మిగిలిపోనీ..

నా వలపు భావాలకు దిష్టి తగిలింది కామోసు
దిక్కుకొకటిగా ఎగిరిపోతే దిక్కుతోచక ఉన్నాను!

పంచిన అనురాగం పాచిపట్టి పాడైంది కామోసు
ఆపేక్షాకలిని అరువివ్వమని అడుక్కుంటున్నాను!

తపనపడే మనసుకి తాయత్తు కట్టాలి కామోసు
తాపత్రయం ఎక్కువై తలభారమై తిక్కగున్నాను!

వ్యధావేదనలు వెర్రెక్కి అరుస్తున్నాయి కామోసు
వేపమండలతో వదిలించుకోవాలి అనుకున్నాను!

గాయపడిన ఊసులకి ఏదో గాలిసోకింది కామోసు
ఉలిక్కిపడరాదని ఊరడించి విబూది రాస్తున్నాను!

బ్రతుకు భూతం నన్నింకా వదలకుంది కామోసు
బడితపూజ చేసి భరతం పట్టాలనుకుంటున్నాను!

ఆలోచనాక్షరాలు సయ్యపై పరుండాయి కామోసు 
పద్మార్పిత మధురభావంగా మిగిలితే బాగుండును!

21 comments:

  1. Gaya padina vusulaki Kurra-gali tagili untadhi. Vibhudi tho ooradinchaka oollasanga vureganivvu(kama",") Arpita.

    ReplyDelete
    Replies
    1. ullaasam vustaaham kaligitea evaru maatram aapagalaru nestam.

      Delete
  2. కనిపించని స్పష్టతను కళ్ళకు చూపించగల నైపుణ్యం కవితాచిత్రంలో.

    ReplyDelete
  3. మనకి మనం
    అద్దంలో చూసి
    ముఖాన్ని శుభ్రపరుస్తూ
    వీపుని దర్జాతో చూడాలి అనుకుని
    ముడుచుకుని మౌనంగా ఉంటే
    మనిషి పుట్టుక పెరిగేది ఎలా?
    ముడుచుకుని కూర్చుంటే
    పుట్టుకకు సార్ధకత ఏల?

    ReplyDelete
  4. బ్రతుకు భూతానికి బడిత పూజ బాగుంది

    ReplyDelete
  5. గాలి ధూళి సోకితే పోయేవా మీ భావాలు?
    వంకలేనమ్మ ఢొంకపట్టుకుంది అన్నట్లు చెప్పకండి..
    ఎందుకు వ్రాయడంలేదు అని అడగక ముందే మీరు చెబితే మేము ఒప్పుకోము..హా హా హా

    ReplyDelete
  6. aalochanalu seyyapaina padukovatam new thought. Nice Padmarpita

    ReplyDelete
  7. Lovely Picture with feels

    ReplyDelete
  8. అద్బుతమైన పాదాలు అనుభవం తో వచ్చిన భావాలూ మీరు రాసే ప్రతి పదం లోనూ కనిపించడం కాదు దర్శనం ఇస్తాయి

    ReplyDelete
  9. migiliporu
    eppatiki gundello untaru

    ReplyDelete
  10. తపనపడే మనసుకి తాయత్తు కట్టాలి..అవసరములేదు

    ReplyDelete
  11. పద్మార్పిత మధురభావం

    ReplyDelete
  12. bhavalu rastu unte gurtuku vastaru chadivinappudu. :)

    ReplyDelete
  13. మీకు భావాలు లోటు ఏమిటి పద్మగారు
    బొమ్మ భావము రెండూ బాగున్నాయి.

    ReplyDelete
  14. పోయంస్ వ్రాయనందుకు సంజాయిషీ బాగు బాగు
    ఇంతకూ ఇక పై అయినా భావాలు పొంగుతాయి అంటారా?

    ReplyDelete
  15. మీ గోడును వెల్లడించుకున్నారు.

    ReplyDelete
  16. వ్యధలు వేదనలు

    ReplyDelete
  17. మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  18. Missing your posts regularly.

    ReplyDelete
  19. Nice poetry
    Please continue writing

    ReplyDelete
  20. ధన్యవాదాలు అందరి స్పందనలకు._/\_

    ReplyDelete