అమ్మకానికో ఓటు



నాకు నోటు ఇస్తేనే ఓటు వేస్తాను... 
అనే జనారణ్యంలో బ్రతుకుతున్న నేను 
నా ఓటుని కూడా అమ్మకానికి పెట్టాను 
చిట్టా విప్పండి చేసిన ఉత్తమ పనులను
తన్నుకుపొండి కారుచౌకగా నా ఓటును
చదువూ జ్ఞానం ఉన్న ఓటు నాదంటాను!  


ఐదేళ్ళకి ఒకమారు వేలంపాట వేస్తాను...
ఎవరి సత్తా ఎంతో నేనప్పుడే పసిగడతాను   
కొనేవారి దిమాక్ బలుపు ఎంతో చూస్తాను  
గెలిస్తే చేస్తామనేవారికి వేలం ఎందుకంటాను
దేశాన్ని ఉద్దరించేవాళ్ళు చేసి తీరతారంటాను
అవినీతిని నాదైన రీతిన ఇలా ఆడుకుంటాను!

   
ఉత్తమ ప్రభుత్వం కోసం ఓటు వేస్తాను...
నాఓటు నాఇష్టం ఎంతకైనా అమ్ముకుంటాను
విలువలేని వ్యర్థానికి అడిగే హక్కు లేదంటాను 
నోటుతో కొనుక్కునేవారుంటే ఓటు వజ్రమంటాను 
రేటు పలికిన నాడు మహరాణిలా దర్జాగుంటాను
అలాగని అల్లాటపాగాళ్ళకు నా ఓటు అమ్ముకోను!  

11 comments:



  1. అధిక రేటుకు ఇచ్చి కొనుక్కున్న వారికే అమ్ముతారు భేషు. అధికారం వచ్చాక అందలం ఎక్కి వెక్కిరించే వారు ఎందుకు ముందుగా కనీసం కొన్నైనా సంస్కారవంతమైన పనులు చేసిన వారు అయితే చాలు అని సున్నితమైన మాటలో నిగూఢ అర్థం తెలిపారు.

    ReplyDelete
  2. నోటుకు అమ్ముడైపోయారు అనుకుంటే అందర్ని ఎలర్ట్ అవ్వమని చెప్పారు...బాగు బాగు పద్మార్పితగారు

    ReplyDelete
  3. Concept is good.
    keep on writing.

    ReplyDelete
  4. మీకు అస్సలు నప్పని అంశం రాజకీయం

    ReplyDelete
  5. కొంపతీసి రాజకీయ రంగ ప్రవేశం చేసారా.

    ReplyDelete
  6. ఎన్నికలు! ఎన్ని కలలు?
    ---------------------

    పార్టీలు చేసే గారడీ
    సాటి రాదు ఏ పేరడీ
    అయిదేళ్ళు అసలు గడువు !
    సర్కారు ఎన్నాళ్ళు నడువు?
    వస్తే మధ్యంతరం!
    యిక లేదు గత్యంతరం

    అర చేతిలో స్వర్గాలు
    నోటికొచ్చిన వాగ్దానాలు
    ప్రేమతో తీస్తారు ప్రాణాలు
    దానికే పడుతారు జనాలు

    వర్గాలకు అగ్ర తాంబూలం
    మతం అవుతుంది మరో గాలం
    ప్రాంతల మాయ జాలం
    దేనికయిన అవుతారు గులాం!
    ఆ తెలివి తెటలకు సలాం!

    వెండి తెర బొమ్మలు ఆకర్షణ
    చూసేందుకు జనం నిరీక్షణ
    ప్రక్క పార్టీల దూషణ
    ఎవరు చేసేను విచారణ?

    నల్ల డబ్బు వెలుగు చూస్తుంది
    ఓటర్ల కళ్ళు మూస్తుంది
    సారా తెలివిని ముంచుతుంది
    భవిష్యత్తును తుంచుతుంది
    బ్యాలెట్ లో యింకు నింపుతుంది

    ఇస్తారు మరో సెలవు దినం
    ప్రజాస్వామ్యానికి తద్ధినం
    టీవీ ముందు సగం జనం
    విద్యావంతులు మరీ హీనం!
    తలపించె దట్టని వనం
    అవినీతి చేసే గానం

    నోటు కు లోకువ ఓటు
    భవితకు చేయు చేటు
    అభివృద్దికి తీరని లోటు
    తగిలేను ధరల ఘాటు
    జనానికే పడె వేటు
    ఎక్కడుంది హక్కులకు చోటు

    మన దేశంలో ఎన్నికలు
    తలపిస్తాయి తిరనాలు
    నిజంకావు సామాన్యుని కలలు
    తీరుస్తాయి తుచ్చ కోరికలు
    పేరుస్తాయి, సాలిడు వలలు

    ReplyDelete
  7. అందరి స్పందనలకు వందనములు.

    ReplyDelete
  8. మీకు అవసరమా చెప్పండి.

    ReplyDelete
  9. ఇంతకూ మీరు ఏ పార్టీ?
    :) :) :)

    ReplyDelete
  10. అర్థవంతమైన పోస్ట్

    ReplyDelete