplyDelete


  14. వృత్తుల జోడించిరిగా
    గుత్తుగ నాపై జిలేబి గుసగుస లన్ బా
    గొత్తుచు పద్మార్పిత! మీ
    రత్తరి తానిత్తరి కత రంజుగ సాగెన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అప్పుడప్పుడూ వచ్చి
      ముఖస్తుతి కోసమైనా
      పొగడరుగా-జిలేబీగారు

      Delete
  15. ఎద పడేయనేల
    ఏటిగట్టున కూకుని
    ఏరు గల గల వినక
    కూనీరాగాలు తీయక

    ReplyDelete
    Replies
    1. రాగాలు తీసి మనవి మనమే వినాలిగా

      Delete

  16. సముద్రమంత నీ జ్ఞానసిరులతో నన్ను కట్టిపడేసి..clever he is

    ReplyDelete
  17. eami kani nenu anni antara :)

    ReplyDelete
  18. చేతి వృత్తులు ఇప్పటికే నశించాయి...ఇటువంటి తరుణంలో మంచి పోస్ట్ వ్రాశారు.

    ReplyDelete
    Replies
    1. కనీసం ఇలాగైనా మెచ్చారు.

      Delete
  19. సముద్రమంత నీ జ్ఞానసిరులు

    ReplyDelete
  20. సముద్రమంత నీ జ్ఞానసిరులతో నన్ను కట్టిపడేసినావు
    ఇక్కడ సముద్రము అని ఏకవచనం, అటువంటప్పుడు జ్ఞానసిరులు అని బహువచనం వాడరాదు కదా? వచనైక్యత అన్నది కూడా ముఖ్యమే.

    ReplyDelete
    Replies
    1. వందనములు _/\_ ఇక పై శ్రద్ధ వహిస్తానండి.

      Delete
  21. వృత్తి విద్యల్లో ఉవ్వెత్తున లేచిన భావజాలం

    ReplyDelete
  22. మాటలకున్న పవర్ సూపర్ అనిపించారు

    ReplyDelete