దూరమై దగ్గర!

కొందరు మనకు దగ్గరగా ఉన్నట్లే ఉండి
జ్ఞాపకాల్లో మాత్రమే సజీవంగా ఉంటారు
మనకి తెలియకుండా మనల్ని నిలదీస్తూ
మన భావాల్లో బ్రతికేస్తూ బ్రతికిస్తుంటారు!

గిరిగీసి రాసుకున్న నిఘంటువులో ఉండి
అదృశ్యహస్తమై వాళ్ళతో తీసుకునిపోతారు
మెదడు మొద్దుబార్చి వారివెంట నడిపిస్తూ
స్వనిర్ణయ అజ్ఞానులుగా మార్చేస్తుంటారు!

పెంపుడు పావురాల్లాంటి పదాలుగా ఉండి
అక్కరకొచ్చినట్లు అక్కడక్కడా వాలిపోతారు
మొండిమనసుని శోఖసాగరం చేసి రోధిస్తూ
పరాకష్టగా పరాయీకరణ దోవన వెళతారు!

అంతరంగోద్భవ చెరసాల్లోనే ఖైదీలుగా ఉండి
చేతకానితనాన్ని చెదలకు ఆత్మార్పణచేస్తారు
నిర్జీవ ప్రాణాన్ని పెకిలించినా నవ్వీ నవ్విస్తూ
జీవించమంటూ ఆత్మహత్యకి ఉసిగొల్పుతారు! 

25 comments:

  1. మార్వలస్ భావోధ్వేగం

    ReplyDelete
  2. దగ్గరై దూరమైనపుడు భావాలు భావోద్వేగాలు ఉబికి వస్తాయి
    దూరమై దగ్గరైనపుడు రాగద్వేషాలు సమాయత్తమౌతాయి
    ఇమోషన్ క్యారీడ్ డీప్లి
    ఇన్ వర్డ్‌స్ సో సింప్లి
    నది కినారా సాఫ్ నజరాయే మగర్
    నది కీ గహరాయి ఆఁఖోఁ మేఁ నజర్ న ఆయే

    ReplyDelete
  3. అద్భుతం పదాలతో మనసుని మెలిపెట్టారు పద్మార్పితగారు. సలాములు.

    ReplyDelete
  4. Excellent andi.
    No words simply superb.

    ReplyDelete
  5. ఎంతో అంతరంగ మదనం చేస్తేనే ఇటువంటి అక్షరమాలలు అల్లగరు. అందులో మీరు సిద్దహస్తులు అని మరోమారు రుజువు చేసారు. అభినందనలు మీకు

    ReplyDelete
  6. amazing pics collection

    ReplyDelete
  7. మీ ఈ వ్రాసేశైలి ఎప్పటికీ మనసులో ఉండిపోతుందండీ
    మరిన్ని అద్భుతమైన అక్షరాలు మీ భావజల్లుగా కురియాలని ఆశిస్తూ

    ReplyDelete
  8. పద్మగారు అద్భుతం మీ భావాక్షరాలు.

    ReplyDelete
  9. ఎప్పటిలానే మీ మనోభావాలు మనసుని తాకినవి.

    ReplyDelete

  10. అంతరంగోద్భవ చెరసాల్లోనే ఖైదీలు excellent line

    ReplyDelete
  11. పాత పద్మార్పిత మళ్లీ పుట్టింది 🥰

    ReplyDelete
  12. జ్ఞాపకాల్లో మాత్రమే సజీవం..yes true

    ReplyDelete
  13. chala ghabheerathanu vellabuccharu kavitalo padmagaru. vhitramu chaala aakarshaneeyamtho koodindi.

    ReplyDelete
  14. అత్యద్భుతం

    ReplyDelete
  15. పద్మార్పితా...ప్రతీ పదమూ మనసుని హత్తుకోవడమే కాకుండా ఆలొచింపజేసే విధంగా వ్రాసి మనసులో గుర్తుండిపోయే చిత్రముతో అలరించావు. అభినందనలు.

    ReplyDelete
  16. నిర్జీవ ప్రాణాన్ని పెకిలించినా నవ్వీ నవ్విస్తూ...ఎంతో లోతైన భావం

    ReplyDelete
  17. అగాధం అంత లోతైన హ్రుదయ ఘోష అనుకుంటాను
    చిత్రములో చిన్నది కళ్ళలోనే వ్యధను చూపిస్తుంది..ఫిదా

    ReplyDelete
  18. మనసు దోచినవారు అన్నింటా ఉన్నాము అంటూనే లేకుండా కేవలము జ్ఞాపకాల్లోనే ఉంటారు. పద్మార్పితగారూ ఇది అందరికీ వర్తించదు. కొందరు కలిసి కాపురం కూడా చేస్తుంటారు. ఏమైనా మీ ఆలోచనాత్మక భావాలకు సలాం.

    ReplyDelete
  19. గిరిగీసి రాసుకున్న నిఘంటువు...superb

    ReplyDelete
  20. నా భావార్తిని ఆదరిస్తున్న అందరికీ నెనర్లు _/\_

    ReplyDelete
  21. భావోధ్వేకంలో నిగూఢత దాగి ఉన్నది.

    ReplyDelete
  22. అందంగా అల్లిన కవిత.

    ReplyDelete