ఏంకావట్లేదు..

ఆకలిని ఓర్చుకునే ఓపిక నశించి రుచులపై వెగటుపుడితే
పంచభక్షపరమాన్నాలు ఎలా ఆరగించాలో అర్థంకావట్లేదు!

ఒంటరితనపు ప్రియమైన శత్రువుతో ప్రేమలో కూరుకుపోతే
తోడుకై తనువుకు తాళి ఎలా కట్టించుకోవాలో తెలియట్లేదు!

చీకటికి అలవాటుపడిన చూపు వెలుగుపై విసుగుచెందితే
కాంతులీను భవిష్యత్తని కాటుకభ్రమని కళ్ళకు పూయట్లేదు!

నిరాశసెగల వేడికి పట్టుదలే నిట్టూర్పై కరిగికాలువై పారితే 
వెక్కిరించే మార్పుతో ఎక్కడికెళ్ళాలన్నా దారి కానరావట్లేదు!

స్వశక్తి సన్నగిల్లి స్వయంకృతాపరాధ వ్యధలతో ఆడుకోబోతే
అగుపించని ఎదభారంతో జీవితాన్నెలా నెట్టాలో చేతకావట్లేదు! 

నాకు నే నిబ్బరపడి నగ్ననిజంతో శూన్యంలో రమించబోతే 
కన్నీటికి చులకనైపోతానని తెలిసి కూడా నవ్వు రావట్లేదు!!  

23 comments:

  1. భావజాలం పొందుపరచడంలో మీకు మీరే సాటి.
    kudos padmarpita.

    ReplyDelete
  2. Tanaki thanu karigipotha, thana bhavalatho parulaku veluguni panchutunna Ma Padmarpita ki Paadabhi vandanam.👏

    ReplyDelete
  3. అమోఘమైన భావప్రకటన
    చిత్రంలో స్త్రీ తనకు తాను కాలుతూ వెలుగునిస్తూ మైనం బొమ్మా?
    అద్భుత:

    ReplyDelete
  4. అనంతానంత భావలహరిలో ఊగిసలాడాము చిత్రంతో పాటుగా

    ReplyDelete
  5. స్వశక్తి సన్నగిల్లి స్వయంకృతాపరాధ వ్యధ-మీకు మీరుగా నిర్థారించుకున్నారు

    ReplyDelete
  6. ఈ రోదనకు అంతంలేదు.

    ReplyDelete
  7. చీకటికి అలవాటుపడిన చూపు వెలుగుపై విసుగుచెంది...marvelous feel

    ReplyDelete
  8. ఒంటరితనం ప్రియశత్రువు
    నూతన ప్రయోగం నచ్చింది

    ReplyDelete
  9. హృదయం ద్రవించే భావం, చదివిన ప్రతీసారి కొంక్రొత్తగా

    ReplyDelete
  10. ee chitram mee identity na?

    ReplyDelete
  11. నిరాశ సెగలు మిమ్మల్ని అంటిపెట్టుకుని కాపురం చేస్తున్నాయి అవి వీడవు.

    ReplyDelete
  12. నమస్సులు _/\_

    ReplyDelete
  13. wow mam great expressions

    ReplyDelete
  14. సంతృప్తికర జీవితం ఎవరిదీ కాదని తెలుసుకుని మసలితే మనసుకి ఓదార్పు దక్కుతుంది

    ReplyDelete
  15. నిబ్బరపడి నగ్ననిజంతో శూన్యంలో రమించబోతే..వావ్ తిరుగులేని పదాలు

    ReplyDelete
  16. మియ్యావ్ మియ్యావ్...అనాలే అంతే

    ReplyDelete
  17. పంచభక్ష పరమాన్నాలు తినగలిగే అవకాశం ఉండి
    మీకు రుచించకపోతే, ఆకలిని ఓర్చుకుంటున్న వాళ్ళకు పంచండి.
    అప్పుడు ఒంటరితనపు ప్రియమైన శత్రువు పై మీ ప్రేమ కరిగిపోతుంది.
    కాటుకను కళ్ళకు పూయని మీరు, ఆ కాటుకను చీకట్లో మనసుకు రాసేసుకున్నారు
    అది తుడుచుకుంటే మీ కళ్ళు వెలుగుకు అలవాటుపడతాయి.
    పట్టుదల కరిగి కాలువైనప్పుడే... ఆ ప్రవాహంలో అసలైన దారి కనిపిస్తుంది
    అది వెక్కిరించే మార్పుకాదు, మీరు ధిక్కరించిన మార్పని తెలుస్తుంది
    స్వశక్తి సన్నగిల్లినప్పుడే ఆసరా కావాలి. ఎద భారాన్ని ఇచ్చి పుచ్చుకోకుండా
    మరో స్వయంకృతాపరాధమా? వ్యధలేని ఎద ఎక్కడుందని??
    మీ నిరాశకంతా కారణం కన్నీటికి చులకనైపోతారన్న భావనే.
    అదే ఇంటర్మీడియట్ పిల్లల ఆత్మహత్యలకు కూడా కారణం.
    నవ్వే మీరైనప్పుడు నవ్వాలన్న ఆశ అత్యాశ కాదా?

    ReplyDelete
  18. నే రాసే భావాలకు ప్రతిస్పందనలతో స్పూర్తినిస్తున్న ప్రతి ఒక్కరికీ పద్మార్పిత ప్రణామములు.

    ReplyDelete