మహిలో మహిళ

అన్న రాముడి వెంట వెళ్ళుతూ ఒక్క మాటైనా నన్నడక్కపోతివి కదా లక్ష్మణా
నీవు లేనప్పుడు నిద్రపోక ఊర్లపొంటి నే తిరిగుంటే ఏమైయుండేదో నీ క్రమశిక్షణ  
రాముడు తోడున్నా సీతకు కావలి కాస్తివి కట్టుకున్న భార్యకు అక్కర్లేదా రక్షణ!
లక్ష్మణ గీత దాటిన సీత గతి ఎరుక అందరికీ కానీ ఎవరికి తెలుసునని ఊర్మిళ

రాకుమారుడై అన్నీ అనుభవించి జ్ఞానమని చెప్పకుండా ఉడాయించిన సిద్ధార్ధుడా 
కాపురంచేసి కావల్సింది పొంది సంసార బాధ్యతల్ని మరచిపోయినోడొక సమర్ధుడా
బ్రతుకు వెలిగించుకోవాలని ఆమే వెళ్ళుంటే గౌతముడు బుద్ధుడై కీర్తింపబడేవాడా!    
భౌద్ధభోధనలో సమస్తసారం తెలిసిన వారిని ఎవరినైనా అడక్కపోయావా యశోధర

పదితలలు ఉన్నప్పటికీ ఒక్క తలలో కూడా మెదడు లేకపోయెకదా రావణాసురా
పెరటిచెట్టని వదిలేస్తివే కానీ నాకన్నా అందంతెలివిహోదా ఆమెలో ఏమి చూస్తివిరా
అన్నీ ఉండి కూడా నిన్ను అదుపులో పెట్టుకుని నా కొంగుకు కట్టుకోకపోతినిరా!
బావిలోకప్పనై నీకు ఆలినైనా చివరికి విభూషణుడికి భార్యగా మిగిలెనీ మండోదరి  

చక్రవర్తివై ఉండీ సతిని సుఖపెట్టలేని నీవు లోకానికి మాత్రం సత్యహరిశ్చంద్రుడివా
భర్తనువాడు భార్యపిల్లల్ని రక్షించాలి కానీ అమ్ముకోవడం ఏమిటని అడగరాదంటివా
దొంగ హంతకురాలిగా నిందభరించి దాసినై పుత్రశోకం భరిస్తే నీవే నరకబూనితివా! 
సత్యసంధ స్ధిరచిత్త స్థితప్రజ్ఞ ధీరోదాత్త నీవు నాకొచ్చినపేరేమో మతిలేని చంద్రమతి 

పురుషుడు గొప్పవాడిగా కీర్తించబడాలని స్త్రీ ఎన్నింటిని త్యాగం చేసినా మెచ్చరుగా
అదే స్త్రీ తన ప్రత్యేక గుర్తింపుకోసం అడుగు బయటవేస్తే బరితెగించింది అంటారుగా
స్త్రీ ఉన్నతి వెనుక పురుషుడున్నాడేమోనని పురాణచరిత్రల్లో వెతికా కనబడలేదుగా
మీకు తెలిసినవి జరిగేవి జరుగుచున్నవి వ్రాస్తే చదివి సంతోషిస్తుందిగా పద్మార్పిత   

28 comments:

  1. మీరు పురాణాలలో ఉన్న వారిని అడిగి ఎలాగో లాభం లేదు అక్కడ ఎలాగో వారు కనబడరు. కనీసం నేటి కాలంలో ఎవరైనా దొరుకుతారేమో వెతికి చూడండి.
    చాల చక్కని ఆలోచించే విధంగా ఉంది మీ పోస్ట్. అభినందనలు పద్మార్పిత

    ReplyDelete
  2. చాలా గంభీరమైన ఆలోచనాత్మక పద్యం. అప్పుడు ఎల ఉండేవారో చూడలేదు. ఇప్పుడు ఉండే ఉంటారు పద్మగారు.

    ReplyDelete
  3. స్త్రీమూర్తులు వారి సద్గుణాలకు సేవ స్ఫూర్తికి త్యాగ నిరతికి ఆనవాలు
    అలానే
    పురుషపుంగవులు వారి విధేయతకు విశ్వసనీయతకు నిరాడంబరతకు తార్కాణం

    గుణగణాలనిటిని ఏకరూపు పెట్టినా ఎవరి ఔనత్యం వారిదే
    మహిలో మహిషాసురుడు జనియించాడు కృష్ణుడు అవతరించారు
    ధరిత్రిన శూపణఖ జనియించింది సీతమ్మ అవతరించారు

    ఎవరు గొప్ప ఎవరు కాదు అనే విశ్లేషణ కంటే వారి వారి సత్కార్యాలతో వారి ఔదార్యాలతో దైవగుణం కలిగిన వారు పూజింపబడుతున్నారు నేటి కాలం లో సైతం.
    సద్గుణాయ సర్వత్ర పూజయతే న ఖలు దుర్గుణ
    యత్ సద్గుణ దైవచింతితం దుర్గుణమపి దానవగుణమితి
    సత్ దుః గుణద్వయమితి సమ్మిళిత ఆయుః వర్ధతె క్షీణితే యత్ మానవ లక్షణమితి

    సద్గుణం కలవారిని ఏచోటనైన పూజింతురు అదియే దుర్గుణం కలవారి చెంతకు ఎవరు రారు. సద్గుణం కలవారికి దైవ చింతన ఉంటుంది.. క్లేషం కలవారే దానవ గుణమువారు. ఈ సత్ దుః గుణాలను వారి వారికణుగుణముగా మలచి ఆయుర్ధాయం లేదా ఆయుక్షిణ గుణం కలవారే మానవులు

    యశః కీర్తి వర్ధయేత్

    ~శ్రీ

    ~శ్రీ

    ReplyDelete
  4. Excellent Post with different pic...kudos

    ReplyDelete
  5. mahataram me alochanalu
    meru prasninchinateru chala bagundi

    ReplyDelete
  6. పౌరాణిక పాత్రల్లో మగవారికి అహం అడ్డు వచ్చేది ఆడవారిని పొగడాలి అంటే. ఇప్పుడు అటువంటి వాటికి మేము దూరం సుమా.
    అన్నింటికీ ఇంట్లో అవిడపైనే ఆధారపడతాము. అందుచేత పెత్తనమూ అమెకే ఇస్తాము.

    ReplyDelete
  7. Padma awesome post.
    Comparing with mythological characters is appreciable, keep it up.

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. స్త్రీ పురుషుడి ఉన్నతి కోసం అహర్నిశలు కష్టపడి ప్రొత్సహించినా అదేం గొప్ప విషయం కాదు భాధ్యత అంటారు. అదే మగవాడు ఏదైనా కాస్త వంటలో సహాయం చేసినా అదేదో గొప్ప విషయంగా చెప్పుకుంటారు. ఏమైనా అన్నామంటే ఆడది అంటే అణగిమణగి చేసుకుని పోవాలి ఆమెకు భూమాతకు ఉన్నంత సహనం కావాలని చెప్పుకొస్తారు. ఇలా చెప్పుకుంటే ఆడవారి కష్టాలు బోలెడన్ని ఉన్నాయి ఉంటాయి. చెప్పుకోకుండా మేకపోతు గాంభీర్యం చూపించి నెగ్గుకుపోవడమే.
    మంచి డిఫెరెంట్ సబ్జెక్ట్ తో చక్కగా అల్లిన ప్రశ్నల పదకవిత ప్రశంసనీయం.

    ReplyDelete
  10. అణగద్రొక్కడం ఏమిటి ఆడవారు లేనిది మేము లేమని ఒప్పుకునే మాబోటి వారి గురించి ఆలోచించండి :)

    ReplyDelete
  11. ఎవరినో ప్రోత్సహిస్తాం అంటే ఎవరూ ఒప్పుకోరు పైగా తిట్టి నాలుగు తగిలిస్తారు. ఇంట్లో పెళ్ళాన్ని కట్టుబొట్టు మార్చుకుని పద్దతిగా ఉండమని అంటేనే నాయిష్టం అంటుంది. ఇక ఎవరిని అని ఏం చేస్తాము :)

    ReplyDelete
  12. No comments
    Superb Madam, salute to your thoughts.

    ReplyDelete
  13. పుట్టుకతో మొదలు చావు వరకూ తనకి తనే ఒంటరి ప్రశ్నగా మిగిలిపోతోంది, అలా కానీయకండీ ..స్త్రీని వస్తువులా చూడకండి మనిషిగా చూడండి. స్వేచ్ఛ, స్నేహతత్వం పెంచండి. మమత మానవత్వం పంచి ఆమెకు ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొనే శక్తిని కల్పించండి.

    ReplyDelete
  14. మగాళ్లను ఇస్త్రీ చేసే స్త్రీవాద కవిత!!

    ReplyDelete
  15. ఆచార వ్యవహారాలు…మూఢ విశ్వాసాలు వద్దన్నా మహిళల పాలిట శాపాలుగా మారుతున్నాయి. వాటి నుండి బయటపడితే మంచిది.

    ReplyDelete
  16. ఎవరితో మాట్లాడాలి
    ఎవరితో వెళ్ళాలి
    ఎక్కడికి వెళ్ళాలి
    మగాడి నిర్దేశన మారాలి
    లేదంటే స్త్రీ అపరకాళీ అవ్వాలి

    ReplyDelete
  17. సూటిగా ప్రశ్నించారు.జవాబు నాకు తెలిసి 10% కుడా ఉన్నారు అని రాదు. ఎందుకంటే ఏరు కాబట్టి.

    ReplyDelete
  18. మీ ఆలోచనలు అమోఘం
    ఎంతో పరిణితి చెదితేనే ఇటువంటి భావాలు పెల్లుబుకుతాయి. అభినందనలు

    ReplyDelete
  19. ఇంత ఘోరంగా ఆలోచించ వచ్చా????
    ఎందుకు అలా ప్రశ్నించడము బాధపడడము?
    ఉన్నదానితో తృప్తి పడొచ్చు అనుకుంటే.

    ReplyDelete
  20. meeru daivatvaniki vyatireki, nastikulu anukuntanu.

    ReplyDelete
  21. "పురుషుడు గొప్పవాడిగా కీర్తించబడాలని స్త్రీ ఎన్నింటిని త్యాగం చేసినా మెచ్చరు"...ఏమో ఇకడ ఫుల్ పొగుడుతుంటేను

    ReplyDelete
  22. తాడవం ఆడి అడిగిన ప్రశ్నలు.

    ReplyDelete
  23. ఆలోచనాత్మకతో కూర్చిన కవి భావం.

    ReplyDelete