నాతోనే ఉండిపొమ్మని అరచి గోల చెయ్యాలి అనుకున్నాను
వెళ్ళకుండా నాకోసం నన్నంటుండే శక్తి నీది అనుకున్నాను
చెప్పలేకపోయాను..చెప్పానన్న భ్రమలోనే బ్రతికేస్తున్నాను!
నేడు నిన్ను తనివితీరా హృదయానికి హత్తుకోలేకపోయాను
కౌగిలిలో బంధించి ఇరుశ్వాసలతోపాటు కరిగించలేకపోయాను
నా ఊపిరున్నంత వరకూ నాతో ఉండమని అనలేకపోయాను
చెయ్యలేకపోయాను..ఏదో అనుకుంటా కానీ ఏమీ చెయ్యను!
నేడు నన్నూ నిన్నూ వేరుచేసేటి రేయినైనా ఆపలేకపోయాను
ఏమాయోచేసి నా మనోభావాల ముసుగుతో నిన్ను కప్పలేను
నువ్వు లేని నా పరిసరాలన్నీ నవ్వుతుంటే నేనూ నవ్వలేను
నిస్సహాయురాలిని నేను..ఏబంధంతోను నిన్ను కట్టివేయలేను!
నేడు నువ్వులేని నేను ఎంత అసంపూర్ణమో కూడా చూపలేను
అణువణువు నీ స్పర్శకోసం పడుతున్న తపన ఎలా తెలుపను
నువ్వు నావాడివై ఉండని ఏడ్చే ఎదఘోషను ఎప్పుడు చెప్పను
ఎన్నో చెప్పాలనుకునే నేను నేడేకాదు ఎప్పటికీ ఏమీచెప్పలేను!
మనసు భావాలకు దర్పణం.
ReplyDeletecheppalenu
ReplyDeletecheyyalenu
anukuni
anni chesaru
chestaru
హృదయాన్ని తడిమిన వాక్యాలు
ReplyDeleteచెప్పలేకపోయాను అంటూనే మొత్తం చెప్పేసారు
ReplyDeleteమీ భావాల్లో అన్నీ పొందుపరిచారు...కుడోస్
అవునా...
ReplyDeleteనిజమేనా
ఏమీ చెప్పలేకపోయారా!!!???
బొమ్మలో అమ్మాయి నాలా ఎంత అమాయకంగా ఉందో
ReplyDeleteandamaina aksharalu
ReplyDeleteఎన్నో చెప్పాలనుకునే నేను నేడేకాదు ఎప్పటికీ ఏమీచెప్పలేను. Ila antuneee Anni cheppesaru kani mee maatalu aa hrudayam ki eppudu cherutayo, ela cherutayoo.
ReplyDeleteబాగా చెప్పారు/
ReplyDeleteఇరుశ్వాసలు కరిగిపోనీ..డిఫెరెంట్ నైస్ ఫీల్
ReplyDeletebagundi ubikina bhavam
ReplyDeleteఎప్పటికీ ఏమీచెప్పలేను :(
ReplyDeletepainting nice
ReplyDeleteనాడు
ReplyDeleteనేడు
ఎన్నడూ
చెప్పలేని
విరహ
వేదన
Lovely cute
ReplyDeleteమెప్పించారు.
ReplyDeleteఏదో మీమాంసలో ఉన్నారు
ReplyDeleteప్రేమభావాలు ఇలా ఎన్నైనా మాట్లాడిస్తాయి.
ReplyDeleteఅందరి అభిమానానికి వందనములు.
ReplyDeleteచెప్పండి.
ReplyDelete