నువ్వు ఎవరని నన్ను నిలదీసి ప్రశ్నించడానికి!?
నా జీవితం నాది నాఇష్టమొచ్చినట్లు జీవించడానికి
నువ్వు ముందు నిన్ను ప్రశ్నించుకో నన్ననడానికి
నోరెలా వచ్చింది పిల్లాడు వంశోద్ధారకుడు అనడానికి
అమ్మాయి పరాయి సొత్తని వేరు చేసి మాట్లాడ్డానికి!
నా తనువు ఎలా కప్పాలో తెలుసు రక్షించుకోడానికి
నువ్వు నిర్దేశించి నిర్ధారించకు నిన్ను కప్పుకోవడానికి
తప్పు నేను చేస్తే సంసిద్దురాలినినే సరిదిద్దుకోవడానికి
మధ్యలో నువ్వెవరో అర్థం అవ్వకుంది నన్నడగడానికి!
నా రేపటి వృద్ధికి ప్రేరణ కాదు చెప్పుకొని ఊరేగడానికి
నువ్వు సుత్తపూసవి ఏం కాదు నన్ను సరిచేయడానికి
గడిచిన కాలాన్ని తిరిగివ్వలేవు లోట్లు పూడ్చుకోడానికి
పోసుకోలు చెత్త మాటలు ఎందుకు కాలం గడపడానికి!
నా ఆలోచనలతో సరితూగవు నీ భావాలు చెప్పడానికి
నువ్వు తెలివైన వాడినని విర్రవీగకు జవాబులివ్వడానికి
సృష్టికర్తవా మగ ఆడవాళ్ళలో వ్యత్యాసం ఎత్తిచూపడానికి
కన్నవాళ్ళు అసలే కారు మంచిచెడ్డలు ఏవో చూడ్డానికి!
(ఏ పనీ లేక ఆ అమ్మాయి అలా ఈమె ఇలా అంటూ చెప్పుకు తిరిగే ఆటలో అరటిపండులకు అంకితం)
మీరు మాగొప్ప సమర్ధులు
ReplyDeleteMeeru cheppindi 100% true. Prati okkaru tothi vari individual opinions respect ivvali. Adhi Male or Female.
ReplyDeleteమీరు గాప్ తీసుకుని వ్రాసిన ప్రతీ పోస్టులో ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఇక పిమ్మట గాప్ తీసుకోకుండా రోజుకి ఒకటి వ్రాయండి.
ReplyDeleteపద్మార్పితగారూ..ఎవరినీ ఎవరూ ప్రశ్నించి లోపల ఉన్న నిజభావాన్ని పయట పెట్టించలేరు. అది వారి వారి స్వతహాగా తెలిప్తే తప్ప. ఇక మీ కవితలో స్త్రీని కానీ పురుషుడ్ని కానీ ఇలా ఉండూ అలా చేయి అని చెప్పగలం తప్ప చేయించలేము వారితో. ఏపని అయినా వారి ఇండివిజ్యువల్ అంతే అనుకుంటాను. చిత్రంలో స్త్రీ అరటిపళ్ళను ఆమెనే మోస్తుంది. అంటే అనే వారిని ప్రోత్సహిస్తున్నట్లే కదా.
ReplyDeleteకత్తిలాంటి పదాలతో పండ్లని కోసేసారు.
ReplyDelete
ReplyDeleteఈ అమ్మాయి యలారా
ఆ అమ్మాయో యిలార! అంటూ తిరిగే
ఆ అబ్బాయిలకంకిత
మీ అమ్మణి యరటిపండ్లు మింగుడుపడగాన్ :)
జిలేబి
మరో వాడి బాణం పురుషులపై సంధించారు.
ReplyDeleteమీరు రాసేవి ఒప్పుకోక చేసేది ఏముంది?:(
భలే అంకితం ఇచ్చారు ---మింగను లేరు కక్కను లేరు
ReplyDeleteనిజమే ఎవరిని అడగడానికి ఎవరు సరిపోరు.
ReplyDeleteGood writeup.
ReplyDeleteFantastic satire.
ReplyDeletePicture is in different view mam.
నా జీవితం నాది
ReplyDeleteనాఇష్టమొచ్చినట్లు జీవించడానికి
నువ్వు ముందు నిన్ను ప్రశ్నించుకో
నన్ననడానికి...super
మీ ఆలోచనలతో సరితూగే భావాలుమావి కాదు కాలేవు
ReplyDeleteintakoo evaru?
ReplyDeleteమీరు వ్రాయడమాపి ఆలోచిస్తున్న కొద్దీ ఆవేశం పెరిగి ఆగ్రహం అక్షరాల్లో పెల్లుబుకుతున్నది అనుకోవడానికి నిదర్శనం మీ ఈ పోస్ట్.
ReplyDeleteఆటలోఅరటిపళ్ళు అహా హా
ReplyDeleteఎక్కడ ఎక్కడ దాకున్నారు??
Happy holi to you nd your family.
ReplyDeleteపాతరోజు మళ్ళీ మళ్ళీ రావాలి
ReplyDeleteమీరు కవితలు వ్రాసి మెప్పించాలి
కవిత్వోత్సాహం నాడు విషెస్స్
ప్రపంచ కవితాదినోత్సవం నాడు మీరు పోస్ట్ వ్రాయకపోవడం విచారకరం. మేల్కొనండి పద్మార్పితాజీ
ReplyDeletewaiting for some different
ReplyDeleteనా రేపటి వృద్ధికి ప్రేరణ కాదు
ReplyDeleteచెప్పుకొని ఊరేగడానికి
నువ్వు సుత్తపూసవి ఏం కాదు
నన్ను సరిచేయడానికి
గడిచిన కాలాన్ని తిరిగివ్వలేవు
లోట్లు పూడ్చుకోడానికి..
అందరికీ పద్మార్పిత వందనములు_/\_
ReplyDeleteSuper painting
ReplyDeleteteliyadu telupandi
ReplyDelete