ఒక హాయైన భరోసా!

నీమైనపు మాటలు నన్ను కరిగించునన్న తపనలో
నన్ను కలవరపెడుతున్న ప్రశ్నలన్నింటినీ ఆవిరిచేస్తూ
నవ్వే నీమోము ఓడిన నన్ను గెలిపిస్తుందనుకుంటాను..



నీవు నా తోడునీడ అనుకోవడమనే భ్రమ భ్రాంతిలో
అందులో నేను ఎప్పుడూ మునిగి త్రేలుతూ ఆలోచిస్తూ
బయటపడనూ లేను ఒంటరిగా ఒదిగి ఉండనూలేను..



నీదంతా నాదే నీలోన ఉన్నదంతా నేనేనన్న ఊహల్లో
నన్ను నేను ఓదార్చుకునే నెపంతో నిన్ను తలుస్తూ
నా పై నేనే అలిగి ఆక్రోషంలో నిన్ను తిట్టుకుంటుంటాను..

19 comments:

  1. ఆక్రోశం?
    ఉక్రోషం ?

    ReplyDelete
  2. ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

    ReplyDelete
  3. మీ భావాల్లో ప్రేమ మరల చిగురులు వేసింది...కొనసాగించండి.

    ReplyDelete
  4. తిడుతూ కూడా ప్రేమను పంచవచ్చు అంటారా?
    ఎంతఘాటు ప్రేమ అయినా తిడితే తుర్రుమనే రోజులు ఇప్పుడు.

    ReplyDelete
  5. ప్రేమ జీవనగానం
    మన పాడుతూ సాగిపోడమె

    ReplyDelete


  6. ఒక హాయైనభరోసా
    సకియా గెలిపించవోయి చక్కని నవ్వై
    సకలము నీవేనాకిక
    వకాలతును పుచ్చుకొంటి వనితా నీకై :)

    ReplyDelete
  7. హాయి హాయిగా ఆమని సాగె

    ReplyDelete
  8. ఏమో ఏమో ఏమిటో
    ఎందుకు ఈ హాయి
    భరోసా దేనికి కావాలి
    హాయి హాయి ఏలనో
    ఆపై వ్యధతో రోదన ఎందుకో
    ఏమో ఎందుకో తెలియదు..

    ReplyDelete
  9. ఎందుకో పాత పద్మార్పితను చూడాలని ఉంది.
    ఇప్పటి మీ భావాల్లో పాత పస కరువైంది.

    ReplyDelete
  10. నువ్వు నీకు మాత్రం ఇచ్చుకోవాలి భరోసాని అంతే కానీ ఎవరి నుండో భరోసాను కోరుకోవడం అవివేకం అనుకుంటా అర్పిత...ఆలోచించు-హరినాధ్

    ReplyDelete
  11. aite ika pai antha hayi

    ReplyDelete
  12. అవసరమా ఇటువంటి అనిశ్చల భరోసాలు.

    ReplyDelete
  13. నీవు నా తోడునీడ అనుకోవడమనే భ్రమ.

    ReplyDelete
  14. అయ్యయ్యో.. మిమ్మల్ని మీరు అలా అనేసుకోకండి. వీలైతే నన్ను తిట్టండి :))

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. ప్రతి స్పందనకు వందనం.


    ReplyDelete
  17. :) తప్పని స్థితి

    ReplyDelete