అన్నీ జరిగిపోతాయి

అనుకోకుండానే అన్నీ అయిపోతుంటాయి
ఏదో విధంగా పనులు జరిగిపోతుంటాయి
న్యాయం కోరుకున్నవారికి దొరుకునో లేదో
తనువుకైన గాట్లగుర్తులన్నీ మానిపోతాయి!

అనుకోనివి ఇష్టంలేదు కాదన్నా అవుతాయి
భయంకరమైన రాత్రులూ గడిచిపోతుంటాయి
కన్నీళ్ళు ఆవిరై గుండెమంటలు ఎగసిపడగా
ఎదురు తిరిగితే మౌనమే జవాబులౌతాయి!

అడగలేదని ఆగిపోక అవసరాలన్నీ తీరతాయి
తప్పించుకోడానికి వంకలెన్నైనా దొరుకుతాయి
మరపు వరమై అన్నీ సవ్యంగా సాగిపోతుంటే
ఆత్మగౌరవం అలలై అంబరాన్ని తాకుతాయి!   

అలసిన ఆశలేమో అంతరంగాన్ని ఊరడిస్తాయి
అణచుకున్న ఆవేదన ఉధ్రేకంతో ఎర్రబడతాయి 
ప్రమేయం ఏమీ లేవన్న భాధ్యతలు పెరిగిపోతే
అనుకున్నా అనుకోకున్నా  జరుగుతాయి!

25 comments:

  1. కొందరి విషయంలో అడక్కుండానే అన్నీ జరిగిపోతాయి అందరికీ అలా జరగాలని లేదు. ప్రయత్నించినా ఫలితం దక్కనివారు ఎందరో ఉంటారు.

    ReplyDelete
  2. ఆశ్చర్యం అలా జరిగితే

    ReplyDelete
  3. అనుకోకుండా మన ప్రమేయం లేకుండా జరిన వాటికి మనం బాధ్యులం ఎలా అవుతాము. మన ప్రమేయం లేకుండా జీవితాల్లో మార్పు రాదు. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే కదండీ.

    ReplyDelete
  4. jarigeavatini jaraganivvandi
    apadam anavasam

    ReplyDelete
  5. అలసిన ఆశలేమో అంతరంగాన్ని ఊరడిస్తాయి touching

    ReplyDelete
  6. బాగుంది

    ReplyDelete
  7. Super pic with heart touching lines

    ReplyDelete
  8. ఆశలకు అంతంలేదు
    అలసిన ఆశల ప్లేస్ లో కొత్త ఆశలు పుట్టుకొస్తాయి
    చిత్రము విభిన్నంతో కూడి లోతట్టు అర్థాన్ని ఇస్తుంది.

    ReplyDelete
  9. అవును సుమా అన్నీ వద్దనుకున్నా జరిగిపోతాయి

    ReplyDelete
  10. ఆత్మగౌరవం అలలై అంబరాన్ని తాకుతాయి nice

    ReplyDelete
  11. మీ అక్షరాలు కరువైనాయి.

    ReplyDelete
  12. జరగనీయడమే జరిగేవాటిని
    ఆపడం మీ తరమా నా తరమా?

    ReplyDelete
  13. అనుకోకుండా అన్నీ జరిగినా
    మీరు మాత్రం అనుకుంటేనే వ్రాయగలరు
    పద్మార్పితగారూ...అనుకోండి
    అనుకుని వ్రాసేయండి.

    ReplyDelete
  14. అహా హా... అంతే అంతేగా

    ReplyDelete
  15. వ్యధలు కాలసర్పమై కబళించెనా?

    ReplyDelete
  16. ఎందుకు
    అలా అనుకోకుండా
    ఇష్టం లేకపోయినా
    అన్నీ జరిగిపోతుంటాయి.

    ReplyDelete
  17. మిస్ అవుతున్న ఛాయలు

    ReplyDelete
  18. అందరి ఆదరాభిమానాలకు పద్మార్పిత వందనం.

    ReplyDelete
  19. ఎక్సలెంట్

    ReplyDelete
  20. ఆలోచనా విధానంలో మార్పు బాగుంది

    ReplyDelete