రంగులకల..

అందమైన ఏడురంగులతో స్నేహం కుదిరిందన్న ఆనందంలో 
జీవితంతోటన్నా పద కలలుకన్న కళ్ళతో జూదమాడేద్దామని

సూర్యకిరణాల్ని దొంగిలించి ఎవ్వరికీ కనబడకుండా దాచేసి..
అక్కడొక కొత్త ఉదయం సృష్టించి దాని మనసు దోచేద్దామని!

పొగమంచు కరుగ వెలుగు తోరణాలను వరుసగా పేర్చేసి..
తోరణమట్టుకు జారే నీటి తుంపర్లతో మదిదాహం తీర్చేద్దామని! 

మధ్యాహ్నం సృష్టిగా భోంచేసి చెట్టునీడన నడుము వాల్చేసి..
ఊగుతున్న ఆకులతోపాటు ఊహల్ని కూడా ఊయలూపేద్దామని!

సంధ్యవేళ మారాంచేస్తూ ఎగిరేకురులను మందలిస్తూ ముడేసి..
అస్తమిస్తున్న సూర్యుడితో అలసిన ఆశల్ని నిదురపుచ్చేద్దామని!

చంద్రుడు చిన్నగా ఈలవేసి పిలువ ఆశేమో చిలిపిగా నవ్వేసి..
తెల్లచీర చుట్టుకుని సృష్టికార్యానికి సిద్దమయ్యే ఏదో ఉద్దరిద్దామని! 
   
తెల్లారితే నలిగిన చీరసర్దుకుని దుప్పటి మడతేసి దిశ మార్చేసి..
రంగులని రంగరించి కొత్తరంగును చేయడమే జీవితమనుకుంటాను
     

27 comments:

  1. రంగుల కల(ళ)లతో రోజుకో జీవితం గడిపెద్దామనే .. ఆశ దోష అమ్మవండ నీశ...

    ReplyDelete
  2. కవిత కన్నా మీరు పెట్టే ఇమేజులు అబ్బా .. భలే ఉంటాయండీ..

    ReplyDelete
  3. ఏ రంగు దేముంది విజిబల్ స్పెక్ట్రమ్ లో డిస్పర్స్ స్కాటర్ అవుతు రిఫ్లెక్ట్ అయ్యే కాంతి పుంజం
    ఏ భావాని దేముంది ఎగోని ఎమ్పతి తో మొదలయ్యి ఎమోషనల్ కోషంట్ ను మనసులోతుల నుండి వ్యక్త పరిచే భావోద్వేగం
    ఏ వ్యాధి దేముంది కఫ్ కోల్డ్ తో మొదలయ్యి ఫీవర్ కాస్త ముదిరి వొళ్ళంత హూనం చేసే అయోమయ రోగం

    ఐనా
    భయ భ్రాంతులకు గురి కాకుండ జాగ్రతను పాటిస్తే ఏ రోగమైన పటాపంచలే (కోవిడ్ ౨౦౧౯ మినహాయింపు)
    రాగ ద్వేషాలకు లోను కాకుండ ఆనందం వైపు సుముఖత పెంపొందిస్తే తక్కిన వన్ని పటాపంచలే (ఎమోషనల్ ఇంటిలెక్ట్ మినహాయింపు)
    ప్రకృతి మిళితమైన సౌందర్యాన్ని ఆరాధించాలంటే రంగుల కుంచె నుండి జాలువారే కాంతితో చీకటంత పటాపంచలే (అల్ట్రావైలెట్ [అతినీలలోహిత] మరియు ఇన్ఫ్రారెడ్ [పరారుణ] మినహాయింపు)

    ~శ్రీ

    ReplyDelete
    Replies
    1. ఒకరి ఔనత్యం వారి సత్ ప్రవర్తనలో తెలుస్తుంది

      మంచితనం అనేది ఎంతటి వారినైనా ధర్మం వైపునకే దారి చూపుతుంది. అదే చెడ్డతనం ఎంతటివారినైనా పతనం వైపునకే మళ్ళిస్తుంది.

      మంచివారి ఆస్తి అణగారదు.. చెడ్డవారి ఈర్శ్యాసూయకు అంతుండదు.. బంధానికి విలువ ఇచ్చేవారికి ఆ దేవుడే శ్రీరామ రక్ష.. ఆస్తి అంటే ధనముతో పాటు బంధాలకు ఇచ్చే విలువ.. విధేయత.. సంస్కారం

      Delete
  4. Colorful Life is not possible to everyone.

    ReplyDelete
  5. రంగుల మిళితం కాదు జీవితం మనం మలుచుకోవాలి అంటారా?
    చిత్రము చాలాబాగుంది.

    ReplyDelete
  6. మార్చేస్తే మారనది
    దాచేస్తే దాగానది
    మనిషికి మనసుకి
    మధ్య మాయన్నది ఒక్కటి చాలు...
    కదా...ఈ రంగుల ప్రపంచానికి...!

    ReplyDelete
  7. ఏడురంగుల ఇంద్రధనస్సు మాత్రమే కాదు జీవితం మరెన్నో రంగుల మిశ్రమం. ప్రకృతిలోని రంగు రంగుల పూలను, పచ్చని చెట్లను, చెట్టకొమ్మల మీద కూర్చుని గుసగుసలాడే గువ్వలను, ఆకాశ వీధిలో ఎగురుతున్న పక్షులను చూస్తుంటే జీవితం పట్ల ఆసక్తి ఆశలు పెరుగుతాయి. నిరుస్తాక పడకుండా దారిమార్చి జీవించడమే మనం చేయగలిగింది.

    ReplyDelete
  8. Emotional touch undi feel. Very nice pic madam.

    ReplyDelete
  9. జీవితం అనేక రంగుల సముదాయం. మన భావాలకు, ఆవేశాలకు సైతం అనేక రంగులు ఉన్నాయి. ప్రతి మనిషీ అనేక రంగుల భావాలను వెదజల్లే ఫౌంటెన్‌లాంటి వారే. రంగులు మారుతూ ఉంటాయి. కోరికలు అగ్నిలాగా అందరినీ కాల్చివేస్తూ ఉంటాయి. అయితే జీవితం రంగులమయం చేసుకోవాలి. ప్రతీ రంగునూ స్పష్టంగా చూసి ఆస్వాధిస్తే అవే కోరికలు జీవితానికి కొత్త అందాన్నిస్తాయి. వివిధ రంగులు సామరస్యంగా కలిసి ఉండే తీరూ జీవితాన్ని ఉత్సాహభరితంగా, ఆనందపూరితంగా, మరింత అందంగా చేస్తుంది.

    ReplyDelete
    Replies
    1. Prasadgaru how are you?
      My son not joined.

      Delete
  10. అంతరంగంలో వ్యధను దాచి పెట్టి వ్రాసిన పంక్తులు.

    ReplyDelete
  11. పదాల పొందికలో ఎక్కడా లోటు రానీయవు కదా!

    ReplyDelete
  12. ఇంతేనమ్మా ఈ జీవితము తిరిగే రంగులరాట్నం

    ReplyDelete
  13. మాషాల్లాహ్...నిగూఢ అర్థం నిండింది

    ReplyDelete
  14. Fantastic
    Life is very simple to write
    Hard to Live.

    ReplyDelete
  15. అంతర్లీనంగా భావం దాచినట్లున్నారు. చిత్రం చాలా బాగుంది.

    ReplyDelete
  16. ఊగుతున్న ఆకులతోపాటు ఊహల్ని కూడా ఊయలూప...you touch like this

    ReplyDelete
  17. Red, Green, blue, yellow,purple, brown, pink inka chala colors unnayi

    ReplyDelete
  18. కొత్త ఉదయం సృష్టించి
    దాని మనసు దోచివేసి
    అద్భుతమైన ఊహలు..

    ReplyDelete
  19. అందరి అభిమాన స్పూర్తి స్పందనలకు వందనములు-మీ పద్మార్పిత

    ReplyDelete